Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/last-ball-catch-dropped-and-drawn-a-winning-match037c9fc9-0af3-4a54-b551-572c25ca6192-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/last-ball-catch-dropped-and-drawn-a-winning-match037c9fc9-0af3-4a54-b551-572c25ca6192-415x250-IndiaHerald.jpg‘క్యాచెస్ విన్స్ మ్యాచెస్’ ఈ నానుడి క్రికెట్‌లో ఎప్పటినుంచో ఉంది. ఒక్కో క్యాచ్‌ను పట్టుకోకకపోవడం వల్ల ఆ బ్యాట్స్‌మన్ లైఫ్ పొంది ఆ తరువాత విజృంభించి ఆడిన సందర్భాలున్నాయి. దాంతో ప్రత్యర్థి జట్టు ఓటమిపాలైన మ్యాచ్‌లూ లేకపోలేదు. అయితే తాజాగా జరిగిన ఓ మ్యాచ్ మాత్రం చివరి బంతికి వచ్చిన క్యాచ్ అందుకోలేకపోవడం చేతిదాకా వచ్చిన విజయం కళ్లముందే..catch drop;korea, south;australia;chad;2020;twitter;paruguచివరి బంతికి క్యాచ్.. మిస్ చేసి ఎంత పెద్ద తప్పు చేశారో..! ఈ వీడియో చూడండిచివరి బంతికి క్యాచ్.. మిస్ చేసి ఎంత పెద్ద తప్పు చేశారో..! ఈ వీడియో చూడండిcatch drop;korea, south;australia;chad;2020;twitter;paruguMon, 01 Mar 2021 22:17:00 GMTసిడ్నీ: ‘క్యాచెస్ విన్స్ మ్యాచెస్’ ఈ నానుడి క్రికెట్‌లో ఎప్పటినుంచో ఉంది. ఒక్కో క్యాచ్‌ను పట్టుకోకకపోవడం వల్ల ఆ బ్యాట్స్‌మన్ లైఫ్ పొంది ఆ తరువాత విజృంభించి ఆడిన సందర్భాలున్నాయి. దాంతో ప్రత్యర్థి జట్టు ఓటమిపాలైన మ్యాచ్‌లూ లేకపోలేదు. అయితే తాజాగా జరిగిన ఓ మ్యాచ్ మాత్రం చివరి బంతికి వచ్చిన క్యాచ్ అందుకోలేకపోవడం చేతిదాకా వచ్చిన విజయం కళ్లముందే చేజారింది. షెఫీల్డ్ షీల్డ్‌ 2020-21 సిరీస్‌లో భాగంగా సౌత్‌ ఆస్ట్రేలియా, వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ విచిత్ర ఘటన జరిగింది.

మ్యాచ్‌‌లో గెలుపు తథ్యంగా భావించిన జట్టు ఎవరు ఊహించని విధంగా డ్రాతో సరిపెట్టుకుని విజయాన్ని దూరం చేసుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్‌ ఆస్ట్రేలియా 8 వికెట్లకు 510 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా 5 వికెట్లకు 409 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌కు దిగిన సౌత్ ఆస్ట్రేలియా 9 వికెట్లకు 230 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇక 332 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా 148 పరుగులు చేసి 9 వికెట్లు మాత్రమే కోల్పోయింది. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఇక్కడ విచిత్రమంతా రెండో ఇన్నింగ్స్ చివరి పది నిముషాల ఆటలో సంభవించింది.

సౌత్ ఆస్ట్రేలియా విధించిన లక్ష్యాన్ని చేధించే క్రమంలో మూడోరోజు ఆటగ ముగిసే సమయానికి వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా 88 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఆట చివరిరోజైన నాలుగో రోజు మూడు సెషన్ల పాటు ఓపికగా ఆడినా వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అలా ఆట ఐదు ఓవర్లలో ముగుస్తుందనగా 143 పరుగుల వద్ద 9వ వికెట్‌ కోల్పోయింది. దీంతో మ్యాచ్‌లో సౌత్‌ ఆస్ట్రేలియా కచ్చితంగా గెలుస్తుందని అంతా అనుకున్నారు.  విజయానికి ఒక వికెట్‌ అవసరం ఉండగా టెయిలెండర్లు మాత్రమే క్రీజులో ఉన్నారు. దీంతో సౌత్ ఆస్ట్రేలియా దాదాపు 9 మంది ఫీల్డర్లను సర్కిల్‌లోనే మొహరించింది. స్లిప్‌లో ఏకంగా ఆరుగురిని నిలబెట్టింది. 4వ ఓవర్ల పాటు ఓపికగా ఆడిన వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ 5 పరుగులు జత చేశారు.
 
ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ను చాడ్ సేయర్స్ వేశాడు. క్రీజులో లియామ్‌ ఓ కోనర్‌, లియామ్‌ గుత్రేయి ఉన్నారు. ఆఖరి బంతిని కోనర్‌ ఫ్లిక్‌ చేయగా.. బ్యాట్‌ ఎడ్జ్ తాకి గాల్లోకి లేచి స్లిప్‌లో పడింది. అప్పటికే ఆరుగురు ఫీల్డర్లు ఉండడంతో క్యాచ్‌ అని భావించారు. ఇక సౌత్ ఆస్ట్రేలియా విజయం తథ్యమని అనుకున్నారు. కానీ ఆశ్చర్యంగా ఫీల్డర్‌ ఆ క్యాచ్ అందుకోలేకపోయాడు.  దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. దీంతో సౌత్‌ ఆస్ట్రేలియా ఆటగాళ్లు నిరాశలో మునిగిపోయారు. విజయం వరించినట్లే వరించి చేజారిపోయిందని బాధపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

" style="height: 781px;">




నాగ్ షాకింగ్ డెసిషన్... బొమ్మ బ్లాక్ బస్టరే...?

అమిత్ షా అలా షాక్.. తేలని పంచాయతీ..?

వామ్మో .... వాళ్ళిద్దరే అనుకుంటే మధ్యలో ఆయన పెద్ద షాక్ ఇచ్చారుగా .....??

17 రోజుల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టి ప్రభాస్ సినిమానే దాటేసిన ఉప్పెన....

పురపోరు : తాడిపత్రిలో ఆ విషయంలో సక్సెస్ అయిన పెద్దారెడ్డి !

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో షణ్ముక్ జశ్వంత్ చెప్పిన ఆ ఒక్క మాటతో..పోలీసులు ఏం చేశారో తెలుసా..??

పురపోరు : రాయదుర్గంలో బట్టబయలు అయిన వైసీపీ కుట్ర ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>