PoliticsParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape-also-is-not-a-rape-in-relationship5bcf6c32-055e-4ce3-b794-4ca118eca697-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape-also-is-not-a-rape-in-relationship5bcf6c32-055e-4ce3-b794-4ca118eca697-415x250-IndiaHerald.jpgఒక బలహీన క్షణంలో ఒకరికొకరు లొంగిపోయి శృంగారం జరిగిపోతే దాన్ని బలాత్కారం అంటే "రేప్" అనలేమని చెప్తుంది దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్. ఏక్కడైతే సెక్స్ కు తిరస్కరణ, నిరోధం, అనంగీకారం ప్రకటించ బడకుండా జరిగిన దాన్ని “రేప్” అని చెప్పలేమని అంటున్నారు న్యాయాధీశులు. rape also is not a rape in relationship;marriage;court;sex;girl;kshanam;lieఅలాంటప్పుడు రేపైనా - రేప్ గా పరిగణించలేము: సర్వోన్నత న్యాయస్థానంఅలాంటప్పుడు రేపైనా - రేప్ గా పరిగణించలేము: సర్వోన్నత న్యాయస్థానంrape also is not a rape in relationship;marriage;court;sex;girl;kshanam;lieTue, 02 Mar 2021 16:00:00 GMTఒక బలహీన క్షణంలో ఒకరికొకరు లొంగిపోయి శృంగారం జరిగిపోతే దాన్ని బలాత్కారం అంటే "రేప్" అనలేమని చెప్తుంది దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్.  ఏక్కడైతే  సెక్స్ కు తిరస్కరణ, నిరోధం, అనంగీకారం ప్రకటించ బడకుండా జరిగిన దాన్ని “రేప్” అని చెప్పలేమని అంటున్నారు న్యాయాధీశులు.   

 


ఒక మూడ్ లో ప‌ర‌స్ప‌ర అంగీకారం తోనో, ఆస‌క్తి తోనో, ఇష్టం తోనో, కోరిక‌ తోనో, యాదృచ్చికం గానో శృంగారం జరిగి పొగా, ఆ త‌ర్వాత తాము రేప్ కు లేదా బలాత్కారానికి గుర‌యిన‌ట్టుగా అమ్మాయిలు ఆరోపించే కేసులు ఈ మధ్య తరచుగా కొన్ని తెరమీద‌కు వస్తున్నాయి. కొన్ని “మీటూ ఆరోప‌ణ‌లు” కూడా చాల వరకు ఈ వర్గీకరణ కిందే వస్తాయి.  


త‌మ అవ‌స‌రం మేర‌కో, ఆస‌క్తి మేర‌కో, వినోదం కోసమో, ఉల్లాసం కోసమో, విశ్రాంతి కోసమో, అనుభూతిని ఒకసారి ఆస్వాదించాలని కోరికతోనో, ఉబుసుపోక టైమ్-పాస్ కోసమో టెంప్ట్ అయి శారీర‌కంగా ద‌గ్గ‌రై, చాలాకాలం త‌ర్వాత తాము లైంగికంగా వేధింపుల‌కు గుర‌యిన‌ట్టుగా కొంత ‌మంది అమ్మాయిలు ఆరోపిస్తూ ఉన్నార‌నే విశ్లేష‌ణ‌లు ఉంటాయి ఈ కేసుల్లో.



ఇక కొంత‌మంది అయితే ఏకంగా స‌హ‌జీవ‌నం చేసేసి మంచి మొగుడు దొరగ్గానే, వీణ్ణి వదిలేసి, వాణ్ణి పెళ్ళాడేసి - అక్కడ భర్తతో విభేదాలొస్తే - తిరిగొచ్చి నాటి సందర్భాలను రిఫర్ చేస్తూ ఆస‌మ‌యంలో త‌మమ‌ధ్య జ‌రిగిన లైంగిక కార్య‌క‌లాపాల‌ను బలాత్కారంగా లేక “రేప్” గా చూపిస్తూ కేసు  పెట్టే ప్ర‌య‌త్నాలు చేసిన దాఖ‌లాలు కూడా క‌నిపిస్తున్నాయి.


తాజాగా సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ముందు వ‌చ్చిన రేప్ కేసు వ్య‌వ‌హారం ఇలాంటిదే.


వారిద్దరూ కాల్ సెంట‌ర్ ఉద్యోగులు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఐదేళ్ల పాటు స‌హ‌జీవ‌నం కూడా చేశార‌ట‌. ఆ త‌ర్వాత కారణాలేవైతేనేమి వారు విడిపోయారు సహజీవనానికి గుడ్ బై చెప్పేసుకున్నారు.


ఆ అబ్బాయి మ‌రో అమ్మాయిని పెళ్లి చేసు కున్నాడు. దీంతో స‌హ‌జీవ‌నం చేసిన యువ‌తి కోర్టును ఆశ్ర‌యించింది. ఆ యువ‌కుడి మీద అత్యాచారం కేసుల‌ను పెట్టింది. దీనిపై విచారించిన న్యాయ‌స్థానం, ఇష్ట‌ పూర్వ‌కంగా సుదీర్ఘ‌కాలం పాటు స‌హ‌జీవ‌నం చేసి, బ్రేక‌ప్ అయ్యాక, రేప్ అంటే కుద‌ర‌దని స్ప‌ష్టం చేసింది.


ఒక స‌మ‌యంలో ప‌ర‌స్ప‌ర అంగీకారంతో సెక్స్ లో పాల్గొని, మ‌రో స‌మ‌యంలో దాన్నే రేప్ గా ప‌రిగ‌ణించాలని అనుకుంటే కుద‌ర‌దని స్పష్టం చేసింది సుప్రీం కోర్ట్. స‌హ‌జీవ‌నం చేసి, పెళ్లి చేసుకుంటా నంటూ హామీ ఇచ్చి, పెళ్లి చేసుకోక‌ పోవ‌డం ఆ యువ‌కుడి త‌ప్పే, అలాగ‌ని, దాన్ని రేప్ నేరం కింద పరిగ‌ణించ‌ లేమ‌ని మాత్రం సుప్రీం కోర్టు స్ప‌ష్ట‌త ఇచ్చింది.


పెళ్లి అనే ష‌ర‌తుతో స‌హ‌జీవ‌నం చేసి ఆ ఆ షరతుకు తిలోదకాలిస్తే - ప్రామిస్ ను బ్రేక్ చేయ‌డం ఆ తప్పు - మగువ దైనా, మగవాడి దైనా తప్పు తప్పేన‌ని కోర్టు పేర్కొంది.




చనిపోయింది అనుకుని బయటపడేశారు..: నటి హేమ..!

విజయశాంతి భర్తకు ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటో తెలుసా..1?

బెంగాల్ ఎన్నిక‌ల‌తో లింకుప‌డిన ఏపీ రాజ‌కీయాలు ?

పురపోరు : ఐదుగురితో ప్రచారం అసలు కుదిరేపనేనా ?

పోసాని కృష్ణమురళి కొడుకు గురించి ఈ విషయాలు మీకు తెలుసా...

అటు మెగాస్టార్ ... ఇటు మెగాపవర్ స్టార్ .... వర్కౌట్ అయితే బాక్సాఫీస్ షేకే ....!!

పుర‌పోరు: వైసీపీకి ద‌డ పుట్టిస్తోన్న రెబల్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>