MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-prince-varun-tej-latest-movie-ghani-backs-out-and-thats-the-reason466b7eb8-d6ea-44d7-aa14-19e0c6acd966-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-prince-varun-tej-latest-movie-ghani-backs-out-and-thats-the-reason466b7eb8-d6ea-44d7-aa14-19e0c6acd966-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మెగా ఫ్యామిలీ లోని హీరోల్లో వరుణ్ తేజ్ కూడా మంచి సక్సెస్ లతో దూసుకెళ్తున్న విషయం తెల్సిందే. ఇటీవల వచ్చిన ఎఫ్ 2, అలానే గద్దలకొండ గణేష్ వంటి సినిమాలతో వరుసగా సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుని కొనసాగుతున్న వరుణ్, ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో ఒకటి కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గని కాగా ఇంకొకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్3 మూవీ. అయితే వీటిలో గని ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకోగా ఎఫ్3 మాత్రం కొన్నాళ్ల క్రితం షూటింగ్ మొదలైంది.varun tej;f3 movie;venkatesh;mehreen pirzada;anil music;anil ravipudi;devi sri prasad;kiran;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;bollywood;cinema;sai manjrekar;f2;heroine;success;gaddalakonda ganesh;lie;bobby;v;dil;f3ఒక నెల గ్యాప్ .... రెండు సినిమాలు .... హిట్టయితే జాక్ పాటే ...??ఒక నెల గ్యాప్ .... రెండు సినిమాలు .... హిట్టయితే జాక్ పాటే ...??varun tej;f3 movie;venkatesh;mehreen pirzada;anil music;anil ravipudi;devi sri prasad;kiran;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;bollywood;cinema;sai manjrekar;f2;heroine;success;gaddalakonda ganesh;lie;bobby;v;dil;f3Tue, 02 Mar 2021 11:25:08 GMTప్రస్తుతం మెగా ఫ్యామిలీ లోని హీరోల్లో వరుణ్ తేజ్ కూడా మంచి సక్సెస్ లతో దూసుకెళ్తున్న విషయం తెల్సిందే. ఇటీవల వచ్చిన ఎఫ్ 2, అలానే గద్దలకొండ గణేష్ వంటి సినిమాలతో వరుసగా సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుని కొనసాగుతున్న వరుణ్, ప్రస్తుతం రెండు  సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో ఒకటి కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గని కాగా ఇంకొకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్3 మూవీ. అయితే వీటిలో గని ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకోగా ఎఫ్3 మాత్రం కొన్నాళ్ల క్రితం షూటింగ్ మొదలైంది. 

రెండేళ్ల క్రితం వెంకటేష్ తో కలిసి వరుణ్ నటించిన సూపర్ హిట్ మూవీ ఎఫ్2 కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఎఫ్3 పై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ కి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా దిల్ రాజు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు టాక్. అందుతున్న సమాచారాన్ని బట్టి ఎఫ్ 2 ని మించేలా మరింత ఎంటర్టైన్మెంట్ ఈ మూవీలో ఉంటుందని, తప్పకుండా ఎఫ్3 మరింత పెద్ద సక్సెస్ సాదిస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు టాక్. 

ఇక గని విషయాన్ని వస్తే ఇందులో వరుణ్ ఒక బాక్సర్ పాత్ర చేస్తుండగా సిద్దు ముద్దా, అల్లు బాబీ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. మంచి యాక్షన్ తో పాటు పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు కిరణ్ ఈ మూవీని ఎంతో గ్రాండ్ గా తీస్తున్నట్లు టాక్. అసలు మ్యాటర్ ఏమిటంటే, కేవలం ఒక నెల గ్యాప్ లో అనగా జులై 30న గని విడుదలవుతుండగా, ఎఫ్ 3 మూవీ ఆగష్టు 27న విడుదలవుతోంది. మొత్తంగా కేవలం ఒక నెల గ్యాప్ లో వరుణ్ వి రెండు సినిమాలు వస్తుండడంతో అవి రెండూ కనుక సూపర్ హిట్ కొడితే హీరోగా వరుణ్ తేజ్ మంచి జాక్ పాట్ కొట్టినట్లే అంటున్నారు విశ్లేషకులు....!! 



ఎడిటోరియల్: తెలంగాణాలో మధ్యంతరం తప్పదా! ఈటెలతో పెట్టుకుంటే అంతేమరి....

హాశ్చర్యం.. సాక్షిలో ఆయన పేరులో రెడ్డి తీసేశారా..?

కరోనా కొత్త స్ట్రెయిన్స్.. ఇండియాకు గుడ్‌ న్యూస్..?

ఎన్నిక‌ల సాక్షిగా టీడీపీకి బిగ్ షాక్‌... వైసీపీలోకి కీల‌క నేత జంప్

పుర పోరు : అటు చంద్రబాబు.. ఇటు పవన్...?

పుర పోరు : విశాఖ మేయర్ కోసం టీడీపీ వైసీపీ టఫ్ ఫైట్...?

టక్ జగదీశ్ లో ఊహించని రోల్ లో నటిస్తోన్న జగ్గూ భాయ్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>