MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithin5bbb3730-d2ba-44c2-bfcc-29b8eb36769d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithin5bbb3730-d2ba-44c2-bfcc-29b8eb36769d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో కన్సెస్టెన్సీ లేని హీరోలలో నితిన్ ముందు వరసలో ఉంటాడు. ఈ హీరోకు ఒక హిట్ వస్తే వెంటనీ వరస పరాజయాలు వెంటాడుతూ ఉంటాయి. దీనితో మంచి టాలెంట్ ఉన్నప్పటికీ ఇప్పటికి కూడ నితిన్ టాప్ యంగ్ హీరోల రేంజ్ కి వెళ్ళలేకపోతున్నాడు అన్న అభిప్రాయలు చాలామంది వ్యక్త పరుస్తూ ఉంటారు. ఈ యంగ్ హీరో కెరియర్ ప్రారంభంలో వరసగా మూడు హిట్లు కొట్టాడు. అంతే ఆతరువాత ఒక దశాబ్దం పాటు హిట్ అనే పదాన్ని మరిచిపోయి వరసగా 10 ఫైయిల్యూర్స్ చూసాడు. ఇలాంటి పరిస్థితి మరో హీరోకి ఎదురై ఉంటే ఇండస్ట్రీ ఎప్పుడో అతడిని పట్టించnithin;nithin;suresh;editor mohan;keerthi suresh;kirti;trivikram srinivas;tollywood;cinema;industry;gunde jaari gallanthayyinde;cheque;hero;nithin reddy;father;lie;gunde jari gallanthayindeఅంతర్మధనంలో నితిన్ !అంతర్మధనంలో నితిన్ !nithin;nithin;suresh;editor mohan;keerthi suresh;kirti;trivikram srinivas;tollywood;cinema;industry;gunde jaari gallanthayyinde;cheque;hero;nithin reddy;father;lie;gunde jari gallanthayindeMon, 01 Mar 2021 16:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో కన్సెస్టెన్సీ లేని హీరోలలో నితిన్ ముందు వరసలో ఉంటాడు. ఈ హీరోకు ఒక హిట్ వస్తే వెంటనీ వరస పరాజయాలు వెంటాడుతూ ఉంటాయి. దీనితో మంచి టాలెంట్ ఉన్నప్పటికీ ఇప్పటికి కూడ నితిన్ టాప్ యంగ్ హీరోల రేంజ్ కి వెళ్ళలేకపోతున్నాడు అన్న అభిప్రాయలు చాలామంది వ్యక్త పరుస్తూ ఉంటారు.  


ఈ యంగ్ హీరో కెరియర్ ప్రారంభంలో వరసగా మూడు హిట్లు కొట్టాడు. అంతే ఆతరువాత ఒక దశాబ్దం పాటు హిట్ అనే పదాన్ని మరిచిపోయి వరసగా 10 ఫైయిల్యూర్స్ చూసాడు. ఇలాంటి పరిస్థితి మరో హీరోకి ఎదురై ఉంటే ఇండస్ట్రీ ఎప్పుడో అతడిని పట్టించుకోవడం మానేసి ఉండేది.


అయితే నితిన్ తండ్రి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కావడంతో అతడికి ఇండస్ట్రీలో మంచి సపోర్ట్ లభించింది. చాల కాలం తరువాత ‘ఇష్క్’ సినిమాతో మళ్లీ ట్రాక్‌లో పడి వెంటనే ‘గుండెజారి గల్లంతయ్యిందే’ రూపంలో మరో సూపర్ హిట్ అందుకున్నాడు అంతే మళ్ళీ వరస పరాజయాలు మొదలయ్యాయి. ఆతరువాత త్రివిక్రమ్ సహకారంతో ‘అఆ’ తో హిట్ కొట్టినా ఆతరువాత వరసగా వచ్చిన ‘లై’ ‘ఛల్ మోహన్ రంగ’ ‘శ్రీనివాస కళ్యాణం’ ఘోరమైన ఫ్లాప్ లుగా మారాయి.


క్రితం సంవత్సరం ఏడాది ‘భీష్మ’ తో మళ్ళీ హిట్ కొట్టాడు అనుకుంటే లేటెస్ట్ గా విడుదలైన ‘చెక్’ ఘోరమైన ఫ్లాప్ గా మారింది. దీనితో నితిన్ కు సరైన కథలు ఎంచుకోవడం తెలియదా లేకుంటే దురదృష్టం అతడిని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుందా అంటూ కొందరు కెరియర్ పై సానుభూతి చూపెడుతున్నారు. ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య పోటీ చాల తీవ్రంగా ఉంది. ఒక్క ఫెయిల్యూర్ వస్తే చాలు యా హీరోను వెంటనే లిస్టులోంచి తీసివేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ నెల చివరి వారంలో విడుదల కాబోతున్న ‘రంగ్ దె’ మూవీ నితిన్ కెరియర్ అత్యంత కీలకంగా మారనున్నది. అయితే ఈమధ్య కీర్తి సురేష్ నటిస్తున్న సినిమాలు అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ నెగిటివ్ సెంటిమెంట్ నితిన్ అభిమానులను భయపెడుతోంది..




ఆ షోతో రష్మీ, అనసూయకి చెమటలు పట్టిస్తున్న వర్షిణి....

17 రోజుల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టి ప్రభాస్ సినిమానే దాటేసిన ఉప్పెన....

పురపోరు : తాడిపత్రిలో ఆ విషయంలో సక్సెస్ అయిన పెద్దారెడ్డి !

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో షణ్ముక్ జశ్వంత్ చెప్పిన ఆ ఒక్క మాటతో..పోలీసులు ఏం చేశారో తెలుసా..??

పురపోరు : రాయదుర్గంలో బట్టబయలు అయిన వైసీపీ కుట్ర ?

ఆ హీరోలకు కలిసి రాని సెంటిమెంట్ వెంకీ కి కలిసి వస్తుందా..??

పుర పోరు : విశాఖ టీడీపీ మేయర్... బిగ్ ట్విస్ట్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>