PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/velagapoodi3cdf5927-c1fc-4b52-8a28-69c050507676-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/velagapoodi3cdf5927-c1fc-4b52-8a28-69c050507676-415x250-IndiaHerald.jpgకాదేదీ రాజకీయానికి అతీతం అని అంటారు. వీలు దొరకాలే కానీ దేన్ని అయినా వాడుకే నైపుణ్యం రాజకీయ జీవులకు ఉంది. ఓట్ల కోసం కోటి మార్గాలు పట్టే రాజకీయ నాయకులు ఆదిత్య 369ల్ టైమ్ మిషన్ ద్వారా చనిపోయిన వారిని కూడా ఇలకు తీసురాగలరు. విశాఖ ఎన్నికల వేళ ఎన్నో చిత్రాలు జరుగుతున్నాయి. వాటిలో చాలా చోద్యాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. velagapoodi;koti;view;adhithya;mp;east;vishakapatnam;murder.;tdp;ycp;vangaveeti;velagapudiపుర పోరు : విశాఖ మేయర్ ఎన్నికల్లో వంగవీటి రంగా ?పుర పోరు : విశాఖ మేయర్ ఎన్నికల్లో వంగవీటి రంగా ?velagapoodi;koti;view;adhithya;mp;east;vishakapatnam;murder.;tdp;ycp;vangaveeti;velagapudiSun, 28 Feb 2021 16:14:53 GMTకోటి మార్గాలు పట్టే రాజకీయ నాయకులు ఆదిత్య 369ల్ టైమ్ మిషన్ ద్వారా చనిపోయిన వారిని కూడా ఇలకు తీసురాగలరు. విశాఖ ఎన్నికల వేళ ఎన్నో చిత్రాలు జరుగుతున్నాయి. వాటిలో చాలా చోద్యాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

విశాఖ తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా వెలగపూడి రామక్రిష్ణ బాబు ఉన్నారు. ఆయన ముచ్చటగా మూడుసార్లు గెలిచి ఎదురులేదు అనిపించుకున్నారు. ఇదిలా ఉంటే వెలగపూడి మీద చాన్నాళ్ళుగా వైసీపీ తన పదునైన బాణాలను ఎక్కుపెట్టి మరీ రాజకీయ యుద్ధమే చేస్తోంది. వెల‌గపూడి తూర్పు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే మరో మారు ఆయన మీద ఘాటైన కామెంట్స్ చేశారు. వెలగపూడిని ఏకంగా కబ్జాకోర్ అని కూడా నిందించారు. వెలగపూడి అవినీతి అక్రమాల చిట్టాను తొందరలో బయటపెడతామని ఆయన అంటున్నారు. అంతే కాదు వెలగపూడి కాపు నేత, విజయవాడకు చెందిన వంగవీటి రంగా హత్య కేసులో ఆరవ నిందుతుడు అంటూ హాట్ కామెంట్స్ చేశారు.

వెలగపూడి వంటి వారు విశాఖలో  ఎమ్మెల్యేగా ఉండడం బాధాకరమని కూడా విజయసాయిరెడ్డి కామెంట్స్ చేశారు. వెలగపూడి నియోజకవర్గం తూర్పులో ఏ మార్పూ లేదని, అభివృద్ధి అంతకంటే లేదని కూడా విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. వెలగపూడిని ఓడించాలంటే ముందు టీడీపీ కార్పోరేటర్లను  ఓడించాలని ఆయన జనాలకు పిలుపు ఇచ్చారు. ఇదిలా ఉంటే వంగవీటి రంగా విషయాన్ని వ్యూహాత్మకంగా విజయసాయిరెడ్డి ప్రస్థావనకు తెచ్చారని అంటున్నారు. కాపుల ఓట్లు ఇక్కడ కీలకం కావడంతో విజయసాయిరెడ్డి ఎపుడో మూడున్నర దశాబ్దాల నాటి హత్య కేసుని ఇపుడు విశాఖలో బయటపెట్టారని కూడా అంటున్నారు. మరి చూడాలి ఆ ప్రభావం ఉంటుందా లేదా అన్నది. రిజల్టే అసలు కధ చెప్పాలి.


 




నరాల వాపు తో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇది ఒక్కసారి ట్రై చేయండి...?

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..

ఆ నలుగురు బీజేపీ నేతలు.. జగన్‌ సేవలోనే.. ఏబీఎన్‌ ఆర్కే సంచలనం..?

పుర పోరు... గుంటూరులో తెలుగుదేశం ఖాయం!

పుర పోరు: వైసీపీలో ఆ దుర‌దృష్ట‌వంతుడికి ఈ సారైనా ల‌క్ చిక్కేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>