SmaranaSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/poloitical-parties-and-leaders-decisionseaf8bdf8-9d8a-4f5d-9cae-6d860e74af59-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/poloitical-parties-and-leaders-decisionseaf8bdf8-9d8a-4f5d-9cae-6d860e74af59-415x250-IndiaHerald.jpgఖండవల్లి లక్ష్మీరంజనం ( మార్చి 1, 1908 - జూన్ 18, 1986) సుప్రసిద్ధ సాహిత్యవేత్త, పరిశోధకులు. ఆయ‌న తూర్పు గోదావరి జిల్లా పెదపూడి గ్రామంలోని మాతామహులైన కోరాడ నరసింహులు గారి ఇంటిలో మార్చి 1, 1908 న జన్మించారు. సూర్యనారాయణ, సీతమ్మ వీరి తల్లిదండ్రులు. తండ్రి గారు ఉద్యోగ రీత్యా వరంగల్‌కు వచ్చారు. మాధ్యమిక, ఉన్నత పాఠశాల విద్యలు మట్టెవాడలోను, హ‌న్మ‌కొండ‌లోనూ పూర్తయ్యాయి. తరువాత ఉన్నత విద్యకై హైదరాబాదు వచ్చి 1928లో నిజాం కళాశాలలో తెలుగు, సంస్కృతం, ప్రాచీన భారత చరిత్రలలో బి.ఎ. పట్టా పొందారు. తరువాత సిటీ smarana;bharathi old;geetha;rachana;godavari river;krishna river;andhra pradesh;district;sangeetha;telugu;school;village;history;culture;sanskrit;june;father;march;lie;narasimhaవిద్యాభివృద్ధికి కృషి చేసిన ఖండవల్లి లక్ష్మీరంజనంవిద్యాభివృద్ధికి కృషి చేసిన ఖండవల్లి లక్ష్మీరంజనంsmarana;bharathi old;geetha;rachana;godavari river;krishna river;andhra pradesh;district;sangeetha;telugu;school;village;history;culture;sanskrit;june;father;march;lie;narasimhaMon, 01 Mar 2021 06:30:00 GMTమార్చి 1, 1908 - జూన్ 18, 1986) సుప్రసిద్ధ సాహిత్యవేత్త, పరిశోధకులు. ఆయ‌న  తూర్పు గోదావరి జిల్లా పెదపూడి గ్రామంలోని మాతామహులైన కోరాడ నరసింహులు గారి ఇంటిలో మార్చి 1, 1908 న జన్మించారు. సూర్యనారాయణ, సీతమ్మ వీరి తల్లిదండ్రులు. తండ్రి గారు ఉద్యోగ రీత్యా వరంగల్‌కు వచ్చారు. మాధ్యమిక, ఉన్నత పాఠశాల విద్యలు మట్టెవాడలోను, హ‌న్మ‌కొండ‌లోనూ పూర్తయ్యాయి. తరువాత ఉన్నత విద్యకై హైదరాబాదు వచ్చి 1928లో నిజాం కళాశాలలో తెలుగు, సంస్కృతం, ప్రాచీన భారత చరిత్రలలో బి.ఎ. పట్టా పొందారు. తరువాత సిటీ కళాశాలలో అధ్యాపకులుగా చేరి 1936లో తెలుగు, సంస్కృతాలలో ఎం.ఎ. పరీక్షలో మద్రాసు ప్రెసిడెన్సీలో సర్వ ప్రథములుగా ఉత్తీర్ణులయ్యారు.


ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో అధ్యాపకులుగా చేరి, తరువాత 1946లో ఆ శాఖకు అధ్యక్షులై, 1964లో పదవీ విరమణ చేశారు. వీరి కాలంలో తెలుగు శాఖ బాగా అభివృద్ధి చెంది, తెలుగు ఎం.ఎ. చదివే విద్యార్ధుల సంఖ్య పెరిగి, 1952 నుండి తెలుగులో పి.హెచ్.డి. పట్టాలకు పరిశోధన ప్రారంభమైంది. వీరు ఆంధ్ర మహాభారతం పరిశోధన ప్రతిని ఎనిమిది సంపుటాలుగా తెలుగు శాఖ పక్షాన ప్రకటించారు. వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఒక విద్యాసంస్థను ప్రారంభించి బాలబాలికలకు వేరువేరుగా ఉన్నత పాఠశాలలను నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రథమంగా ప్రాచ్య కళాశాలను, తెలుగు మీడియం సాయం కళాశాలను, ఒక సంగీత పాఠశాలను నెలకొల్పి, వాటికి విశాలమైన భవనాలు కట్టించారు.


 తన ఇంటిలోనే వేదపాఠశాలను 1980లో స్థాపించి సర్వ వర్ణాల వారికి తానే వేదాన్ని బోధించరు. ఆంధ్ర రచయితల సంఘానికి 1957లో అధ్యక్షులై అనేక గ్రంథాలను ముద్రించారు. వీరు ఇంగ్లీషు, తెలుగు భాషలలో శరవేగంగా రాసేవారు. మద్రాసు మెయిల్, దక్కన్ క్రానికల్, భారతి, కృష్ణా, స్రవంతి మొదలైన పత్రికలలో అనేకమైన వ్యాసాలు ప్రకటించారు. కొమర్రాజు లక్ష్మణరావు గారి విజ్ఞాన సర్వస్వం ముద్రించడంలో వీరు విశిష్టమైన కృషిచేశారు. వీరు 'ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము' అనే చక్కని రచన చేశారు. సోదరుడు ఖండవల్లి బాలేందు శేఖరంతో కలసి తెలుగులోను, ఇంగ్లీషులోను రచించిన 'ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి' అమూల్యమైన గ్రంథం. వీరు జూన్ 18, 1986 తేదీన పరమపదించారు.


ట్రైలరే ఇది! ముందుంది సినిమా! అంబానీస్ కు వార్నింగ్: జైషుల్ హింద్

దేశప్రజలకు వార్నింగ్‌ ఇచ్చిన మోడీ..? 100 రోజుల్లోనే ఆ పని..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఆ నలుగురు బ్లాక్ మెయిలర్లేనా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఇన్ని సంవత్సరాలకు నిజాన్ని ఒప్పుకున్నారా ?

ఏంటి... 'సలార్' రిలీజ్ డేట్ వెనుక అంత పెద్ద స్టోరీ ఉందా .....??

వేసింది కోటే.. కాని ఆ చూపులు మాత్రం...!

2022 సంక్రాంతికే పవర్ స్టార్.. అసలు సిసలు బాక్సాఫీస్ ఫైట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>