LifeStyleParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/lifestyle/taurus_taurus/eight-kinds-of-indian-heroinesb9ff2984-67f8-4638-889d-57eed262b23a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/lifestyle/taurus_taurus/eight-kinds-of-indian-heroinesb9ff2984-67f8-4638-889d-57eed262b23a-415x250-IndiaHerald.jpgపైన పెట్టిన టైటిల్ చూసి కంగారు పడకండి. భరతముని రచించిన నాట్యశాస్త్రంలో వివరించిన ఎనిమిది రకాల నాయికలను కలిపి ప్రయోగించే ఒకేఒక పదం ‘అష్టవిధ నాయికలు’ మగువల వివిధ మానసిక స్థితులను బట్టి వారిని అష్టవిధ నాయికలుగా వర్ణించారు, భారత సాహిత్యం చిత్రకళ, శిల్పకళ, నాట్యకళ ఇలాంటి కళలకు అది గురువైన భారతముని. eight kinds of indian heroines;women;bhumika chawla;govinda;chiri;geetha;govi;kirti;prema;vanamali;korcha;geetha govindam;gita govindam;dance;love;sri krishna;muni;husband;sanskrit;heroine;96;streeమైగాడ్! ఎనిమిది మంది హీరోయిన్స్ కు నలుగురు హీరోలు సరిపోతారా!మైగాడ్! ఎనిమిది మంది హీరోయిన్స్ కు నలుగురు హీరోలు సరిపోతారా!eight kinds of indian heroines;women;bhumika chawla;govinda;chiri;geetha;govi;kirti;prema;vanamali;korcha;geetha govindam;gita govindam;dance;love;sri krishna;muni;husband;sanskrit;heroine;96;streeMon, 01 Mar 2021 22:30:00 GMTపైన పెట్టిన టైటిల్ చూసి కంగారు పడకండి. ముని (పుట లేదు)">భరతముని రచించిన నాట్యశాస్త్రంలో వివరించిన ఎనిమిది రకాల నాయికలను కలిపి ప్రయోగించే ఒకేఒక పదం ‘అష్టవిధ నాయికలు’ మగువల వివిధ మానసిక స్థితులను బట్టి వారిని అష్టవిధ నాయికలుగా వర్ణించారు, భారత సాహిత్యం చిత్రకళ, శిల్పకళ, నాట్యకళ ఇలాంటి కళలకు అది గురువైన భారతముని. 


ఈ ఎనిమిది రకాల నాయికలు ఎనిమిది భిన్నమైన మానసిక అవస్థలను తెలియజేస్తుంది. వీనిని భారతీయ చిత్రకళ లోను, సాహిత్యం, శిల్పకళ, శాస్త్రీయ నృత్యాలలో ప్రామాణికంగా పేర్కొన్నారు. ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిందేమంటే ఎనిమిది విధములైన మనసిక స్థితులు ఉన్న వివిధ మగువలు కావచ్చు లేదా ఒకే మగువ విభిన్న మానసిక వైఖరులను విభిన్న సందర్భాల్లో ప్రదర్శించటం కావచ్చు. 


అష్టవిధ నాయికల వర్గీకరణ మొట్టమొదట భరత ముని సంస్కృతంలో రచించిన నాట్య శాస్త్రంలో పేర్కొనబడింది. ఈ వర్గీకరణ వివరాలు తర్వాత రచనలైన దశరూపకం, సాహిత్య దర్పణం, ఇతర కామశాస్త్ర గ్రంథాలలో తెలిపాయి. . కేశవదాసు హిందీలో రచించిన రసికప్రియ కూడా అష్టనాయికలను విశదీకరించిరి.


మధ్యయుగపు చిత్రకళా ఖండాలైన రాగమాల చిత్రాలు అష్టవిధ నాయికలను ప్రముఖంగా చిత్రించాయి. భారతీయ సాహిత్యం లో జయదేవుడు 12వ శతాబ్దంలో రచించిన గీత గోవిందం లోను, వైష్ణవ కవి వనమాలి రచనలలో రాధ వివిధ నాయికల భూమిక పోషించి, నాయకుడిగా శ్రీకృష్ణుడు కీర్తించబడ్డారు.


1. స్వాధీనపతిక

స్వాధీన పతిక " ఈమెలోని ప్రగాఢమైన ప్రేమ, సుగుణాలకు భర్త పూర్తిగా ఆధీనుడౌతాడు. చిత్రకళలో ఈ నాయికను నాయకునితో పాదాలకు పారాణిని గాని లేదా నుదుట తిలకం దిద్దుతున్నట్లుగా చూపిస్తారు. జయదేవుడు గీత గోవిందంలో రాధను స్వాధీనపతికగా వర్ణించాడు. రాధమాధవుల రతిలో చెదిరిన తన అలంకరణను శ్రీకృష్ణునితో సరిచేయించుకుంటుంది.

 

 

2. వాసకసజ్జిక

వాసకసజ్జిక సుదీర్ఘ దూరప్రయాణం నుండి తిరిగివచ్చే ప్రియుని కోసం నిరీక్షిస్తుంది చిత్రకళలో ఈమెను పడకగదిలో పద్మాలు, పూలదండలతో ఉన్నట్లు చూపిస్తారు. సర్వమునలంకరించుకుని ప్రియుని రాకకై ఎదురుచూసే నాయిక". ఈమె అందంగా తయారై ప్రియుని రాకకోసం తద్వారా లభించే ఆనందాల కోసం నిరీక్షిస్తుంది. ఈమె అందాన్ని రతీదేవితో పోలుస్తారు. వాసవసజ్జిక శిల్పం ఖజురహో లోని లక్ష్మణ దేవాలయంలోను, జాతీయ సంగ్రహాలయాలలో కనిపిస్తాయి


3. విరహోత్కంఠిత

విరహోత్కంఠిత: "విరహం వల్ల వేదనపడు నాయిక". ఈమె ప్రియుడు పనికారణంగా ఇంటికి రాలేకపోయినప్పుడు విరహంతో బాధపడుతుంది. ఈమెను పానుపుమీద కూర్చున్నట్లు లేదా నిలబడినట్లుగా లేదా వరండాలో నిలబడినట్లుగా చూపిస్తారు

 

 

4. విప్రలబ్ధ

విప్రలబ్ధ : "శృంగార నాయిక, సంకేత స్థలానికి ప్రియుడు రానందుకు వ్యాకులపడే నాయిక, మోసగించ బడినది". ఈమె రాత్రంతా ప్రియుని కోసం వేచియున్న నాయిక ఈమెను ప్రియుడు నమ్మించి రానందుకు కోపగించి ఆభరణాలను విసిరిపారేసే వనితగా చిత్రిస్తారు.

 

 

5. ఖండిత

ఖండిత : "ప్రియుడు అన్యస్త్రీని పొందిరాగా క్రుంగునది". నమ్మించిన ప్రియుడు రాత్రంతో వేరొక స్త్రీతో గడిపి మరునాడు వచ్చినందుకు విపరీతమైన కోపంతోవున్న నాయిక. ఈమెను ప్రియునిపై తిరగబడుతున్నట్లుగా చిత్రీకరిస్తారు.

 

 

6. కలహాంతరిత

కలహాంతరిత : కోపంతో ప్రియుని వదిలి, తర్వాత బాధపడే స్త్రీ. ఈమె కోపంతో కలహించి లేదా ద్వేషంతో లేదా తనయొక్క చపలత్వంతో ప్రియుని వదిలిన నాయిక. ఈమె ప్రియుడు గృహాన్ని విడిచిపోతున్నట్లుగా తర్వాత నాయిక అందులకు బాధపడుతున్నట్లుగా చిత్రిస్తారు. మరికొన్ని సందర్భాలలో ఈమె ప్రియుని లేదా తానిచ్చిన మధువును తిరస్కరిస్తున్నట్లుగా చిత్రించబడింది. జయదేవుడు గీత గోవిందంలో ఒక సందర్భంలో రాధను కలహాంతరితగా వర్ణించాడు

 

 

7. ప్రోషితభర్తృక

ప్రోషిత భర్తృక "ప్రియుడు దేశాంతరం వెళ్ళగా బాధపడే నాయిక". ఈమె భర్త కార్యార్థం దూరదేశాలకు వెళ్లగా సమయానికి రానందుకు చింతిస్తున్న నాయిక. ఈమెను చెలికత్తెలు పరామర్శిస్తున్నా దుఃఖంతో చింతిస్తున్నట్లుగా చిత్రిస్తారు.

 

8. అభిసారిక

అభిసారిక "ప్రియుడి కోసం సంకేతస్థలానికి పోయే నాయిక". (అభిసారం = ప్రేమికులు సంగమార్థం చేసుకునే నిర్ణయం, ప్రేమికుల సంకేతస్థలం) ఈమె నియమాల్ని అతిక్రమించి ఇల్లు వదలి రహస్యంగా ప్రియుడ్ని కలవడానికి వెళుతున్న నాయిక.[ ఈమెను ఇంటి ద్వారం దగ్గర లేదా త్రోవలో అన్ని అడ్డంకులను అతిక్రమిస్తున్నట్లు చిత్రిస్తారు చిత్రకళలో అభిసారికను తొందరలో ప్రియున్ని కలవడానికి పోతున్నట్లు చూపిస్తారు


చతుర్విద కథానాయకులు



మరి ఎనిమిది మంది కథానాయికలు సృష్టించిన భారత ముని మాత్రం కథానాయకులు ఎన్ని రాకలో చెప్పలేదు. కానీ సాహిత్యంలో మాత్రం పలువురు ప్రముఖ రచయితలు, సాహితీవేత్తలు మాత్రం కథానాయకుల సహజ లక్షణాలను బట్టి - చతుర్విద కథానాయకులు - అని చెప్పకనే చెప్పారు.



1.ధీరోదాత్తుడు - ధైర్యం వంటి ఉదాత్త గుణములు గలవాడు.

2. ధీరోద్దతుడు - గర్వము అసూయ, క్రోధము వంటి గుణములు గలవాడు.

3. ధీరశాంతుడు - అనగా ప్రసన్నాత్ముడు. ధీరుడు.

4. ధీరలలితుడు - అనగా నిశ్చింతుడు. కళలలో ఆసక్తి గలవాడు నిరంతరము సుఖజీవన అభిలాషి.







బేబమ్మ క్రేజ్ ఇది.. అప్పటి యాడ్ ఇప్పుడు వైరల్ అయ్యిందిగా..!

కామ్రేడ్ మూమెంట్.. ఆచార్యలో చరణ్ లుక్ రచ్చ రచ్చ..!

నాగ్ షాకింగ్ డెసిషన్... బొమ్మ బ్లాక్ బస్టరే...?

అమిత్ షా అలా షాక్.. తేలని పంచాయతీ..?

వామ్మో .... వాళ్ళిద్దరే అనుకుంటే మధ్యలో ఆయన పెద్ద షాక్ ఇచ్చారుగా .....??

17 రోజుల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టి ప్రభాస్ సినిమానే దాటేసిన ఉప్పెన....

పురపోరు : తాడిపత్రిలో ఆ విషయంలో సక్సెస్ అయిన పెద్దారెడ్డి !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>