PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rathoad-ramesh6bfa367c-b1bc-428d-9608-fb09133a943a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rathoad-ramesh6bfa367c-b1bc-428d-9608-fb09133a943a-415x250-IndiaHerald.jpgఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో సీనియ‌ర్ రాజ‌కీయ నాయకుడిగా ఉన్న రాథోడ్ ర‌మేష్ పొలిటిక‌ల్ కెరీర్‌లో గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నార‌నే చెప్పాలి. ఆయ‌న ఎదిగిదంతా కూడా టీడీపీలోనే ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లోకి మారారు.. అయినా అక్క‌డ పొస‌గ‌లేక‌పోతున్నార‌న్న‌ది జిల్లా రాజ‌కీయ నేత‌ల నుంచి వినిపిస్తున్న టాక్‌. అయితే రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకోవాలంటే మ‌ళ్లీ పార్టీ మార‌క త‌ప్ప‌ద‌ని ఆయ‌న స‌న్నిహితులు ఇచ్చిన స‌ల‌హాతో బీజేపీకి ద‌గ్గ‌రైన‌ట్లుగా తెలుస్తోంది. అయితే ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయా..? జ‌రుగుతున్నాయా..? అనrathoad ramesh;telangana;congress;mp;district;telugu;tpcc;tdp;adilabad;partyఆదిలాబాద్ కాంగ్రెస్‌లో పొగ‌... రాథోడ్ ర‌మేష్ స‌స్పెన్ష‌న్‌తో వేడి..ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో పొగ‌... రాథోడ్ ర‌మేష్ స‌స్పెన్ష‌న్‌తో వేడి..rathoad ramesh;telangana;congress;mp;district;telugu;tpcc;tdp;adilabad;partySun, 28 Feb 2021 09:00:00 GMTఆదిలాబాద్ జిల్లాలో సీనియ‌ర్ రాజ‌కీయ నాయకుడిగా ఉన్న రాథోడ్ ర‌మేష్ పొలిటిక‌ల్ కెరీర్‌లో గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నార‌నే చెప్పాలి. ఆయ‌న ఎదిగిదంతా కూడా టీడీపీలోనే ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లోకి మారారు.. అయినా అక్క‌డ పొస‌గ‌లేక‌పోతున్నార‌న్న‌ది జిల్లా రాజ‌కీయ నేత‌ల నుంచి వినిపిస్తున్న టాక్‌. అయితే రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకోవాలంటే మ‌ళ్లీ పార్టీ మార‌క త‌ప్ప‌ద‌ని ఆయ‌న స‌న్నిహితులు ఇచ్చిన స‌ల‌హాతో బీజేపీకి ద‌గ్గ‌రైన‌ట్లుగా తెలుస్తోంది. అయితే ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయా..? జ‌రుగుతున్నాయా..? అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త లేదు. అయితే రాథోడ్ ర‌మేష్ బీజేపీలోకి వెళ్ల‌డానికి కూడా కొన్ని సామాజిక స‌మీక‌ర‌ణాలు అడ్డుప‌డుతున్న‌ట్లుగా కూడా చ‌ర్చ చాలాకాలంగా జ‌రుగుతోంది.


అయితే బీజేపీలో చేరుతున్న‌ట్లుగా వ‌స్తున్న వార్త‌ల‌పై ఆయ‌న అడ‌పాద‌డ‌పా స్పందించారు. అయితే ఇటీవ‌ల ఆయ‌న తీరు పార్టీ విధానాల‌కు వ్య‌తిరేకంగా ఉంద‌ని బ‌లంగా న‌మ్మిన కాంగ్రెస్ అధిష్ఠానం పెద్ద‌లు ఏకంగా స‌స్పెన్ష‌న్ ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నం రేపింద‌నే చెప్పాలి. రమేష్‌ రాథోడ్‌ను కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ చైర్మన్‌ కోదండరెడ్డి ప్రకటించారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా జిల్లా నాయకుల ఫిర్యాదులను పరిశీలించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే ఆయన త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లుగా వార్తలూ వచ్చాయి. దీంతో రాథోడ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆయనను సస్పెండ్ చేస్తున్నామని టీపీసీసీ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ కోదండరెడ్డి ప్రకటించారు.


ఇదిలా ఉండ‌గా అసలు తాను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే తీసుకోలేదని.. సభ్యత్వం ఇస్తే నబరు చెప్పాలని రమేశ్ సవాల్ విస‌ర‌డం గ‌మ‌నార్హం.  పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని జిల్లా నాయకుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం రమేష్‌ రాథోడ్‌ను సస్పెన్షన్‌ చేసినట్లు కోదండరెడ్డి ప్రకటించారు. ఈ విషయమై రాథోడ్‌ రమేష్‌ను వివరణ కోరగా.. తనను సస్పెండ్‌ చేసే అధికారం ఎవరికి లేదన్నారు. అసలు తనకు కాంగ్రెస్‌లో సభ్యత్వమే లేదని తెలిపారు. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోవడం ఖాయమని ప్రకటించారు.తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న రమేష్ రాథోడ్.. తెలంగాణ ఏర్పడిన సమయంలో ఆదిలాబాదు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆ ఎంపీగా ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 జరిగిన ఎన్నికలలో టీడీపీ టికెట్‌పై ఆదిలాబాదు ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.


ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో ఎంట్రీ సక్సెస్ అవ్వని హీరోలు వీళ్ళే..!?

వడ్డికాసులవాడికి ఆర్థిక కష్టాలు.. ఎందుకంటే..?

మోడీకి భయపడటానికి నేను జగన్‌ను.. చంద్రబాబును కాను..?

పురపోరు: పలాస-కాశీబుగ్గలో టీడీపీకి అదిరేలా జలక్ ఇచ్చిన అప్పలరాజు..!

హనుమతత్త్వం నమ్మి ఆచరించిన వారికి సర్వం శుభమే! నీలుని కథే ఒక రుజువు

లోకేష్ కోసం కుప్పం రెడీ.. పోటీ ఎప్పుడంటే..?

నిజ్జంగా నిజం.. గాడిద బిర్యానీ.. ఇప్పుడు ఇదే ఆంధ్రాలో ఇదే ఫేమస్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>