PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pm-modi-covid-vacciene837fdad9-0d4a-457c-b839-ceb647b9e8db-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pm-modi-covid-vacciene837fdad9-0d4a-457c-b839-ceb647b9e8db-415x250-IndiaHerald.jpgదేశీయ ఫార్మాదిగ్గజం హైదారాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్‌ టీకాను ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నారు. టీకా తీసుకున్న సమయంలో అసోంలో తయారు చేసిన గమ్చా ను ధరించి మోడీ కనిపించారు. అసోం మహిళల ఆశీస్సులకు చిహ్నంగా ఆయన ఈ వస్త్రాన్ని ధరించారు. గతంలోనూ చాలా సందర్భాల్లో మోడీ గమ్చా ను ధరించారుpm modi covid vacciene;modi;india;narendra modi;police;january;prime minister;march;narendraకొవిడ్ టీకా తీసుకున్న ప్రధాని మోడీకొవిడ్ టీకా తీసుకున్న ప్రధాని మోడీpm modi covid vacciene;modi;india;narendra modi;police;january;prime minister;march;narendraMon, 01 Mar 2021 08:48:13 GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ  కొవిడ్‌ వ్యాక్సిన్ వేయించుకున్నారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా  60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న దీర్ఘకాల వ్యాధిగ్రస్థులకు మార్చి 1 నుంచి టీకా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్‌ కు వెళ్లిన  ప్రధాని మోడీ.. తొలి డోసు టీకాను తీసుకున్నారు.  మోడీకి సిరంజీ ద్వారా ఎయిమ్స్‌ సిస్టర్‌ పి.నివేదా టీకా ఇచ్చారు. ప్రధానికి టీకా వేసే సమయంలో కేరళకు చెందిన మరో నర్సు కూడా అక్కడ ఉన్నారు.  .  ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయన ఉదయాన్నే ఎయిమ్స్‌కు వెళ్లి కొవిడ్‌ టీకా తీసుకున్నారు.

దేశీయ ఫార్మాదిగ్గజం హైదారాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్‌ టీకాను ప్రధాని నరేంద్ర మోడీ  తీసుకున్నారు. టీకా తీసుకున్న సమయంలో అసోంలో తయారు చేసిన గమ్చా ను ధరించి మోడీ కనిపించారు. అసోం మహిళల ఆశీస్సులకు చిహ్నంగా ఆయన ఈ వస్త్రాన్ని ధరించారు. గతంలోనూ చాలా సందర్భాల్లో మోడీ గమ్చా ను ధరించారు

తాను కరోనా తొలి డోసు టీకా తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ   ప్రకటించారు. కొవిడ్‌కి వ్యతిరేకంగా మన దేశ వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. అర్హులందరూ కొవిడ్‌ టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మనమందరం కలిసి భారత్‌ను కొవిడ్‌ రహిత దేశంగా తీర్చిదిద్దుదామని ఆయన పిలుపునిచ్చారు.  

దేశంలో జనవరి 16 నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ మొదలైంది. తొలి దశలో ప్రభుత్వ ఆస్పత్రికి సిబ్బందికి టీకా వేశారు. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ సిబ్బందికి ఇచ్చారు. దాంతో ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ఉన్న పోలీసులు, శానిటేషన్ సిబ్బందికి కూడా కొవిడ్ టీకా పంపిణి చేశారు. మార్చి 1 నుంచి 60 ఏండ్లు పైబడిన వృద్ధులకు , 35 ఏండ్లకు పైబడి ధీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు.




గుడ్‌న్యూస్‌: పెట్రోల్ ధ‌ర‌ల రేట్లు త‌గ్గుతున్నాయ్‌...

తెలంగాణలో రాజ‌కీయంపై ప‌వ‌న్‌ స్ట్రాట‌జీ అదేన‌ట‌... ఇక దూకుడేన‌ట‌..

ప‌వ‌న్‌ను గెలిపిస్తే.. బీసీ కాలంలోకే... సెటైర్లు పేలుతున్నాయ్ ?

పుర‌పోరు: `బంద‌రు` ల‌డ్డు కోసం.. టీడీపీ-జ‌న‌సేన తెర‌చాటు ఒప్పందం..!

విజ‌య‌వాడ వైసీపీకి బిగ్ షాక్‌... కీల‌క నేత గుడ్ బై

నోరు జారిన బండి సంజయ్.. ఛాన్స్ దొరికిందని కుమ్మేశారుగా..?

ప‌శ్చిమ బెంగాల్లో మమ‌త‌, త‌మిళ‌నాడులో స్టాలిన్‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>