PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/another-peak-of-fame-in-modis-account-that-is7c6f85b7-06bb-4c92-920c-89dcb320f1ab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/another-peak-of-fame-in-modis-account-that-is7c6f85b7-06bb-4c92-920c-89dcb320f1ab-415x250-IndiaHerald.jpgప్రధాని నరేంద్ర మోదీ రెండోవిడ‌త కరోనా టీకా పంపిణీలో వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా ఈ రోజు నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగి, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకా ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని మోదీ తొలి డోసు టీకాను తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. ఎయిమ్స్‌లో కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నాను. ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోmodhi;amala akkineni;telangana;narendra modi;prime minister;director;doctor;qualification;central government;narendraకోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్ర‌ధాని.. అయితే ఏం జ‌రిగిదంటే...కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్ర‌ధాని.. అయితే ఏం జ‌రిగిదంటే...modhi;amala akkineni;telangana;narendra modi;prime minister;director;doctor;qualification;central government;narendraMon, 01 Mar 2021 08:20:12 GMTప్రధాని నరేంద్ర మోదీ రెండోవిడ‌త  కరోనా టీకా పంపిణీలో వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా  ఈ రోజు నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగి, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకా ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని మోదీ తొలి డోసు టీకాను తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. ఎయిమ్స్‌లో కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నాను. ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి మన వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషి చెప్పుకోదగినది.


టీకా తీసుకోవడానికి అర్హత ఉన్నవారందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మనమంతా కలిసి కరోనా రహిత దేశాన్ని నిర్మిద్దాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఎలాంటి అపోహలు లేకుండా ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, కరోనా వ్యాక్సిన్ పట్ల అపోహలు, అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని వ్యాక్సిన్ వేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఇదిలా ఉండ‌గా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, 60 ఏళ్ల వృద్ధులకు టీకాల పంపిణీ దేశ వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగానే లభించనుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం సర్వీసు చార్జి రూ.100తో కలిపి రూ.250లకే లభించనుంది.


తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 48 ప్రభుత్వ ఆసుపత్రుల్లో, 45 ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ కేంద్రాలను నెలకొల్పినట్లు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. దేశంలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్య ఆరోగ్య‌శాఖ చెబుతోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసే దిశగా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కుధరించడం, ఫిజికల్ డిస్టెన్స్‌ వంటి కొవిడ్‌ నియంత్రణ రూల్స్‌ను పక్కాగా అమలు చేయాలని సూచించింది. ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నిర్లక్ష్యానికి ఏమాత్రం తావివ్వకూడదని హితవు పలికింది.


యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాయిపల్లవి సారంగ దరియా సాంగ్..?

తెలంగాణలో రాజ‌కీయంపై ప‌వ‌న్‌ స్ట్రాట‌జీ అదేన‌ట‌... ఇక దూకుడేన‌ట‌..

ప‌వ‌న్‌ను గెలిపిస్తే.. బీసీ కాలంలోకే... సెటైర్లు పేలుతున్నాయ్ ?

పుర‌పోరు: `బంద‌రు` ల‌డ్డు కోసం.. టీడీపీ-జ‌న‌సేన తెర‌చాటు ఒప్పందం..!

విజ‌య‌వాడ వైసీపీకి బిగ్ షాక్‌... కీల‌క నేత గుడ్ బై

నోరు జారిన బండి సంజయ్.. ఛాన్స్ దొరికిందని కుమ్మేశారుగా..?

ప‌శ్చిమ బెంగాల్లో మమ‌త‌, త‌మిళ‌నాడులో స్టాలిన్‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>