PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hascharyam-sakshi-perulo-reddy-teesesaraa371c2313-f9b2-4600-9c18-203227285534-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hascharyam-sakshi-perulo-reddy-teesesaraa371c2313-f9b2-4600-9c18-203227285534-415x250-IndiaHerald.jpgసాక్షి.. తెలుగు పత్రికల్లో సెకండ్ ప్లేస్‌లో ఉన్న పత్రిక. ఈనాడుపై కోపంతో అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి పెట్టిన పత్రిక ఇది. సీఎం జగన్‌ది ఇది ఓ బలమైన అండ. అయితే ఈ పత్రిక యజమానులే రెడ్డి అన్న సంగతి లోకానికి తెలిసిందే. అయితే తాజాగా ఈ పత్రికలో ప్రచురించిన ఓ వార్తలో ఓ నిందితుడి పేరులో రెడ్డి అనే పదం తీసేశారట. సదరు నిందితుడి కారణంగా రెడ్డి కులానికి చెడ్డ పేరు వస్తుందని తీసేశారని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. నరసరావుపేటకు చెందిన sakshi-paper;anitha singer;vishnu;jagan;andhra pradesh;ram madhav;government;police;kanna lakshminarayana;mla;minister;woman;murder.;tdp;local language;narasaraopet;ycp;research and analysis wing;reddy;petta;sakshi;eenadu 1;sajjala ramakrishna reddyహాశ్చర్యం.. సాక్షిలో ఆయన పేరులో రెడ్డి తీసేశారా..?హాశ్చర్యం.. సాక్షిలో ఆయన పేరులో రెడ్డి తీసేశారా..?sakshi-paper;anitha singer;vishnu;jagan;andhra pradesh;ram madhav;government;police;kanna lakshminarayana;mla;minister;woman;murder.;tdp;local language;narasaraopet;ycp;research and analysis wing;reddy;petta;sakshi;eenadu 1;sajjala ramakrishna reddyTue, 02 Mar 2021 11:00:00 GMTరెడ్డి అన్న సంగతి లోకానికి తెలిసిందే. అయితే తాజాగా ఈ పత్రికలో ప్రచురించిన ఓ వార్తలో ఓ నిందితుడి పేరులో రెడ్డి అనే పదం తీసేశారట. సదరు నిందితుడి కారణంగా రెడ్డి కులానికి చెడ్డ పేరు వస్తుందని తీసేశారని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ విషయాన్ని  రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. నరసరావుపేటకు చెందిన అనుషని హత్య చేసిన ప్రేమోన్మాది విష్ణువర్ధన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. నిందితుడి పేరు పక్కన రెడ్డి అని ఉంటే.. చర్యలు తీసుకోవడానికి పోలీసులు భయపడుతున్నారని అనిత ఎద్దేవా చేశారు. రెడ్డి అని పక్కన తోక ఉంటే రాష్ట్రంలో ఏ అరాచకమైనా చేయవచ్చా అంటూ వంగలపూడి అనిత  ప్రశ్నించారు.

ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ ఆమె సాక్షి ప్రస్తావన తెచ్చారు. సాక్షి పేపర్లో నిందితుడి పేరుకి రెడ్డి తీసేసి వార్త రాశారని వంగలపూడి అనిత చెప్పారు. దిశా చట్టం ఒక దిక్కుమాలిన చట్టమని, కనీసం దిశా చట్టం కూడా కరెక్టుగా తయారు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని వంగలపూడి అనిత  అన్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళల మానాలు, ప్రాణాలు రెండూ పోతున్నాయని వంగలపూడి అనిత  ఆవేదన వ్యక్తం చేశారు.

ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కన్నా ముందే జగన్ వస్తాడని ఊదరగొట్టారని, నరసరావుపేట అనూష కేసుపై జగన్ ఎందుకు స్పందించలేదని అనిత ప్రశ్నించారు. అనూష కేసులో 21 రోజుల్లో నిందితుడుకి శిక్ష పడితే సీఎం జగన్‌కు సలాం చేస్తామని వంగలపూడి అనిత అన్నారు. ఒక విద్యార్థిని దారుణ హత్యకు గురైతే స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు కనీసం స్పందించడా అంటూ వంగలపూడి అనిత ప్రశ్నించారు. ఏపీ హోంమంత్రి సుచరిత కీ ఇస్తే ఆడే ఒక బొమ్మ మాత్రమేనని, ఆ బొమ్మకు సజ్జల రామకృష్ణారెడ్డి లేదా సీఎం జగన్ కీ ఇస్తేనే ఆడుతుందని వంగలపూడి అనిత  విమర్శించారు. 20 నెలల రాజారెడ్డి రాజ్యాంగంలో ఒక్క ఆడపిల్లను కూడా కాపాడుకోలేని పరిస్థితి నెలకొందని అనిత విమర్శించారు. 


పుర పోరు: టీడీపీ కంచుకోట‌లో టీడీపీ నేత‌లే వైసీపీని గెలిపిస్తారా ?

కరోనా కొత్త స్ట్రెయిన్స్.. ఇండియాకు గుడ్‌ న్యూస్..?

ఎన్నిక‌ల సాక్షిగా టీడీపీకి బిగ్ షాక్‌... వైసీపీలోకి కీల‌క నేత జంప్

పుర పోరు : అటు చంద్రబాబు.. ఇటు పవన్...?

పుర పోరు : విశాఖ మేయర్ కోసం టీడీపీ వైసీపీ టఫ్ ఫైట్...?

టక్ జగదీశ్ లో ఊహించని రోల్ లో నటిస్తోన్న జగ్గూ భాయ్ !

డేంజర్ జోన్ లో ఏపీ, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>