Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/five-accused-arrested-linked-in-undressing-will-trigger-rain-of-rs-50-crore-in-cash-at-nagpur2ac690a0-9c77-44ee-b6db-732e6aa20efb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/five-accused-arrested-linked-in-undressing-will-trigger-rain-of-rs-50-crore-in-cash-at-nagpur2ac690a0-9c77-44ee-b6db-732e6aa20efb-415x250-IndiaHerald.jpgకాలాలు మారుతున్నా.. సమాజం సరికొత్త టెక్నాలజీతో కొత్తపుంతలు తొక్కుతున్నా గానీ.. కొందరు మాత్రం ఇంకా మూఢనమ్మకాలనే పట్టుకుని వేళాడుతున్నారు. మనిషిని క్షుద్రపూజల ద్వారా చంపొచ్చనో.. లేక ధనవంతులు అయిపోదామనో గానీ ఇంకా.. ఈ మూఢనమ్మకాలను నమ్ముతూనే ఉన్నారు. ఈ నమ్మకాల మూలంగా ఎంతో మందిని బలి చేస్తూనే ఉన్నారు. ఎన్నో చట్టాలు వచ్చాయి.. కానీ అవేవీ ఈ మూఢనమ్మకాలను అడ్డుకోలేకపోతున్నాయి. తాజాగా బట్టలు లేకుండా నగ్నంగా.. పూజలు చేస్తే నీకు అక్షరాల రూ. 50 కోట్లు వస్తాయని ఓ బాలికను కొందరు దుండగులు నమ్మించబలికారు. ఆమె ససేcrime;ramakrishna;police;aqua;vబట్టలు విప్పితే రూ.50 కోట్లు వస్తయ్..పూజల పేరుతో అమ్మాయిని ట్రాప్ చేసారు.. చివరికి?బట్టలు విప్పితే రూ.50 కోట్లు వస్తయ్..పూజల పేరుతో అమ్మాయిని ట్రాప్ చేసారు.. చివరికి?crime;ramakrishna;police;aqua;vMon, 01 Mar 2021 18:00:00 GMTకాలాలు మారుతున్నా.. సమాజం సరికొత్త టెక్నాలజీతో కొత్తపుంతలు తొక్కుతున్నా గానీ.. కొందరు మాత్రం ఇంకా మూఢనమ్మకాలనే పట్టుకుని వేళాడుతున్నారు. మనిషిని క్షుద్రపూజల ద్వారా చంపొచ్చనో.. లేక ధనవంతులు అయిపోదామనో గానీ ఇంకా.. ఈ మూఢనమ్మకాలను నమ్ముతూనే ఉన్నారు. ఈ నమ్మకాల మూలంగా ఎంతో మందిని బలి చేస్తూనే ఉన్నారు. ఎన్నో చట్టాలు వచ్చాయి.. కానీ అవేవీ ఈ మూఢనమ్మకాలను అడ్డుకోలేకపోతున్నాయి. తాజాగా బట్టలు లేకుండా నగ్నంగా.. పూజలు చేస్తే నీకు అక్షరాల రూ. 50 కోట్లు వస్తాయని ఓ బాలికను  కొందరు దుండగులు నమ్మించబలికారు. ఆమె ససేమిరా ఒప్పుకోకపోవడంతో ఖచ్చితంగా నువ్ బట్టలు విప్పే పూజలో కూర్చోవాలంటూ బలవంత పెట్టిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటుచేసుకుంది. కాగా క్షుద్రపూజల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మైనర్ బాలికను కలిసిన ఓ వ్యక్తి.. క్షణాల్లో నువ్ ధనవంతురాలివి కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. అలా చేసిన మరుక్షణమే నువ్ అత్యంత ధనవంతురాలువి అవుతావని నమ్మించబలికాడు. ఏకంగా 50 కోట్ల రూపాయలు నీ సొంతం అవుతాయని ఆ బాలికతో చెప్పాడు సదరు వ్యక్తి. అయితే ఆ డబ్బులు రావాలంటే మాత్రం నువ్ మేము చేసే పూజలో కూర్చోవాలని కండీషన్ పెట్టాడు. ఆ బాలిక కూడా డబ్బుల వస్తాయన్న ఆశతో పూజలో కూర్చోడానికి అంగీకారం తెలిపింది. అయితే ఆ పూజలో నువ్ బట్టలు లేకుండానే కూర్చోవాలంటూ సదరు వ్యక్తి బాలికకు చెప్పాడు. దాంతో అనుమానం వచ్చిన ఆ బాలిక దానికి ఒప్పుకోలేదు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఆ బాలికపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చాడు.

 డబ్బులు కావాలంటే ఖచ్చితంగా పూజలో కూర్చోవాల్సిందేనంటూ బెదిరించాడు. దాంతో ఆ బాలిక ఆ మాయగాళ్లనుంచి తప్పించుకోవాడానికి పోలీసులను ఆశ్రయించింది. జరిగిన మొత్తం విషయాన్ని పూస గుచ్చినట్టు పోలీసులకు వివరించింది. ఆ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా ఈ దారుణం వెనక వినోద్ జయరామ్ మస్రం (42),  రామకృష్ణ దాదాజీ మస్కర్(41),   డిఆర్ అలాయాస్ సోపాన్ హరిభాపు కుమ్రే(35) , దినేష్ మహాదేవ్(25),  విక్కీ గణేష్ ఖాప్రే(20) లు ఉన్నట్టు పోలీసుల తమ విచారణలో చెప్పారు. కాగా ఈ మాయగాళ్లందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఐదుగురిపై పలు రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. 


బ్రేకింగ్ : ఆచార్య 'సిద్ధ'మవుతున్నాడు... చరణ్ పాత్ర పై హింట్ ఇచ్చిన యూనిట్ ....??

17 రోజుల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టి ప్రభాస్ సినిమానే దాటేసిన ఉప్పెన....

పురపోరు : తాడిపత్రిలో ఆ విషయంలో సక్సెస్ అయిన పెద్దారెడ్డి !

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో షణ్ముక్ జశ్వంత్ చెప్పిన ఆ ఒక్క మాటతో..పోలీసులు ఏం చేశారో తెలుసా..??

పురపోరు : రాయదుర్గంలో బట్టబయలు అయిన వైసీపీ కుట్ర ?

ఆ హీరోలకు కలిసి రాని సెంటిమెంట్ వెంకీ కి కలిసి వస్తుందా..??

పుర పోరు : విశాఖ టీడీపీ మేయర్... బిగ్ ట్విస్ట్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>