MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/netizens-shocked-by-jayasudha-70bdf452-7670-4919-b4d7-db477aea09f6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/netizens-shocked-by-jayasudha-70bdf452-7670-4919-b4d7-db477aea09f6-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో సహజనటి జయసుధ గురించి తెలియని వారంటూ ఎవరు లేరు. అద్భుతమైన నటనతో దశాబ్దాల పాటు ఆమె తెలుగు ప్రేక్షకులను ఓలలాడించారు. ఎన్టీఆర్, ఏన్నార్, శోభన్ బాబు వంటి అగ్రహీరోల సరసన ఆడిపాడారు. ప్రస్తుత హీరోలకు అమ్మ పాత్రల్లో అద్బుతంగా ఇమిడిపోయారు. ఇక నయా జనరేషన్ హీరోలకు అమ్మమ్మ, నాన్నమ్మ పాత్రలు వేస్తున్నారు ఆవిడ. అయితే ఏ పాత్ర వేసినా దానికి తనదైన మార్క్ వెయిట్ తీసుకొస్తారు జయసుధ. jayasudha;ntr;ilayaraja;jayasudha;ramu;rani;sujatha;vijaya nirmala;cinema;telugu;netizens;tamil;chennai;nandamuri taraka rama raoజయసుధను చూసి షాక్ అవుతున్న నెటిజన్స్..!?జయసుధను చూసి షాక్ అవుతున్న నెటిజన్స్..!?jayasudha;ntr;ilayaraja;jayasudha;ramu;rani;sujatha;vijaya nirmala;cinema;telugu;netizens;tamil;chennai;nandamuri taraka rama raoMon, 01 Mar 2021 12:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో సహజనటి జయసుధ గురించి తెలియని వారంటూ ఎవరు లేరు. అద్భుతమైన నటనతో దశాబ్దాల పాటు ఆమె తెలుగు ప్రేక్షకులను ఓలలాడించారు. ఎన్టీఆర్, ఏన్నార్, శోభన్ బాబు వంటి అగ్రహీరోల సరసన ఆడిపాడారు. ప్రస్తుత హీరోలకు అమ్మ పాత్రల్లో అద్బుతంగా ఇమిడిపోయారు. ఇక నయా జనరేషన్ హీరోలకు అమ్మమ్మ, నాన్నమ్మ పాత్రలు వేస్తున్నారు ఆవిడ. అయితే ఏ పాత్ర వేసినా దానికి తనదైన మార్క్ వెయిట్ తీసుకొస్తారు జయసుధ.

అయితే ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆమె నటన అద్భుతం అని చెప్పాలి. కాగా ఇటీవలి కాలంలో జయసుధ సినిమాల్లో కనిపించలేదు. తాజాగా ఓ సీరియల్ గురించి జయసుధ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అందులో ఆమె తెల్ల జుట్టుతో కనిపిస్తున్నారు. చాలా సన్నగా కూడా అయిపోయారు. డైట్ చేసి కావాలనే వెయిట్ తగ్గారా..? లేక అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా..? తెలియాల్సి ఉంది.

ఇక తాజా వీడియోలో జయసుధ జానకి కలగనలేదు అనే సీరియల్ గురించి మాట్లాడారు. త్వరలో ఈ సీరియల్ వీక్షకుల ముందుకు రాబోతున్నట్లు చెప్పారు. “జానకి కలగనలేదు.. రాముని సతికాగలనని ఏనాడు”.. అనే సాంగ్ తాను, శోభన్ బాబు కలిసి నటించామని.. ఆ సాంగ్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసినట్లు చెప్పారు. ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ పాట.. అన్ని కార్యక్రామాల్లో భాగమైందని చెప్పారు. అప్పట్లో ఆ సాంగ్‌ను ఊటీలో షూట్ చేశామని.. ఆ పాటలోని తన కాస్ట్యూమ్స్ కూడా ప్రేక్షకులకు నచ్చాయని చెప్పారు. ఇప్పుడు ఆ సాంగ్ పేరుతో సీరియల్ రాబోతుందని.. ఆ టీమ్ అందరకీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సీరియల్ మెగా సక్సెక్ కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

అంతేకాదు నటిగా ప్రేక్షకులను మెప్పించిన జయసుధ 1958, డిసెంబర్‌ 17న మద్రాసులో జన్మించింది. అలా అని తమిళ వారనుకోకండి. ఆమె స్వచ్చమైన తెలుగువారే. జయసుధ అసలు పేరు సుజాత. టీచర్‌  కావాలనుకున్న జయసుధను సినిమా రంగం విజయనిర్మల రూపంలో ఆహ్వానిచ్చింది. విజయ నిర్మల ప్రోత్సాహంతో వెండితెరపై అగ్రకథానాయికగా రాణించారు జయసుధ.


తిరుపతిలో మండిపోతున్న నిత్యావసర వస్తువులు ధరలు..

పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ. ప్రూఫ్ కూడా చూపెడుతూ..?

ఏపీలో టోల్ బాదుడు మరింత పెరిగేనా..?

‘ఆచార్య’ పై మెగాస్టార్ చిరంజీవికి అనుమానం..!?

పుర పోరు : ఆ విషయంలో విశాఖే నంబర్ వన్...!

పుర పోరు : విశాఖలోనే వీక్....షాకే మరి...?

రేషన్ కార్డు ఇక సులభం కాదు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>