PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections908b0fc5-f493-413c-9be7-832f0d577fb9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections908b0fc5-f493-413c-9be7-832f0d577fb9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషన్ కాస్త సీరియస్ గానే దృష్టి సారించింది. తాజాగా ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాల అధికారులు.. రాజకీయ పార్టీలతో సమావేశమయ్యాం అని ఆయన వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి వివక్ష లేకుండా చేపడతాం అని ఆయన అన్నారు. అందరూ సహకరించడం వల్లనే పంచాయతీ ఎన్నికల నిర్వహణ సజావుగా సాగింది అని తెలిపారు. మున్సిపల్ ఓటర్లు చైతన్యం కలిగిన వాళ్లూ.. పంచాయతీ ఎన్నికలకంటే ఎక్కnimmagadda;kumaar;naga chaitanya;andhra pradesh;media;panchayati;local language;chaitanya 1;criminalఇవి ఫాలో కావాల్సిందే... నిమ్మగడ్డ ఆదేశాలుఇవి ఫాలో కావాల్సిందే... నిమ్మగడ్డ ఆదేశాలుnimmagadda;kumaar;naga chaitanya;andhra pradesh;media;panchayati;local language;chaitanya 1;criminalMon, 01 Mar 2021 07:44:01 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషన్ కాస్త సీరియస్ గానే దృష్టి సారించింది. తాజాగా ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాల అధికారులు.. రాజకీయ పార్టీలతో సమావేశమయ్యాం అని ఆయన వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి వివక్ష లేకుండా చేపడతాం అని ఆయన అన్నారు. అందరూ సహకరించడం వల్లనే పంచాయతీ ఎన్నికల నిర్వహణ సజావుగా సాగింది అని తెలిపారు.

మున్సిపల్ ఓటర్లు చైతన్యం కలిగిన వాళ్లూ.. పంచాయతీ ఎన్నికలకంటే ఎక్కువ స్థాయిలో పాల్గొనాలని సూచనలు చేసారు. ప్రతి ఓటరుకు ప్రభుత్వ సిబ్బంది ద్వారానే ఓటర్ స్లిప్పుల పంపిణీకి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వచ్చే నెల ఐదో తేదీలోగా ప్రభుత్వ యంత్రాంగమే ఓటర్ల స్లిప్పుల పంపిణీ చేపట్టాలని ఆదేశం ఇచ్చామని ఆయన తెలిపారు. వలంటీర్లను ఎన్నికల విధుల్లో నిషేధించాం అని అన్నారు. ఎన్నికల విధుల్లో కానీ.. ఎన్నికల్లో కానీ వలంటీర్లు జోక్యం చేసుకుంటే వారిపై క్రిమినల్ చర్యలు నమోదు చేస్తాం అని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ విధుల్లో.. ప్రభుత్వం అప్పగించిన పనిని వలంటీర్లు చేపట్టొచ్చు అని పేర్కొన్నారు. ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో ఐదుగురుకు మించి పాల్గొనకూడదు అని స్పష్టం చేసారు. రోడ్ షోలకు అనుమతిస్తాం అని, డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసామని చెప్పారు. నామినేషన్లు గందరగోళంపై త్వరలోనే వివరాలు అందుతాయి అని ఆయన అన్నారు. బలవంతపు నామినేషన్ల విషయంలో అభ్యర్ధిత్వాల పునరుద్దరణపై బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పరిగణనలోకి తీసుకుంటాం అని ఆయన వివరించారు. పరిమితులకు లోబడి న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం అని వివరించారు. త్వరలోనే నామినేషన్ల పునరుద్దరణపై నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు. నామినేషన్లు వేయలేకపోయిన వారికి..  స్క్రూట్నీలో పోయిన వారికి తిరిగి నామినేషన్లు వేసుకునే అవకాశం ఇవ్వడం సాధ్యం కాదు అని స్పష్టం చేసారు.


యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాయిపల్లవి సారంగ దరియా సాంగ్..?

తెలంగాణలో రాజ‌కీయంపై ప‌వ‌న్‌ స్ట్రాట‌జీ అదేన‌ట‌... ఇక దూకుడేన‌ట‌..

ప‌వ‌న్‌ను గెలిపిస్తే.. బీసీ కాలంలోకే... సెటైర్లు పేలుతున్నాయ్ ?

పుర‌పోరు: `బంద‌రు` ల‌డ్డు కోసం.. టీడీపీ-జ‌న‌సేన తెర‌చాటు ఒప్పందం..!

విజ‌య‌వాడ వైసీపీకి బిగ్ షాక్‌... కీల‌క నేత గుడ్ బై

నోరు జారిన బండి సంజయ్.. ఛాన్స్ దొరికిందని కుమ్మేశారుగా..?

ప‌శ్చిమ బెంగాల్లో మమ‌త‌, త‌మిళ‌నాడులో స్టాలిన్‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>