PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murderedf72a2512-b0b9-41cd-9b88-d88ce99ef299-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murderedf72a2512-b0b9-41cd-9b88-d88ce99ef299-415x250-IndiaHerald.jpgసమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. ఒక్కరి చేతిలో మరొక్కరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు, హత్యలు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో ప్రాణాలు తీయడానికి, తీసుకోవడానికి కూడా వెనకాడడం లేదు. చిన్న చిన్న కారణాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అసలు మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది.murdered;police;pond;mandalam;village;air;police station;arrest;murder.;traffic police;local language;pettaదారుణం: అదృశ్యమైన వ్యక్తి దారుణహత్య.. తల, మొండెం వేరు చేసిన దుండగులు..!దారుణం: అదృశ్యమైన వ్యక్తి దారుణహత్య.. తల, మొండెం వేరు చేసిన దుండగులు..!murdered;police;pond;mandalam;village;air;police station;arrest;murder.;traffic police;local language;pettaTue, 02 Mar 2021 21:00:00 GMT
తాజాగా వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓవ్యక్తిని అతి కిరాతకంగా హతమార్చి చెరువులో పడేశారు. ఈ ఘటన బొంరస్‎పేట మండలంలోని మెట్లకుంట గ్రామంలో చోటుచేసుకుంది. మెట్లకుంట గ్రామానికి చెందిన కుర్వ చంద్రయ్య (52)అనే వ్యక్తి రెండు రోజులుగా కనిపించడంలేదు. దీంతో కుటుంబసభ్యులు స్థానికుల సాయంతో వెతుకుండగా, గ్రామ శివారులో శవమై కనిపించాడు. చంద్రయ్యను గుర్తు తెలియని దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్లకుంట గ్రామానికి చెందిన కుర్వ చంద్రయ్యను గ్రామ శివారులోని ఎల్లమ్మ చెరువు దగ్గర గుర్తు తెలియని దుండగులు తల, మొండెం వేరు చేసి అతి దారుణంగా హతమర్చారు. తల చెరువులో వేయగా.. మొండెం చెట్ల పొదల్లో పడేశారు.

అయితే ఇదిలావుంటే, ఆదివారం రోజున పొలం పనుల కోసం వెళ్లిన చంద్రయ్య తిరిగి ఇంటికి రాకపోవడంతో సోమవారం కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‎కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలో చంద్రయ్య శవం విడి భాగాలుగా లభ్యమైంది. మృతదేహన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ హత్యకు కారణంగా భావిస్తున్న ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.


విజయం మీదే: నిరాశతో దిగులు చెందకు...?

పుర పోరు: పుంగనూరు లో చేతులెత్తేసిన టీడీపీ నేతలు..

మీకు తెలుసా బుల్లితెర నటుడు ఓ స్టార్ హీరోయిన్ కి తమ్ముడు..!?

పుర పోరు: వైసీపీ ఇంత దిగ జారుడు రాజకీయమా...?

'వకీల్ సాబ్' సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ... ఇక రచ్చే ....??

MLC ఓట్లు ఇలా వేయాలి

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>