Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasf16827e7-0063-4f5c-8f72-90dd05e339de-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasf16827e7-0063-4f5c-8f72-90dd05e339de-415x250-IndiaHerald.jpgడార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా మూవీలతో దూసుకుపోతున్నాడు. ఒక సినిమా సెట్ పై ఉండగానే మరిన్ని సినిమాలను కూడా సెట్ పైకి తీసుకొస్తున్నారు. వరుస షెడ్యూల్ తో ప్రభాస్ ప్రస్తుతం గాలి పీల్చుకోవడానికి కూడా టైం లేనంతగా బిజీగా ఉన్నారు. అన్ని పాన్ ఇండియా సినిమాలే కావడంతో ఈ సినిమాల పట్ల డార్లింగ్ బాగా కేర్ తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ సినిమాల్లో రెబల్ స్టార్ మరింత హ్యాండ్ సమ్ గా కనిపించడాని గాను అదిరిపోయే బాడీ లుక్ ను మెయిన్ టెయిన్ చేస్తున్నారు. అందుకోసమే యాక్షన్ సినిమాల ఎprabhas;prabhas;saif ali khan;krishnam raju;ramu;india;bollywood;cinema;bahubali;episode;air;darlingఇదంతా దేనికోసమబ్బా.. డార్లింగ్ ఈ రేంజ్ లో కండలు పెంచేస్తున్నాడు..ఇదంతా దేనికోసమబ్బా.. డార్లింగ్ ఈ రేంజ్ లో కండలు పెంచేస్తున్నాడు..prabhas;prabhas;saif ali khan;krishnam raju;ramu;india;bollywood;cinema;bahubali;episode;air;darlingMon, 01 Mar 2021 15:00:00 GMTడార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా మూవీలతో దూసుకుపోతున్నాడు. ఒక సినిమా సెట్ పై ఉండగానే మరిన్ని సినిమాలను కూడా సెట్ పైకి తీసుకొస్తున్నారు. వరుస షెడ్యూల్ తో ప్రభాస్ ప్రస్తుతం గాలి పీల్చుకోవడానికి కూడా టైం లేనంతగా బిజీగా ఉన్నారు. అన్ని పాన్ ఇండియా సినిమాలే కావడంతో ఈ సినిమాల పట్ల డార్లింగ్ బాగా కేర్ తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.  అందుకే ఈ సినిమాల్లో రెబల్ స్టార్ మరింత హ్యాండ్ సమ్ గా కనిపించడాని గాను అదిరిపోయే బాడీ లుక్ ను మెయిన్ టెయిన్ చేస్తున్నారు. అందుకోసమే యాక్షన్ సినిమాల ఎపిసోడ్ ల కోసం రెబల్ స్టార్ తెగ కష్టపడిపోతున్నాడు పాపం. కాస్త టైం దొరికినా చాలు జిమ్ లో గడిపేస్తున్నారు. హై పవర్ వర్కౌట్లతో చెమటను చిందిస్తున్నాడు ఈ ఆరడుగుల అందగాడు. యాక్షన్ సీన్స్ కు తగ్గట్టుగానే తన బాడీని కండలతో నింపేద్దామని ప్రభాస్ ఫిక్స్ అయినట్టున్నాడు.
అందుకోసమే ఈ వర్కౌట్లను చేసేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నాడు రెబల్ స్టార్. ఒక విధంగా చెప్పాలంటే దర్శక ధీరుడు తెరకెక్కించిన బాహుబలి సినిమాకు కూడా ప్రభాస్ ఇలాంటి వర్కౌట్లే చేశాడు. అందుకే కదా ఆ మూవీలో ప్రభాస్ కండలతో  దర్శనమిచ్చారు. ఇప్పుడు కూడా అలాగే కనిపించబోతున్నారన్న మాట. మళ్లీ కండలు పెంచేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి డార్లింగ్ సిద్దమవుతున్నాడు. ముందే ప్రభాస్ సినిమాలో యాక్షన్  సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. అయితే ఖచ్చితంగా ఈ రేంజ్ లో వర్కౌట్లు చేస్తున్నాడు కాబట్టి ‘సలార్’ మూవీ కోసమేనని మీరు అనుకోవచ్చు.కానీ సలార్ కోసం ఈ లుక్ కాదట.

ఈ లుక్ లో కనిపించేంది ‘ఆదిపురుష్’ మూవీ కోసమట. రాముడి పాత్రకు నప్పేటట్టు తన శరీరాన్ని మలుచుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూంటింగ్ ముంబైలోని ఓ ప్రైవేట్ ఫిలిం స్టూడియోలో జరగనుందని సమాచారం. ఈ మూవీలో లంకేశ్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించనున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం.. ఇందులో వాడనున్న భాషను నేర్చుకునే పనిలో పడ్డారట నటీనటులు. ప్రభాస్ కూడా ఈ సరికొత్త భాషను నేర్చుకునే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా అతికొన్ని రోజులలోనే సెట్ పైకి వెళ్లనుంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


ప్రియుడితో రొమాన్స్ చేస్తూ భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది.. బయట నుంచి బంధించారని దారుణం !

పురపోరు : బాలయ్య ఇలాకాలో వైసీపీకి కొత్త టెన్షన్..

పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ. ప్రూఫ్ కూడా చూపెడుతూ..?

ఏపీలో టోల్ బాదుడు మరింత పెరిగేనా..?

‘ఆచార్య’ పై మెగాస్టార్ చిరంజీవికి అనుమానం..!?

పుర పోరు : ఆ విషయంలో విశాఖే నంబర్ వన్...!

పుర పోరు : విశాఖలోనే వీక్....షాకే మరి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>