PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vsp33132061-b55b-4b0d-97d2-3aff0692cd95-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vsp33132061-b55b-4b0d-97d2-3aff0692cd95-415x250-IndiaHerald.jpgఅమీ తుమీ అంటున్నారు. విజయమో వీర స్వర్గమో అని పోరాడుతున్నారు. చావో రేవో అని కూడా తెగిస్తున్నారు. ఇదంతా విశాఖ మేయర్ ఎన్నికల కోసమే. అటు అధికార పక్షం వైసీపీ, ఇటు విపక్షం టీడీపీ ఎత్తులకు పై ఎత్తులు వేసి మరీ పీఠం పట్టేయాలని తెగ ఆరాటపడుతున్నాయి. vsp;tara;vishakapatnam;tdp;ycp;party;paruguపుర పోరు : విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లంటే...?పుర పోరు : విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లంటే...?vsp;tara;vishakapatnam;tdp;ycp;party;paruguTue, 02 Mar 2021 15:09:42 GMTవిశాఖ మేయర్ ఎన్నికల కోసమే.  అటు అధికార పక్షం వైసీపీ, ఇటు విపక్షం టీడీపీ ఎత్తులకు పై ఎత్తులు వేసి మరీ పీఠం పట్టేయాలని తెగ ఆరాటపడుతున్నాయి.

ఇపుడున్న అంచనాల ప్రకారం చూస్తే విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీకి 20 సీట్లలో గట్టి పట్టుంది. అక్కడ ఆ పార్టీ ఓటర్లు కూడా ఎక్కువగా  ఉన్నారు. దాంతో ఆ సీట్లు ఎటు నుంచి ఎటు అయినా సరే రావడం ఖాయమని అంటున్నారు. మరో వైపు చూస్తే టీడీపీ పాత కాపు. ఎన్నో ఎన్నికలు చూసిన అనుభవశాలి. పైగా మాజీ కార్పొరేటర్లు చాలా మంది ఆ పార్టీకి ఉన్నారు.

దాంతో టీడీపీకి కచ్చితంగా గెలిచే వార్డులు కొన్ని ఉన్నాయి. అవేంటి అన్న లెక్క తీస్తే 13 దాకా తేలాయి. ఈ సీట్లను అనేక ఎన్నికల్లో వరసగా టీడీపీ గెలుచుకుంటూ  వస్తోంది. పైగా టీడీపీ సంప్రదాయ ఓటర్లు  ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు. వారు మరో  పార్టీని అసలు ఖాతరు చేయరు, ఓట్లు వేయరు. అలా కంచుకోటల లాంటి వార్డులు టీడీపీకి ఉండడంతో 13 నుంచి తన పరుగుపందేన్ని మొదలుపెట్టింది అనుకోవాలి.

ఇక మరో వైపు చూస్తే ఈ ఎన్నికలో మేయర్ పీఠం పట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 57 సీట్లుగా పేర్కొంటున్నారు. మొత్తం 98 వార్డులు విశాఖ కార్పొరేషన్ లో ఉన్నాయి. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకుంటే సంఖ్య 113 దాకా చేరుతుంది అంటున్నారు. దాంతో 113లో సగం అంటే 57 సీట్లు ఎవరికి వస్తే వారే మేయర్ అవుతారు. ఇక టీడీపీ తమకు 58 సీట్ల కంటే ఎక్కువ వస్తాయని చెప్పుకుంటోంది. వైసీపీ అయితే 75 సీట్లు తమ ఖాతాలోకే అంటోంది. మొత్తానికి రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.





విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?

బెంగాల్ ఎన్నిక‌ల‌తో లింకుప‌డిన ఏపీ రాజ‌కీయాలు ?

పురపోరు : ఐదుగురితో ప్రచారం అసలు కుదిరేపనేనా ?

పోసాని కృష్ణమురళి కొడుకు గురించి ఈ విషయాలు మీకు తెలుసా...

అటు మెగాస్టార్ ... ఇటు మెగాపవర్ స్టార్ .... వర్కౌట్ అయితే బాక్సాఫీస్ షేకే ....!!

పుర‌పోరు: వైసీపీకి ద‌డ పుట్టిస్తోన్న రెబల్స్

పుర పోరు: జ‌గ‌న్ టార్గెట్‌తో వ‌ణుకుతోన్న వైసీపీ నేత ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>