PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-pak57a8128a-2646-47e5-893b-f13ae0a81872-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-pak57a8128a-2646-47e5-893b-f13ae0a81872-415x250-IndiaHerald.jpgసర్జికల్స్ స్ట్రైక్స్.. పుల్వామా దాడికి భారత్ తీర్చుకున్న ప్రతీకారం ఇది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం.. పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోకి చొచ్చుకొని వెళ్లి.. అక్కడి ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేపట్టి 300 మందికిపైగా ఉగ్రవాదులను ఏరివేసింది. ఎయిర్ ఫోర్స్ దాడుల చేపట్టిన విషయం తెలియగానే ప్రతి భారతీయుడి గుండె ఆనందంతో ఉప్పొంగింది. ప్రపంచ దేశాలు కూడా భారత్‌కు బాసగా నిలిచాయి. india-pak;india;pakistan;2019;february;heart;army;jaish e mohammed;anandamపాక్‌పై మళ్లీ సర్జికల్‌ స్ట్రైక్స్‌కు ఇండియా రెడీ.. ఇదిగో సాక్ష్యం..!?పాక్‌పై మళ్లీ సర్జికల్‌ స్ట్రైక్స్‌కు ఇండియా రెడీ.. ఇదిగో సాక్ష్యం..!?india-pak;india;pakistan;2019;february;heart;army;jaish e mohammed;anandamSun, 28 Feb 2021 13:00:00 GMTభారత్ తీర్చుకున్న ప్రతీకారం ఇది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం.. పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోకి చొచ్చుకొని వెళ్లి.. అక్కడి ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో  పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేపట్టి 300 మందికిపైగా ఉగ్రవాదులను ఏరివేసింది. ఎయిర్ ఫోర్స్ దాడుల చేపట్టిన విషయం తెలియగానే ప్రతి భారతీయుడి గుండె ఆనందంతో ఉప్పొంగింది. ప్రపంచ దేశాలు కూడా భారత్‌కు బాసగా నిలిచాయి.

అయితే.. ఇప్పుడు ఇండియా మరోసారి పాక్‌ పై సర్జికల్ స్ట్రయిక్స్ కోసం రెడీ అవుతోందా.. అంటే అవునేమో అనిపిస్తోంది. ఎందుకంటే.. బాలాకోట్‌ వైమానిక దాడికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భారత వాయుసేన ఘనంగా వేడుకలను నిర్వహించింది. నాటి దాడుల్లో పాల్గొన్న స్క్వాడ్రన్‌.. థార్‌ ఎడారిలో స్పైస్‌ 2000 బాంబులతో ఒక సాధన లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో  ఛేదించింది.  బాలాకోట్‌ దాడి వేడుకల్లో శనివారం భారత వాయుసేన అధిపతి భధౌరియా ఆధునికీకరించిన మిరేజ్‌-2000ని నడిపారు.

ఈ సందర్భంగా సర్జకల్ స్ట్రయిక్స్ గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు ఘాటైన సమాధానం ఇవ్వడం కోసం భారత్ చేసిన ఖర్చు కేవలం రూ.1.68 కోట్ల నుంచి రూ.2.2 కోట్లు మాత్రమే. బాలాకోట్, ముజఫరాబాద్, చకోటి ప్రాంతాల్లో ఉగ్రస్థావరాలపై 1000 కిలోల బాంబులను ఐఏఎఫ్ జారవిడించింది. ఒక్కో బాంబు ధర సుమారు రూ.56 లక్షలు. ఈ దాడి కోసం భారత్ రూ.3686 కోట్ల విలువ చేసే 12 మిరాజ్ 2000 విమానాలు, 3 సుఖోయ్ సు-30 ఎయిర్‌క్రాఫ్ట్‌లను వాడింది.

మిరాజ్ విమానాలు పాక్ గగతనంలోకి వెళ్లగా... సుఖోయ్ విమానాలు భారత గగనతలంలోనే ఎగురుతూ వాటికి బ్యాకప్‌గా ఉన్నాయి. పాక్ తిరిగి దాడి చేస్తే రంగంలోకి దిగే ఉద్దేశంతో వీటిని ఉపయోగించారు. 5 మిగ్-29 విమానాలను కూడా ఈ దాడి కోసం ఎయిర్‌ఫోర్స్ సిద్ధం చేసింది. ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఇవి పంజాబ్‌లోని అదంపూర్‌లో అప్రమత్తంగా ఉన్నాయి.


ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్న స్టార్ డైరెక్టర్.. అందుకే అవకాశాలు ఇస్తున్నారా..

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..

ఆ నలుగురు బీజేపీ నేతలు.. జగన్‌ సేవలోనే.. ఏబీఎన్‌ ఆర్కే సంచలనం..?

పుర పోరు... గుంటూరులో తెలుగుదేశం ఖాయం!

పుర పోరు: వైసీపీలో ఆ దుర‌దృష్ట‌వంతుడికి ఈ సారైనా ల‌క్ చిక్కేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>