MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrf7c2ac9e-a29c-4d4e-b375-7b25ab586cb2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrf7c2ac9e-a29c-4d4e-b375-7b25ab586cb2-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా ప్రస్తుతం RRR అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై దేశం మొత్తం ఎన్నో అంచనాలు పెట్టుకుంది.. పాన్ ఇండియా గా వస్తున్న ఈ సినిమా రెండు కాలాలకు చెందిన ఇద్దరు గొప్ప వ్యక్తుల కథ అని చెప్తున్నారు.. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తున్నారు.. ఇప్పటికే ఈ ఇద్దరి హీరోల లుక్స్ ని, టీజర్స్ ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు జక్కన్న. ntr;view;ntr;ram charan teja;jr ntr;pawan kalyan;ram pothineni;rajamouli;india;alluri sitarama raju;komaram bheem;tollywood;rrr movie;cinema;temper;hero;nandamuri taraka rama rao;lavakusa;aravinda sametha veera raghavaటాలీవుడ్ లో ఏ హీరో కొట్టని రికార్డు కొట్టిన ఎన్టీఆర్..?టాలీవుడ్ లో ఏ హీరో కొట్టని రికార్డు కొట్టిన ఎన్టీఆర్..?ntr;view;ntr;ram charan teja;jr ntr;pawan kalyan;ram pothineni;rajamouli;india;alluri sitarama raju;komaram bheem;tollywood;rrr movie;cinema;temper;hero;nandamuri taraka rama rao;lavakusa;aravinda sametha veera raghavaTue, 02 Mar 2021 09:00:00 GMTపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా ప్రస్తుతం rrr అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై దేశం మొత్తం ఎన్నో అంచనాలు పెట్టుకుంది.. పాన్ ఇండియా గా వస్తున్న ఈ సినిమా రెండు కాలాలకు చెందిన ఇద్దరు గొప్ప వ్యక్తుల కథ అని చెప్తున్నారు.. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తున్నారు.. ఇప్పటికే ఈ ఇద్దరి హీరోల లుక్స్ ని, టీజర్స్ ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు జక్కన్న.

ఇకపోతే కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటూ సత్తా చాటుతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. పూరీ జగన్నాథ్ రూపొందించిన ‘టెంపర్'తో మొదలైన అతడి విజయ పరంపర ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ' వరకూ కంటిన్యూ అయింది. ఇలా ప్రస్తుత తరంలో ఏ స్టార్ హీరోనూ వరుసగా ఐదు విజయాలను నమోదు చేయలేదు.ఇక rrr మూవీ టాలీవుడ్‌ హిస్టరీలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అందుకే ఈ సినిమా విషయంలో అన్నీ పక్కాగా ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటున్నారు.

కొద్ది రోజుల క్రితం ‘భీమ్ ఫర్ రామరాజు' పేరిట రామ్ చరణ్ పరిచయ వీడియో విడుదల చేశారు. దీనికి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఇక, ఇటీవల ‘రామరాజు ఫర్ భీం' పేరిట జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రో వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో అతడి క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ టీజర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తద్వారా అంచనాలు పెరిగాయి.‘రామరాజు ఫర్ భీం' వీడియో అప్‌లోడ్ చేసిన సమయం నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో 24 గంటల్లోనే 14.14 మిలియన్ వ్యూస్ సాధించి చరిత్రను తిరగరాసింది. ఇక, ఈ వీడియో తాజాగా 1.3 మిలియన్ లైక్స్‌ను అందుకుంది. తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మైలురాయిని చేరుకున్న మొట్టమొదటి టీజర్‌గా ‘రామరాజు ఫర్ భీం' రికార్డు క్రియేట్ చేసింది. ఫలితంగా జూనియర్ ఎన్టీఆర్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఒక టీజర్‌తో 100 మిలియన్ వ్యూస్, 1.3 మిలియన్ లైక్స్, 1.5 మిలియన్ కామెంట్స్ అందుకున్న హీరోగా ఖ్యాతి గడించాడతను.


పుర పోరు : విశాఖ మేయర్ కోసం టీడీపీ వైసీపీ టఫ్ ఫైట్...?

టక్ జగదీశ్ లో ఊహించని రోల్ లో నటిస్తోన్న జగ్గూ భాయ్ !

డేంజర్ జోన్ లో ఏపీ, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా..

పుర పోరు : అనంత నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చిన వైసీపీ హై కమాండ్

సౌత్ నుండి ప్రభాస్ ఒక్కడే.. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగురవేయొచ్చు...!

జబర్దస్త్ లో ఆ కమెడియన్ ఆరోగ్యం విషమం..?

44 ఏళ్ల వయసులో మతిపోగొట్టే అందంతో మల్లికా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>