PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/brain-strokea04bb368-e081-4399-9338-36ecdfeaab50-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/brain-strokea04bb368-e081-4399-9338-36ecdfeaab50-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో చాల మంది ఆరోగ్యపై శ్రద్ద చూపడం లేదు. ఉద్యోగంలో పడి మానసిక ఒత్తిళ్ల, ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, అధిక ఆలోచనలతో అనారోగ్యం బారిన పడుతున్నారు. మెదడులో కొన్ని భాగాలకు రక్తం సరఫరా ఆగిపోవడంతో స్ట్రోక్‌ వచ్చేప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే వీటి లక్షణాలను కొన్ని సార్లు ముందే పసిగడితే ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చునని అంటున్నారు నిపుణులు.brain stroke;job;yogaఅలర్ట్: బ్రెయిన్‌ స్ట్రోక్‌కు నెల ముందు కనిపించే లక్షణాలు ఇవే..!?అలర్ట్: బ్రెయిన్‌ స్ట్రోక్‌కు నెల ముందు కనిపించే లక్షణాలు ఇవే..!?brain stroke;job;yogaMon, 01 Mar 2021 06:00:00 GMT
అయితే ముఖం, చేతులు, కాళ్లు మొద్దుబారడం, సాధారణమైన లక్షణమే అయినా బ్రెయిన్‌ స్ట్రోక్‌ ముందు ఇలా జరుగుతుంది. అయితే ముఖం, చేతులు, కాళ్లు ఒక వైపు మాత్రమే మొద్దుబారడం జరుగుతుంది. కంటి చూపులో కూడా సమస్య ఏర్పడుతుంది. నెల ముందు నుంచే కంటి చూపులో తేడా కనిపిస్తుంది. శ్వాసలో సమస్య ఏర్పడుతుంది. ఛాతీనొప్పి, శ్వాసలో సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే అది స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉందని గమనించాలంటున్నారు. ఇక ఎక్కిళ్లు కూడా ఎక్కువగానే వస్తుంటాయి.

ఇక ఈ స్ట్రోక్‌ వచ్చే ముందు అకస్మాత్తుగా ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంటుంది. మహిళల్లో స్ట్రోక్‌ వచ్చే ముందు వారి ప్రవర్తనలో మార్పులు గమనించవచ్చని నిపుణులు అంటున్నారు. ఉన్నట్టుండి కొన్ని విషయాలు మార్చిపోవడం, వ్యక్తిత్వంలో మార్పులు తెలుస్తుంటాయి. అంతేకాకుండా వికారం, వాంతులు, మెదడులో కొన్ని భాగాల్లో వచ్చిన సమస్యల కారణంగా వాంతులు, వికారంగా ఉండటం వంటివి
కనిపిస్తాయి.

అంతేకాదు ఈ స్ట్రోక్‌ వచ్చే ముందు అధిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల మెదడులో రక్త గడ్డ కట్టే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు గర్భస్రావాలు జరుగుతుంటాయి. అది స్ట్రోక్ రిస్క్ ను పెరిగేలా చేస్తుందని అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ వెల్లడిస్తోంది. అడ్రినల్ గ్రంథుల్లో ఉత్పత్తి అయ్యే డీహెచ్ఈఏ హార్మోన్ వెంటనే తగ్గిపోతుంది. దాని కారణంగా ఈస్ట్రోజన్లు, ఆండ్రోజన్స్ తగ్గిపోతుంటాయి.

ఇక ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఎక్కువగా టెన్షన్‌కు గురి కాకుండా ఉండాలని చెబుతున్నారు. అధికంగా ఆలోచించడం కంటే యోగా, ధ్యానం లాంటివి చేసుకుంటూ మనసు ప్రశాంతంగా ఉంచుకునే విధంగా చూసుకోవాలని వెల్లడిస్తున్నారు. లేకపోతే ఇలా ఆరోగ్యం బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం వైద్యులు హెచ్చరిస్తున్నారు.


మార్చి 1వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా...?

వేసింది కోటే.. కాని ఆ చూపులు మాత్రం...!

2022 సంక్రాంతికే పవర్ స్టార్.. అసలు సిసలు బాక్సాఫీస్ ఫైట్..!

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సాయి పల్లవి కొత్త పాట.. ట్రెండింగ్ లో నెంబర్ 1..!

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>