MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-movie-with-gopichand-malineni-will-be-bigger-than-krackdd822bfd-21be-464f-8da8-734cf59d4840-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-movie-with-gopichand-malineni-will-be-bigger-than-krackdd822bfd-21be-464f-8da8-734cf59d4840-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా బిబి3. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమా యొక్క అఫీషియల్ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోయే మహాశివరాత్రి పండుగ రోజున రిలీజ్ కానున్నట్లు టాక్. బాలయ్య అఘోరాగా అలానే మధ్యతరగతి రైతుగా రెండు రకాల రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాని పక్కాగా మాస్ అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నట్లు టాక్.balayya;gopichand malineni;balakrishna;gopichand;boyapati srinu;tollywood;cinema;festival;audience;traffic police;success;posters;mythri movie makers;nandamuri taraka rama rao;massబాలయ్య అలా చేస్తే సూపర్ హిట్టే .. అందుకే అలా సెట్ చేస్తున్నట్లున్నాడు ....??బాలయ్య అలా చేస్తే సూపర్ హిట్టే .. అందుకే అలా సెట్ చేస్తున్నట్లున్నాడు ....??balayya;gopichand malineni;balakrishna;gopichand;boyapati srinu;tollywood;cinema;festival;audience;traffic police;success;posters;mythri movie makers;nandamuri taraka rama rao;massSun, 28 Feb 2021 23:08:52 GMT
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా బిబి3. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమా యొక్క అఫీషియల్ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోయే మహాశివరాత్రి పండుగ రోజున రిలీజ్ కానున్నట్లు టాక్. బాలయ్య అఘోరాగా అలానే మధ్యతరగతి రైతుగా రెండు రకాల రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాని పక్కాగా మాస్ అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నట్లు టాక్.

ఇటీవల వరుసగా కెరీర్ పరంగా పరాజయాలతో సతమతం అవుతున్న బాలయ్య, ఈ మూవీ తో పక్కాగా సక్సెస్ కొట్టి మళ్ళి మంచి ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు. మరోవైపు ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కి నందమూరి ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ నుండి బాగా రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమా ఈ ఏడాది మే 28న రిలీజ్ కానుంది. ఇక దీని తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ మూవీ యొక్క కథని బాలయ్య కు వినిపించి ఆయన ఆమోదం అందుకున్న గోపీచంద్, ప్రస్తుతం దాని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో నిమగ్నం అయి ఉన్నట్లు టాక్. 

మంచి యక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎంతో భారీగా నిర్మించనుంది. కాగా ఈ సినిమాలో కూడా బాలయ్య రెండు రోల్స్ చేయనున్నారని, అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర అని సమాచారం. వాస్తవానికి గతంలో బాలయ్య నటించిన డ్యూయల్ రోల్ మూవీస్ ఎక్కువగా మంచి సక్సెస్ రేట్ సాధించి ఉండడంతో గోపీచంద్ కూడా ఈ విధంగా ఆయనతో డబుల్ రోల్ మూవీ ప్లాన్ చేసారని అంటున్నారు. మరి తొలిసారిగా బాలయ్య, గోపీచంద్ మలినేని ల కలయికలో తెరకెక్కనున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి....!!



వాడుకోండయ్యా .... వాడుకున్నోళ్ళకు వాడుకున్నంత ....??

వేసింది కోటే.. కాని ఆ చూపులు మాత్రం...!

2022 సంక్రాంతికే పవర్ స్టార్.. అసలు సిసలు బాక్సాఫీస్ ఫైట్..!

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సాయి పల్లవి కొత్త పాట.. ట్రెండింగ్ లో నెంబర్ 1..!

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>