PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news-breaking-news-modi-ap-bjpe47b480e-67c9-452c-8b55-e887881e2d38-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news-breaking-news-modi-ap-bjpe47b480e-67c9-452c-8b55-e887881e2d38-415x250-IndiaHerald.jpgత‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీట్ల‌కు సంబంధించి త‌క‌రారు న‌డుస్తోంది. భార‌తీయ జ‌న‌తాపార్టీ, అధికార అన్నాడీఎంకే మ‌ధ్య సీట్ల పంప‌కానికి సంబంధించి విభేదాలు రేకెత్తాయి. ఎవ‌రెన్ని సీట్ల‌లో పోటీచేయాల‌నే విష‌యంపై ఇరుపార్టీల మ‌ధ్య స్ప‌ష్ట‌త రాలేదు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. సీట్ల స‌ర్దుబాటుపై బీజేపీ, అన్నాడీఎంకే మ‌ధ్య చ‌ర్చ‌లు కొన‌సాగాయి. latest news, breaking news, modi, ap, bjp;amit shah;bharatiya janata party;g kishan reddy;amith shah;rbi;chief minister;assembly;minister;tamilnadu;central government;reddy;party;mantra60 కావాలి... 21 ఇస్తాం..60 కావాలి... 21 ఇస్తాం..latest news, breaking news, modi, ap, bjp;amit shah;bharatiya janata party;g kishan reddy;amith shah;rbi;chief minister;assembly;minister;tamilnadu;central government;reddy;party;mantraMon, 01 Mar 2021 15:12:39 GMTఅసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీట్ల‌కు సంబంధించి త‌క‌రారు న‌డుస్తోంది. భార‌తీయ జ‌న‌తాపార్టీ, అధికార అన్నాడీఎంకే మ‌ధ్య సీట్ల పంప‌కానికి సంబంధించి విభేదాలు రేకెత్తాయి. ఎవ‌రెన్ని సీట్ల‌లో పోటీచేయాల‌నే విష‌యంపై ఇరుపార్టీల మ‌ధ్య స్ప‌ష్ట‌త రాలేదు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. సీట్ల స‌ర్దుబాటుపై బీజేపీ, అన్నాడీఎంకే మ‌ధ్య చ‌ర్చ‌లు కొన‌సాగాయి.

తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కిరాలేదు. ఈ కూటమిలోని పీఎంకేకి 23 సీట్లను కేటాయించగా, బీజేపీకి త్వరలోనే సీట్లు కేటాయిస్తామని అన్నాడీఎంకే ప్ర‌క‌టించింది. సీట్ల సర్దుబాటు విషయమై ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వంతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదివారం రాత్రి చెన్నైలోని ఓ హోటల్‌లో సమావేశమయ్యారు.  అర్ధరాత్రి వ‌ర‌కు కొన‌సాగిన ఈ భేటీలో ఇరు వర్గాల‌ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని విశ్వసనీయ స‌మాచారం. వీరి భేటీ జ‌ర‌గ‌డానికి ముందు ఈపీఎస్, ఓపీఎస్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురగన్, తమిళనాడు ఎన్నికల ఇన్‌ఛార్జి , కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చ జరిగినట్టు అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. తాము ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తున్నామో ఆ వివరాలను బీజేపీ నేతలు అన్నాడీఎంకే నేత‌ల‌కు అందించారు. బీజేపీకి 21 సీట్లు ఇస్తామని అన్నాడీఎంకే స్పష్టం చేసినట్టు తెలిసింది.

బీజేపీ 60 స్థానాలు తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అన్నాడీఎంకే మాత్రం 170 నుంచి 180 సీట్లలో పోటీకి సిద్దమైంది. డీఎండీకేతోనూ జట్టుకట్టేందుకు అన్నాడీఎంకే ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీ అధినేత, నటుడు విజయ్‌కాంత్‌తో శనివార రాత్రి మంత్రులు తంగమణి, ఎస్పీ వేలుమణి సమావేశమయ్యారు. బీజేపీ, అన్నాడీఎంకే మ‌ధ్య సోమవారం రాత్రి జరగబోయే చర్చలతో సీట్ల పంప‌కం ఓ కొలిక్కి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. మిగ‌తా భాగస్వామ్య పార్టీలతో చ‌ర్చించి అన్నాడీఎంకే నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది అని పార్టీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. అయితే, గతంలో జరిగిన ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు పొందిన స్థానాలను తమకు అవకాశం ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతున్నట్టు సమాచారం.  అన్నాడీఎంకే తమ పార్టీ బలాన్ని తక్కువగా చూస్తోందని, గత కొన్నేళ్లుగా తమిళనాడులో గణనీయంగా ఓటు బ్యాంకును పెంచుకున్నామని బీజేపీ అంటోంది.  సీట్ల పంప‌కం ఒక కొలిక్కి వ‌స్తేగానీ ప్ర‌చారం మొద‌లుపెట్ట‌లేని ప‌రిస్థితి. ఏం జ‌రుగుతుందో చూద్దాం!!.


పురపోరు : బాలయ్య ఇలాకాలో వైసీపీకి కొత్త టెన్షన్..

పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ. ప్రూఫ్ కూడా చూపెడుతూ..?

ఏపీలో టోల్ బాదుడు మరింత పెరిగేనా..?

‘ఆచార్య’ పై మెగాస్టార్ చిరంజీవికి అనుమానం..!?

పుర పోరు : ఆ విషయంలో విశాఖే నంబర్ వన్...!

పుర పోరు : విశాఖలోనే వీక్....షాకే మరి...?

రేషన్ కార్డు ఇక సులభం కాదు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>