PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mp-revanth-reddy-kcr671ce0ad-f096-4cef-9ef3-cf5f3160f9d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mp-revanth-reddy-kcr671ce0ad-f096-4cef-9ef3-cf5f3160f9d5-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి . కేసీఆర్ ఎంపీగా ఉన్న సమయంలో తాను పార్లమెంటుకు హాజరు కాకున్నప్పటికీ, వచ్చినట్టుగా హాజరుపట్టికలో తన బదులు మరొకరితో సంతకాలు చేయించారని ఆరోపించారు. పార్లమెంటు సమావేశాలకు హాజరుకాకుండానే హాజరైనట్టుగా మరొకరితో సంతకాలు చేయించారని రేవంత్ రెడ్డి చెప్పారు.mp revanth reddy kcr;kcr;revanth;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;revanth reddy;congress;mp;chief minister;reddy;parliamentకేసీఆర్ పై రేవంత్ మరో బాంబ్!కేసీఆర్ పై రేవంత్ మరో బాంబ్!mp revanth reddy kcr;kcr;revanth;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;revanth reddy;congress;mp;chief minister;reddy;parliamentMon, 01 Mar 2021 19:58:16 GMTతెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మరింత దూకుడు పెంచారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి . కేసీఆర్ ఎంపీగా ఉన్న సమయంలో తాను పార్లమెంటుకు హాజరు కాకున్నప్పటికీ, వచ్చినట్టుగా హాజరుపట్టికలో తన బదులు మరొకరితో సంతకాలు చేయించారని ఆరోపించారు. పార్లమెంటు సమావేశాలకు హాజరుకాకుండానే హాజరైనట్టుగా మరొకరితో సంతకాలు చేయించారని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ పార్లమెంటును తప్పుదోవ పట్టించడంపై తాను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని, చర్యలు తీసుకునే ధైర్యం బీజేపీకి ఉందా? అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పార్లమెంటులో ఆ సంతకాలు ఎవరివో బండి సంజయ్ ఫోరెన్సిక్ పరీక్ష చేయించగలడా? అని నిలదీశారు. కేసీఆర్ పార్లమెంటుకు ఎన్నిసార్లు హాజరయ్యాడు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

వాస్తవానికి బండి సంజయ్, కేసీఆర్ విడివిడిగా కనిపించినా, వారిద్దరూ ఒక్కటేనని అన్నారు. బండి, కారు ఒక్కటేనని విమర్శించారు. కేసీఆర్ చదువుకుంది బీఏనే అని, కానీ ఎంఏ చదువుకున్నట్టు పార్లమెంటుకు తప్పుడు సమాచారం అందించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసే పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రజలకు అనుమానాలు రాకుండా ఉండేందుకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు.

ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై వ్యాఖ్యానిస్తూ... ఆయన పార్లమెంటునే తప్పుదోవ పట్టించాడని, ఆ కుంభకోణాన్ని తాను త్వరలోనే బట్టబయలు చేస్తానని చెప్పారు. స్పీకర్ అనుమతి కోసం చూస్తున్నానని అన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై తాను స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని.. చర్యలు తీసుకునే ధమ్ము బీజేపీ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు  





పీకేకు ప్రమోషన్

నాగ్ షాకింగ్ డెసిషన్... బొమ్మ బ్లాక్ బస్టరే...?

అమిత్ షా అలా షాక్.. తేలని పంచాయతీ..?

వామ్మో .... వాళ్ళిద్దరే అనుకుంటే మధ్యలో ఆయన పెద్ద షాక్ ఇచ్చారుగా .....??

17 రోజుల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టి ప్రభాస్ సినిమానే దాటేసిన ఉప్పెన....

పురపోరు : తాడిపత్రిలో ఆ విషయంలో సక్సెస్ అయిన పెద్దారెడ్డి !

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో షణ్ముక్ జశ్వంత్ చెప్పిన ఆ ఒక్క మాటతో..పోలీసులు ఏం చేశారో తెలుసా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>