MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-business-was-effected-by-virus88762f6c-125b-4519-b68c-ac7792fceb51-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-business-was-effected-by-virus88762f6c-125b-4519-b68c-ac7792fceb51-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల కరోనాక్రైసిస్ వేళ ప్రపంచం మొత్తం షట్ డౌన్ అయ్యింది. అయినా చాలా మంది మానవతా హృదయంతో తమ ఉద్యోగుల్ని ఆదుకునేందుకు ప్రయత్నించారుrakul;business;chiranjeevi;bhama;deepa;deva;krish;rakul preet singh;visakhapatnam;hyderabad;bollywood;cinema;vishakapatnam;jaan;cheque;heroine;vaishnav tej;john;chitramవైరస్ దెబ్బకు రకుల్ బిజినెస్ విలవిలవైరస్ దెబ్బకు రకుల్ బిజినెస్ విలవిలrakul;business;chiranjeevi;bhama;deepa;deva;krish;rakul preet singh;visakhapatnam;hyderabad;bollywood;cinema;vishakapatnam;jaan;cheque;heroine;vaishnav tej;john;chitramMon, 01 Mar 2021 15:00:00 GMTరకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల కరోనాక్రైసిస్ వేళ ప్రపంచం మొత్తం షట్ డౌన్ అయ్యింది. అయినా చాలా మంది మానవతా హృదయంతో తమ ఉద్యోగుల్ని ఆదుకునేందుకు ప్రయత్నించారు. అలాంటివాళ్లంతా దేవుళ్లతో సమానం. అందులో ఎంటర్ ప్రెన్యూర్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉంది. ఈ భామ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.

ఓవైపు స్టార్ హీరోల సరసన క్రేజీ హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలో.. మరోవైపు తెలివైన ప్రణాళికలతో చక్క బెట్టుకుంది. ఎఫ్ 45 పేరుతో హైదరాబాద్ సహా విశాఖపట్నంలో జిమ్ లను తెరిచారు రకుల్. ఇవన్నీ ఫ్రాంఛైజీ బిజినెస్ తరహాలో ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. తదుపరి బెంగళూరు చెన్నయ్ వంటి చోట్లకు విస్తరించాలన్నది తన ప్లాన్.

అయితే ఇంతలోనే మాయదారి మహమ్మారీ వైరస్ వెంటపడి తరిమింది. కరోనా దెబ్బకు అన్ని బిజినెస్ లు కుప్పకూలాయి. ముఖ్యంగా జిమ్ములు పార్కులు కూడా మూసేశారు. దీంతో రకుల్ జిమ్ బిజినెస్ కి ఘోరమైన దెబ్బ తగిలిందట. అయితే జిమ్ లు మూసేశాం కదా అని పని వాళ్ల జీతాలు ఎగ్గొట్టేయలేదట. టైమ్ టు టైమ్ వారికి జీతాలు చెల్లించి కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకున్నారట. ఆ విషయాన్ని రకుల్ స్వయంగా వెల్లడించారు.

కానీ.. నిజమే రకుల్ తన మానవతను చాటుకున్న గొప్ప దేవత అయ్యారు. కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో మెగాస్టార్ చిరంజీవి సినీకార్మికులను ఆదుకుని దేవుడే అయ్యారు. పలువురు స్టార్లు కోట్లాది రూపాయలు సీఎం నిధికి జమ చేశారు. కానీ రకుల్ మాత్రం తన స్థాయికి తగ్గట్టు తన ఉద్యోగులకు మేలు చేశారన్నమాట. రకుల్ ఓ కీలక పాత్రలో నటించిన చెక్ రిలీజైంది. వైష్ణవ్ తేజ్ తో కలిసి క్రిష్ దర్శకత్వంలో నటించింది. ఆ మూవీ టైటిల్ ని త్వరలో ప్రకటించనున్నారు. బాలీవుడ్ లో మేడే అనే చిత్రంతో పాటు వరుసగా సినిమాల్లో నటిస్తోంది. జాన్ అబ్రహాం సరసన ఎటాక్ లోనూ నటించగా ప్రస్తుతం ఈ మూవీ నిర్మాణానంతర పనుల్లో ఉంది.


ప్రియుడితో రొమాన్స్ చేస్తూ భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది.. బయట నుంచి బంధించారని దారుణం !

పురపోరు : బాలయ్య ఇలాకాలో వైసీపీకి కొత్త టెన్షన్..

పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ. ప్రూఫ్ కూడా చూపెడుతూ..?

ఏపీలో టోల్ బాదుడు మరింత పెరిగేనా..?

‘ఆచార్య’ పై మెగాస్టార్ చిరంజీవికి అనుమానం..!?

పుర పోరు : ఆ విషయంలో విశాఖే నంబర్ వన్...!

పుర పోరు : విశాఖలోనే వీక్....షాకే మరి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>