MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/does-the-sentiment-workout-to-venky87cecaa9-0172-4167-8e21-30c046427644-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/does-the-sentiment-workout-to-venky87cecaa9-0172-4167-8e21-30c046427644-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో అగ్ర హీరోలుగా పేరు గాంచిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునల వలన కానిది వెంకటేష్ వల్ల అవుతుందా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉంది. ఇంతకీ దేని గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా..ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు వాళ్ళు గతంలో నటించిన సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాలకు సీక్వెల్స్ తీస్తున్నారు. venkatesh;chiranjeevi;ntr;venkatesh;rana;balakrishna;mohanlal;nagarjuna akkineni;adhithya;editor mohan;gautham new;gautham;jeevitha rajaseskhar;rajani;shankar;simhaa;amarnath cave temple;tollywood;cinema;telugu;rajani kanth;amazon;f2;king;remake;king 1;success;nandamuri taraka rama rao;father;jeethu joseph;manmadhudu 2;chandramukhi;gharshana;amarnath k menon;f3ఆ హీరోలకు కలిసి రాని సెంటిమెంట్ వెంకీ కి కలిసి వస్తుందా..??ఆ హీరోలకు కలిసి రాని సెంటిమెంట్ వెంకీ కి కలిసి వస్తుందా..??venkatesh;chiranjeevi;ntr;venkatesh;rana;balakrishna;mohanlal;nagarjuna akkineni;adhithya;editor mohan;gautham new;gautham;jeevitha rajaseskhar;rajani;shankar;simhaa;amarnath cave temple;tollywood;cinema;telugu;rajani kanth;amazon;f2;king;remake;king 1;success;nandamuri taraka rama rao;father;jeethu joseph;manmadhudu 2;chandramukhi;gharshana;amarnath k menon;f3Mon, 01 Mar 2021 16:00:00 GMTటాలీవుడ్ లో అగ్ర హీరోలుగా పేరు గాంచిన  చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునల వలన కానిది వెంకటేష్ వల్ల అవుతుందా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉంది. ఇంతకీ దేని గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా..ఈ  మధ్యకాలంలో చాలా మంది హీరోలు వాళ్ళు గతంలో నటించిన సినిమాలు  సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాలకు  సీక్వెల్స్ తీస్తున్నారు.  ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి  శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ వంటి సినిమాలు చేసాడు.కానీ  శంకర్ దాదా  ఎంబీబీఎస్ హిట్టైయితే, జిందాబాద్ మాత్రం ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వలేదు.ఇంకా మన నందమూరి  నట సింహం బాలకృష్ణ కూడా తన తండ్రి బయోపిక్‌ను రెండు  భాగాలుగా తెరకెక్కించాడు. తన తండ్రి ఎన్టీఆర్ జీవితంపై తెరెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్స్‌ బాలకృష్ణకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.  మరోవైపు బాలయ్య తన పాత సూపర్ హిట్ ‘ఆదిత్య 369’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు. మరి ఇది సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.



 అలాగే కింగ్ నాగార్జున కూడా ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. మరోవైపు ‘మన్మథుడు’ సినిమాకు సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’ సినిమాను చేసాడు. కానీ ఈ సినిమా నాగార్జున జీవితంలో ఒక ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇక త్వరలో తెరకెక్కబోయే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాను చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాడు నాగార్జున.ఇప్పుడు వెంకీ కూడా  సీక్వెల్ తీసే పనిలో ఉన్నాడు. ఈయన తాజాగా ’ఎఫ్ 2’ మూవీకి సీక్వెల్ గా ఎఫ్ 3 మూవీని చేస్తున్నాడు. ఇప్పటికే ఈ  ఎఫ్ 3 మూవీ పట్టాలెక్కింది. అలాగే మరోవైపుమోహన్ లాల్ హీరోగా నటించిన ‘దృశ్యం’ మూవీకి సీక్వెల్.. దృశ్యం 2 అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై ఘన విజయాన్ని  సాధించింది. ఇపుడీ చిత్రాన్ని అదే దృశ్యం 2 టైటిల్‌తో ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ దర్శకత్వంలోనే రీమేక్ చేయడానికి ఓకే చెప్పాడు.


మరోవైపు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన ‘ఘర్షణ’ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. తెలుగులో ఈ సినిమాను డబ్ చేసే అవకాశాలున్నాయి. కానీ రానా మాత్రం ఈ సినిమాను బాబాయి వెంకటేష్‌తో సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే గౌతమ్ మీననన్‌తో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. అంతేకాదు ఈ సీక్వెల్‌లో  వెంకటేష్‌తో పాటు రానా కూడా యాక్ట్ చేయాలనుకున్నట్టు సమాచారం. అలాగే గతంలో వెంకటేష్, రజినీకాంత్ హీరోగా నటించిన ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్‌గా తెలుగులో ‘నాగవల్లి’ సినిమా చేసాడు.కానీ నాగవల్లి సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ఇప్పటి వరకు తెలుగులో వెంకటేష్ సహ హీరోలకు ఎవరికి సీక్వెల్స్‌ సినిమాలు కలిసి రాలేదు.మరి ఆ హీరోలకు దక్కని విజయం వెంకటేష్‌కు f3, దృశ్యం 2తో వస్తుందా... లేదా అనేది చూడాలి.. !!


ప్రియుడితో రొమాన్స్ చేస్తూ భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది.. బయట నుంచి బంధించారని దారుణం !

పురపోరు : బాలయ్య ఇలాకాలో వైసీపీకి కొత్త టెన్షన్..

పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ. ప్రూఫ్ కూడా చూపెడుతూ..?

ఏపీలో టోల్ బాదుడు మరింత పెరిగేనా..?

‘ఆచార్య’ పై మెగాస్టార్ చిరంజీవికి అనుమానం..!?

పుర పోరు : ఆ విషయంలో విశాఖే నంబర్ వన్...!

పుర పోరు : విశాఖలోనే వీక్....షాకే మరి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>