MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasd1e805c7-57cb-4fda-948b-a5c2d70a3e2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasd1e805c7-57cb-4fda-948b-a5c2d70a3e2c-415x250-IndiaHerald.jpgసంక్రాంతి సినిమాల పై క్లారిటీ సాధారణంగా పండుగ మూడు నెలల ముందు వస్తూ ఉంటుంది. అయితే వచ్చే సంవత్సరం సంక్రాంతి సినిమాల సీజన్ పై క్లారిటీ సుమారు 10 నెలల ముందు రావడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. గత సంవత్సరం కరోనా సమస్యలు వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ పరిస్థితులతో సుమారు 9 నెలల పాటు ధియేటర్స్ మూత పడడంతో క్రితం సంవత్సరం విడుదల కావలసిన సినిమాలు ఇప్పుడు వరసగా క్యూ కడుతున్నాయి.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు కూడ తమ రిలీజ్ డేట్స్ ను చాల ముందుగా ప్రకటించడంతో ఈసంవత్సరంలోని ప్రతి పండుగకు విడుదల prabhas;pawan;mahesh;prabhas;kranthi;kranti;krish;prasanth;prashanth neel;ram pothineni;makar sakranti;india;cinema;sankranthi;festival;industry;war;vegetable market;prasanth neel;prashant kishorపవన్ ప్రభాస్ ల అష్టదిగ్భందంలో మహేష్ !పవన్ ప్రభాస్ ల అష్టదిగ్భందంలో మహేష్ !prabhas;pawan;mahesh;prabhas;kranthi;kranti;krish;prasanth;prashanth neel;ram pothineni;makar sakranti;india;cinema;sankranthi;festival;industry;war;vegetable market;prasanth neel;prashant kishorMon, 01 Mar 2021 09:00:00 GMTసంక్రాంతి సినిమాల పై క్లారిటీ సాధారణంగా పండుగ మూడు నెలల ముందు వస్తూ ఉంటుంది. అయితే వచ్చే సంవత్సరం సంక్రాంతి సినిమాల సీజన్ పై క్లారిటీ సుమారు 10 నెలల ముందు రావడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. గత సంవత్సరం కరోనా సమస్యలు వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ పరిస్థితులతో సుమారు 9 నెలల పాటు ధియేటర్స్ మూత పడడంతో క్రితం సంవత్సరం విడుదల కావలసిన సినిమాలు ఇప్పుడు వరసగా క్యూ కడుతున్నాయి.


ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు కూడ తమ రిలీజ్ డేట్స్ ను చాల ముందుగా ప్రకటించడంతో ఈసంవత్సరంలోని ప్రతి పండుగకు విడుదల అయ్యే సినిమాల క్లారిటీ చాలముందుగా వచ్చేసింది. దీనితో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న పవన్ మహేష్ ప్రభాస్ ల మూవేలు ఏకంగా ఒకేసారి ఒకదాని పై ఒకటి పోటీ పడుతూ వచ్చే సంవత్సరం సంక్రాంతి రేస్ కు రావడానికి ఫిక్స్ కావడంతో వచ్చే సంక్రాంతి సీజన్ పోటీ కనీవినీ ఎరుగని స్థాయిలో జరగబోతోంది.


ఇప్పటికే మహేష్ పరుశు రామ్ ల కాంబినేషన్ మూవీ ‘సర్కారు వారి పాట’ ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లుగా లీకులు వచ్చాయి. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా పవన్ క్రిష్ ల క్రేజీ మూవీ ప్రాజెక్ట్ ను కూడ సంక్రాంతి రేస్ కు రెడీ పెడుతున్నట్లు క్రిష్ నుండి సంకేతాలు వస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈమూవీ పై భారీ అంచనాలు ఉండటంతో ఈమూవీ మార్కెట్ కు కూడ అన్ని విధాలా సంక్రాంతి సీజన్ సహకరిస్తుందని ఈమూవీ నిర్మాతల అభిప్రాయం అని అంటున్నారు.


అత్యంత భారీ అంచనాలతో ఈమధ్యనే షూటింగ్ ప్రారంభం అయిన ప్రభాస్ ప్రశాంత్ నీల్ ల అత్యంత భారీ ప్రాజెక్ట్ ‘సలార్’ ను కూడ సంక్రాంతి విడుదల చేసే టార్గెట్ లో ఈమూవీ నిర్మాతలు ఫిక్స్ అయినట్లు టాక్. ఈమూవీ షూటింగ్ ను ఎలాంటి బ్రేక్ లేకుండా వేగంగా పూర్తి చేసి ఆతరువాత ‘ఆదిపురుష్’ షూటింగ్ పై దృష్టి పెట్టాలని ప్రభాస్ స్థిరనిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు ఈమూవీ కూడ వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లోకి ఎంటర్ అవుతోంది. దీనితో ఎప్పుడు లేని విధంగా వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ పవన్ మహేష్ ప్రభాస్ ల మధ్య వార్ గా మారబోతోంది..





గుడ్‌న్యూస్‌: పెట్రోల్ ధ‌ర‌ల రేట్లు త‌గ్గుతున్నాయ్‌...

తెలంగాణలో రాజ‌కీయంపై ప‌వ‌న్‌ స్ట్రాట‌జీ అదేన‌ట‌... ఇక దూకుడేన‌ట‌..

ప‌వ‌న్‌ను గెలిపిస్తే.. బీసీ కాలంలోకే... సెటైర్లు పేలుతున్నాయ్ ?

పుర‌పోరు: `బంద‌రు` ల‌డ్డు కోసం.. టీడీపీ-జ‌న‌సేన తెర‌చాటు ఒప్పందం..!

విజ‌య‌వాడ వైసీపీకి బిగ్ షాక్‌... కీల‌క నేత గుడ్ బై

నోరు జారిన బండి సంజయ్.. ఛాన్స్ దొరికిందని కుమ్మేశారుగా..?

ప‌శ్చిమ బెంగాల్లో మమ‌త‌, త‌మిళ‌నాడులో స్టాలిన్‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>