PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/elections2c977aa7-53bf-4397-a88f-e33f700719a3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/elections2c977aa7-53bf-4397-a88f-e33f700719a3-415x250-IndiaHerald.jpgవిజయనగరం.. ఈ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది రాజరికమే.. గజపతి రాజుల గజకీర్తుల ఆనవాళ్లు ఇంకా ఈ విజయనగరంలో కనిపిస్తుంటాయి. కేవలం రాజరికమే కాదు.. విజయనగరం జిల్లా కళల కాణాచి. ఆంధ్రా సాంస్కృతిక రాజధాని. విద్యలకు నియలం. ఆంధ్రప్రదేశ్‌లోని అతి తక్కువ చరిత్రాత్మక నగరాల్లో విజయనగరం ఒకటి. రాజులు పోయాయి.. రాజరికాలు పోయాయి. ఇప్పుడంతా ప్రజాస్వామ్యం. ప్రజలు మెచ్చినవారే పాలకులు. మరి ఒక్కసారి విజయనగరం ఫ్లాష్‌ బ్యాక్ చూసుకుంటే.. విజయనగరం మున్సిపాలిటీ 1888లో ఏర్పడింది. 1988 నాటికి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటి elections;ramakrishna;rani;telugu desam party;congress;district;telugu;vijayanagaram;capital;king;lie;vizianagaram;partyపురపోరు: విజయ నగరంలో చరిత్రాత్మక ఉత్కంఠ..? ఆ రాణి ఎవరో..?పురపోరు: విజయ నగరంలో చరిత్రాత్మక ఉత్కంఠ..? ఆ రాణి ఎవరో..?elections;ramakrishna;rani;telugu desam party;congress;district;telugu;vijayanagaram;capital;king;lie;vizianagaram;partyTue, 02 Mar 2021 00:00:00 GMTజిల్లా కళల కాణాచి. ఆంధ్రా సాంస్కృతిక రాజధాని. విద్యలకు నియలం. ఆంధ్రప్రదేశ్‌లోని అతి తక్కువ  చరిత్రాత్మక నగరాల్లో విజయనగరం ఒకటి. రాజులు పోయాయి.. రాజరికాలు పోయాయి. ఇప్పుడంతా ప్రజాస్వామ్యం. ప్రజలు మెచ్చినవారే పాలకులు.

మరి ఒక్కసారి విజయనగరం ఫ్లాష్‌ బ్యాక్ చూసుకుంటే.. విజయనగరం మున్సిపాలిటీ 1888లో ఏర్పడింది.  1988 నాటికి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటి దశకి చేరుకుంది. 2019జులై 3న కార్పొరేషన్ గా మారింది. మొత్తం డివిజన్లు 50తో ఏర్పడిన నగరపాలక సంస్థ  57.01 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. 1888లో బ్రిటిష్ కాలంలో అప్పటి విజయనగరం సంస్థానాధీశుడు పూసపాటి ఆనందగజపతి రాజు స్థాపించిన విజయనగరం మున్సిపాలిటికీ ఘనచరిత్ర ఉంది. 1903లో తొలి అధ్యక్షుడిగా భూపతిరాజు వెంకటపతిరాజు ఎన్నికయ్యారు. 1908లో గుండాల రామవతారం., 1913లో గుండాల రామచంద్రరావు, 1921లో గుగ్గిలం సుబ్బారావు, 1931లో కిలాంబి రంగాచారి, 1934లో పసుమర్తి విరభద్రస్వామి, 1942లో బొడ్డు సీతారామస్వామి, 1952లో భాగా నగరపు సంజీవరావు, 1953లో పూతి అప్పలస్వామి నాయుడు, 1956లో అప్పసాని అప్పన్నదొరలు అధ్యక్షులుగా వ్యవహరించారు.

ఆ తర్వాత కాలంలో 1981లో పి.సునీలా గజపతిరాజు అధ్యక్షురాలుగా పనిచేశారు. అనంతరం., 1987, 1995, 2000లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులే ఛైర్మన్లుగా పాలక పగ్గాలు చేపట్టారు. అంతకు ముందు 1981-85 మధ్యకాలంలో పి.సునీలా గజపతిరాజు రాష్ట్రంలోనే తొలి మహిళా ఛైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. 1987లో పాలూరి శేషగిరి, 1995లో ప్రసాదుల కనక మహాలక్ష్మీ, 2005లో మీసాలగీత, 2008లో అవనాపు సూరిబాబులు రెండున్నరేళ్ల చొప్పున అధ్యక్షులుగా కొనసాగారు. 2005లో జరిగిన ప్రరోక్ష ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్సీలు రెండున్నరేళ్లు చొప్పున పదవులను పంచుకున్నాయి. 2014 సంవత్సరంలో ప్రసాదుల రామకృష్ణ ప్రత్యక్ష ఎన్నికల ద్వారా అధ్యక్ష పీఠాన్ని చేపట్టారు. ఇక ఇప్పుడు ఎవరు మేయర్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. 


సాక్స్ వేసుకుని పడుకోవడం వలన త్వరగా నిద్ర పడుతుందా..?

44 ఏళ్ల వయసులో మతిపోగొట్టే అందంతో మల్లికా..!

18 ఏళ్లకే తొలి ముద్దు అనుభవం.. అతనంటే ఇప్పటికీ పిచ్చి.. షాక్ ఇచ్చిన హీరోయిన్ కామెంట్స్..!

బేబమ్మ క్రేజ్ ఇది.. అప్పటి యాడ్ ఇప్పుడు వైరల్ అయ్యిందిగా..!

కామ్రేడ్ మూమెంట్.. ఆచార్యలో చరణ్ లుక్ రచ్చ రచ్చ..!

నాగ్ షాకింగ్ డెసిషన్... బొమ్మ బ్లాక్ బస్టరే...?

అమిత్ షా అలా షాక్.. తేలని పంచాయతీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>