PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/confusion-in-myanmar-seven-strong-for-bullets69bd8bea-ab33-4204-9a3a-e6edc47cf015-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/confusion-in-myanmar-seven-strong-for-bullets69bd8bea-ab33-4204-9a3a-e6edc47cf015-415x250-IndiaHerald.jpgమయన్మార్‌లో ఆందోళన కారులపై తూటా పేలింది. తమ నాయకురాలు ఆంగ్‌సాన్‌ సూకీకి గృహ నిర్బంధం నుంచి విముక్తి కల్పించాలంటూ యాన్‌గాన్‌ సహా దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. జనం రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. అయితే, ఆందోళనకారులపై టియర్‌ గ్యాస్‌తో పాటు రబ్బర్‌ బులెట్లు ప్రయోగిస్తోంది సైన్యం. ఈ క్రమంలోనే శాంతియుత ప్రదర్శనపై కాల్పులకు తెగబడింది. confusion in myanmar seven strong for bullets;tiru;car;februaryమయన్మార్ లో గందరగోళం.. తూటాలకు బలైన ఏడుగురు..!మయన్మార్ లో గందరగోళం.. తూటాలకు బలైన ఏడుగురు..!confusion in myanmar seven strong for bullets;tiru;car;februaryMon, 01 Mar 2021 14:00:00 GMT
మయన్మార్‌లో ఆందోళన కారులపై తూటా పేలింది. తమ నాయకురాలు ఆంగ్‌సాన్‌  సూకీకి గృహ నిర్బంధం నుంచి విముక్తి కల్పించాలంటూ యాన్‌గాన్‌ సహా దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. జనం రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. అయితే, ఆందోళనకారులపై టియర్‌ గ్యాస్‌తో పాటు రబ్బర్‌ బులెట్లు ప్రయోగిస్తోంది సైన్యం. ఈ క్రమంలోనే శాంతియుత ప్రదర్శనపై కాల్పులకు తెగబడింది.

ఫిబ్రవరి ఒకటి సైన్యం తిరుగుబాటు చేసి ఆంగ్‌సాన్‌ సూకిని హౌస్‌ అరెస్ట్‌ చేసింది.  ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసి... అధికారాన్ని హస్తగతం  చేసుకుంది. అయితే... జుంటా తీరును నిరసిస్తూ లక్షలాది మంది జనం రోడ్లపైకి వచ్చి  నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారుల్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న సైన్యం కాల్పులకు వెనుకాడడం లేదు. తాజా కాల్పుల్లో ఏడుగురు ఆందోళనకారులు చనిపోయారు. యాన్‌గాన్‌లో ఇద్దరు, దావిలో ముగ్గురు,  మాండ్లేలో ఇద్దరు సైన్యం కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.  20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.  

మయన్మార్‌ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలతో ప్రభుత్వ కార్యకాలపాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా వారాంతాల్లో ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి సైనికుల పాలకులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. టీచర్లు, డాక్టర్లు... అన్ని వర్గాలకు చెందిన వాళ్లు విధులు బహిష్కరించి రోడ్డెక్కుతున్నారు.  

ఆందోళనలు విరమించకపోతే కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే హెచ్చరించారు సైనిక పాలకులు. గత వారాంతం సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ టీజర్‌ సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జనం మాత్రం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు.
మొత్తానికి మయన్మార్ తుపాకీ నీడలో ఉంది.





ఆరుగురు ఎంపీలకు జగన్ షాక్...?

పురపోరు : బాలయ్య ఇలాకాలో వైసీపీకి కొత్త టెన్షన్..

పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ. ప్రూఫ్ కూడా చూపెడుతూ..?

ఏపీలో టోల్ బాదుడు మరింత పెరిగేనా..?

‘ఆచార్య’ పై మెగాస్టార్ చిరంజీవికి అనుమానం..!?

పుర పోరు : ఆ విషయంలో విశాఖే నంబర్ వన్...!

పుర పోరు : విశాఖలోనే వీక్....షాకే మరి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>