Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/masala-dinusulu43fb95f8-03e6-4c93-b2dc-a1ce4e4751fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/masala-dinusulu43fb95f8-03e6-4c93-b2dc-a1ce4e4751fc-415x250-IndiaHerald.jpg వంటింట్లో ఉండే మసాలా దినుసులు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. వాటిని వాడటం వల్ల అనేక అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. అంతేకాకుండా బరువు తగ్గడానికి కూడా కొన్ని మసాలా దినుసులు ఉపయోగపడతాయి. ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని వంటింటి మసాలా దినుసులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.... masala dinusulu;rasam;vitamin c;vitamin;turmeric;cumin;aqua;ayurveda;masalaవంటింట్లో ఉండే మసాలా దినుసులు.. ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా...?వంటింట్లో ఉండే మసాలా దినుసులు.. ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా...?masala dinusulu;rasam;vitamin c;vitamin;turmeric;cumin;aqua;ayurveda;masalaTue, 02 Mar 2021 02:00:00 GMTమసాలా దినుసులు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. వాటిని  వాడటం వల్ల అనేక అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. అంతేకాకుండా  బరువు తగ్గడానికి కూడా కొన్ని మసాలా దినుసులు ఉపయోగపడతాయి. ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని వంటింటి మసాలా  దినుసులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం....

 పసుపు:
 పసుపును పాలల్లో కలుపుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా పసుపు శరీరానికి కావలసిన వేడి, రక్త శుద్ధి, కఫం,  వాత, పిత్త రోగాలను సాయం చేసే గుణాలు ఉన్నాయి. జలుబు, దగ్గు ఉన్నప్పుడు పసుపును వేడి నీటిలో గాని, పాలలో గాని కలిపి తాగడం వల్ల తగ్గుతాయి. అలాగే గొంతులో, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని బయటకు పంపిస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

 అల్లం:
 అల్లం తీసుకోవడం వల్ల అజీర్తి తగ్గిపోతుంది. దగ్గు, జలుబు, కఫం వంటివాటికి అల్లం మంచి మందులా పనిచేస్తుంది. అలాగే ఉబ్బసం వ్యాధితో బాధపడే వాళ్ళు అల్లం రసంతో పేద కలుపుకొని తాగడం వల్ల ఉబ్బసం తగ్గిపోతుంది. అంతేకాకుండా ఆకలి బాగా వేస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా జరిగేటట్లు అల్లం సహాయపడుతుంది.

 మెంతులు:
 మధుమేహం ఉన్న వాళ్లకి మెంతులు బాగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ప్రతిరోజు మెంతులు తీసుకోవడం వల్ల రక్తం పలుచగా తయారవుతుంది. అంతేకాకుండా మెంతుల చూర్ణం చేసుకొని రోజూ పరగడుపున తీసుకోవడం వల్ల కాళ్ల నొప్పులు తగ్గడమే కాకుండా, మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ను కరిగిస్తుంది.

 జీలకర్ర :
 జీలకర్రను తినడం వల్ల జీర్ణక్రియ  సక్రమంగా జరుగుతుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు, అజీర్తిగా  ఉన్నప్పుడు జీలకర్ర నీళ్లు తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడానికి కూడా జీలకర్ర ఉపయోగపడుతుంది.

 సొంపు :
 భోజనం చేసిన తర్వాత సోంపును  తినడం వల్ల శరీరానికి చలువ చేయడమే కాకుండా, నోరు శుభ్రంగా ఉంటుంది.  నోటి దుర్వాసన రాకుండా సొంపు  కాపాడుతుంది.

 ఉసిరికాయ :
 ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కళ్ళు  ఆరోగ్యానికి ఉసిరికాయ  చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరికాయను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల వెంట్రుకలకు చాలా మంచిది.


మోడీ సర్కార్ ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్ స్కీమ్..?

44 ఏళ్ల వయసులో మతిపోగొట్టే అందంతో మల్లికా..!

18 ఏళ్లకే తొలి ముద్దు అనుభవం.. అతనంటే ఇప్పటికీ పిచ్చి.. షాక్ ఇచ్చిన హీరోయిన్ కామెంట్స్..!

బేబమ్మ క్రేజ్ ఇది.. అప్పటి యాడ్ ఇప్పుడు వైరల్ అయ్యిందిగా..!

కామ్రేడ్ మూమెంట్.. ఆచార్యలో చరణ్ లుక్ రచ్చ రచ్చ..!

నాగ్ షాకింగ్ డెసిషన్... బొమ్మ బ్లాక్ బస్టరే...?

అమిత్ షా అలా షాక్.. తేలని పంచాయతీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>