MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-balayya68186f64-80d2-4e2a-a048-5c96fa66b174-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-balayya68186f64-80d2-4e2a-a048-5c96fa66b174-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా రంగంలో సీనియర్ హీరోలు నాటౌట్ అంటున్నారు. అంతే కాదు, మిగిలిన హీరోలతో పోటీగా చేతిలో నాలుగైదు సినిమాలను ఉంచుకున్నారు. ఒక సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే మరో సినిమా షూటింగ్ అంటున్నారు. ఇలా సీనియర్లు జోరు చూస్తూంటే టాలీవుడ్ లో కొత్త చరిత్ర మొదలవుతోంది అనే చెప్పాలి. pawan balayya;pawan;chiranjeevi;mahesh;prabhas;balakrishna;gopichand;boyapati srinu;kalyan;krish;tollywood;cinema;history;director;krackపవన్..మహేష్.. మధ్యలో బాలయ్య...?పవన్..మహేష్.. మధ్యలో బాలయ్య...?pawan balayya;pawan;chiranjeevi;mahesh;prabhas;balakrishna;gopichand;boyapati srinu;kalyan;krish;tollywood;cinema;history;director;krackTue, 02 Mar 2021 12:00:00 GMTసినిమా రంగంలో సీనియర్ హీరోలు నాటౌట్ అంటున్నారు. అంతే కాదు, మిగిలిన హీరోలతో పోటీగా చేతిలో నాలుగైదు సినిమాలను ఉంచుకున్నారు. ఒక సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే మరో సినిమా షూటింగ్ అంటున్నారు. ఇలా సీనియర్లు జోరు చూస్తూంటే టాలీవుడ్ లో కొత్త చరిత్ర మొదలవుతోంది అనే చెప్పాలి.

మెగాస్టార్ చిరంజీవి అయితే ఆచార్య తరువాత మరో మూడు సినిమాలు రెడీ చేసి పెట్టుకున్నారు. ఇక బాలక్రిష్ణ బోయపాటి మూవీని మే 28న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా తరువత కొత్త సినిమాను కూడా బాలయ్య ఓకే చేశారు. ఆ సినిమా క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న మూవీకి మేలో కొబ్బరి కాయ కొడతారట. అంటే మేలో షూటింగ్ మొదలుపెట్టి ఆరు నెలల వ్యవధిలో సినిమాను కంప్లీట్ చేయడానికి డిసైడ్ అయ్యారని అంటున్నారు.

ఈ సినిమాను వచ్చే ఏడాది అంటే 2022 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి టార్గెట్ పెట్టుకున్నారని అంటున్నారు. దాంతో సంక్రాంతికి హెవీ కాంపిటేషన్ అపుడే రెడీ అయిపోయిందని తెలుస్తోంది. 2022 సంక్రాంతికి మహేష్ బాబు సర్కార్ వారి పాటను ముందే డేట్ ఫిక్స్ చేసి పెట్టుకున్నాడు. తాను సోలోగా రావాలనుకున్నాడు. అయితే ఇదే సంక్రాంతికి క్రిష్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటించే మూవీని కూడా తీసుకురావడానికి సిద్ధపడుతున్నారు. కచ్చితంగా సంక్రాంతికే ఈ మూవీని టార్గెట్ చేశారని అంటున్నారు. ఇక ప్రభాస్ సలార్ మూవీని సంక్రాంతికే అని మొదట అనుకున్నారు. కానీ  ఇప్పటికే ఉన్న పోటీని చూసిన  తరువాత 2022 ఏప్రిల్ 14కి మార్చుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే వచ్చే సంక్రాంతికి బాలయ్య, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ పోటీకి రెడీ అన్న మాట. ఇక సంక్రాంతికి ఈ ముగ్గురి మధ్యన పోటీ ఒక రేంజిలో ఉంటుందని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.







పుర పోరు: మాచ‌ర్ల‌లో ప‌్ర‌లోభాలు, బెదిరింపులే ల‌క్ష్యంగా వైసీపీ

పుర పోరు: వంగవీటి రివేంజ్ ఎవ‌రిపై... అంత క‌సి ఉందా ?

ఎడిటోరియల్: తెలంగాణాలో మధ్యంతరం తప్పదా! ఈటెలతో పెట్టుకుంటే అంతేమరి....

ఒక నెల గ్యాప్ .... రెండు సినిమాలు .... హిట్టయితే జాక్ పాటే ...??

హాశ్చర్యం.. సాక్షిలో ఆయన పేరులో రెడ్డి తీసేశారా..?

కరోనా కొత్త స్ట్రెయిన్స్.. ఇండియాకు గుడ్‌ న్యూస్..?

ఎన్నిక‌ల సాక్షిగా టీడీపీకి బిగ్ షాక్‌... వైసీపీలోకి కీల‌క నేత జంప్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>