HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/vitamines-bodyca0c7979-f4e1-4c4a-8e35-35eab9c122c4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/vitamines-bodyca0c7979-f4e1-4c4a-8e35-35eab9c122c4-415x250-IndiaHerald.jpgఒక్కొక్క విటమిన్ కు ఒక్కో ఉపయోగం ఉంటుంది. ఒకవేళ మన శరీరంలో ఏ విటమిన్ అయినా తక్కువ అయితే సంబంధించిన విభాగంలో ఏదో ఒక నష్టం జరుగుతుంది. అలాంటిదే విటమిన్ ఎ కూడా మన శరీరానికి చాలా అవసరం. విటమిన్ ఎ కొవ్వులో కూడా కరుగుతుంది. మన శరీరంలో జరిగే అనేక రకాల చర్యలకు విటమిన్ ఎ ముఖ్య పాత్ర వహిస్తుంది. విటమిన్ ఎ మన కంటి చూపును మెరుగు పరచడానికి ఎంతగానో సహకరిస్తుంది.. అయితే ఈ విటమిన్ ఎ లోపం వస్తే ఏం జరుగుతుందో..? ఇప్పుడు తెలుసుకుందాం..vitamines,body;vitamin a;vitamin;cholesterolవిటమిన్ ఏ మన శరీరానికి ఎందుకు అవసరం..?విటమిన్ ఏ మన శరీరానికి ఎందుకు అవసరం..?vitamines,body;vitamin a;vitamin;cholesterolTue, 02 Mar 2021 14:30:00 GMT ఒక్కొక్క విటమిన్ కు ఒక్కో ఉపయోగం ఉంటుంది. ఒకవేళ మన శరీరంలో ఏ విటమిన్ అయినా తక్కువ అయితే సంబంధించిన విభాగంలో ఏదో ఒక నష్టం జరుగుతుంది. అలాంటిదే విటమిన్ ఎ కూడా మన శరీరానికి చాలా అవసరం. విటమిన్ ఎ కొవ్వులో కూడా కరుగుతుంది. మన శరీరంలో జరిగే అనేక రకాల చర్యలకు విటమిన్ ఎ ముఖ్య పాత్ర వహిస్తుంది. విటమిన్ ఎ మన కంటి చూపును మెరుగు పరచడానికి ఎంతగానో సహకరిస్తుంది.. అయితే ఈ విటమిన్ ఎ లోపం వస్తే ఏం జరుగుతుందో..? ఇప్పుడు తెలుసుకుందాం..


విటమిన్ ఎ ఎక్కువగా మాంసం, చేపలు,  గుడ్లు , పాల ఉత్పత్తులలో  ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కూరగాయలు,ఆకుకూరలు  పండ్లలో కెరటోనాయిడ్స్ ఉంటాయి.ఇవి మన శరీరంలో విటమిన్ ఎ ను ఉత్పత్తి చేస్తాయి. చాలామంది ఈ విటమిన్ ఎ లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గర్భవతులు, బాలింతలు,శిశువులు,చిన్నారుల్లో ఈ విటమిన్ ఎ లోపం కనిపిస్తోంది..

విటమిన్ ఎ లోపం గల వారిలో కలిగే లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

చర్మం పొడిబారినట్లు అవుతుంది. విటమిన్ ఎ లోపం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఎగ్జిమా లేదా చర్మ సమస్యలు వస్తాయి. ఎగ్జిమా కారణంగా చర్మం పొడిగా మారి, దురదలు పెడుతుంది. అలాగే చర్మం వాపు కు గురి అవుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలన్నింటికీ విటమిన్ ఎ ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది.

అలాగే కళ్ళు పొడిబారినట్లు కనిపించడం జరుగుతుంది. ఇక ఎప్పుడైతే ఈ సమస్య తీవ్రతరం అవుతుందో అప్పుడు అంధత్వం వచ్చేందుకు కూడా అవకాశం ఉంది. కాబట్టి విటమిన్ ఎ లోపం ఉందో లేదో తెలుసుకొని అప్రమత్తం అవ్వాలి. విటమిన్-ఎ లోపం కారణంగా రేచీకటి సమస్య కూడా తలెత్తుతుంది.  కాబట్టి విటమిన్ ఎ కలిగిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించాలి.


విటమిన్ ఎ లోపం సంతానలేమికి కూడా కారణమవ్వచ్చు. మహిళల్లో విటమిన్-ఎ లోపం ఉంటే పిండం ఎదుగుదల సరిగా ఉండదు. అంతే కాకుండా పుట్టే శిశువులకు కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. మరికొన్ని సమయాల్లో మహిళలకు అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ. మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి కావాలి అంటే ఈ విటమిన్ ఎ ఎంతగానో ఉపకరిస్తుంది. కాబట్టి దంపతులిద్దరూ సాధ్యమైనంతవరకూ విటమిన్-ఎ లోపం లేకుండా ఉండేందుకు  ప్రయత్నించాలి.

అంతేకాకుండా చిన్న పిల్లల్లో ఎదుగుదల లోపం, గొంతు,ఛాతి ఇన్ఫెక్షన్లు, గాయాలు మానడం లో ఆలస్యం అవడం,  ముఖం మీద మొటిమలు రావడం వంటి సమస్యలకు ఈ విటమిన్ ఎ లోపం కారణం కావచ్చు.. కాబట్టి ప్రతి ఒక్కరు వీలైనంతవరకు విటమిన్-ఎ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి.


పురపోరు : ఐదుగురితో ప్రచారం అసలు కుదిరేపనేనా ?

పోసాని కృష్ణమురళి కొడుకు గురించి ఈ విషయాలు మీకు తెలుసా...

అటు మెగాస్టార్ ... ఇటు మెగాపవర్ స్టార్ .... వర్కౌట్ అయితే బాక్సాఫీస్ షేకే ....!!

పుర‌పోరు: వైసీపీకి ద‌డ పుట్టిస్తోన్న రెబల్స్

పుర పోరు: జ‌గ‌న్ టార్గెట్‌తో వ‌ణుకుతోన్న వైసీపీ నేత ?

పుర పోరు: అక్క‌డ ప‌్ర‌లోభాలు, బెదిరింపులే ల‌క్ష్యంగా వైసీపీ

1000 రోజులపాటు థియేటర్లలో ఆడిన టాలీవుడ్ సినిమాలు ఏంటో తెలుసా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>