MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/disha-patani-to-act-with-bellamkonda-srinivascb846221-744f-4e6d-b980-7e90eb80928b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/disha-patani-to-act-with-bellamkonda-srinivascb846221-744f-4e6d-b980-7e90eb80928b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఛత్రపతి సినిమాతో శ్రీనివాస్ బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. తెలుగులో ఛత్రపతి సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించగా..ప్రభాస్ హీరోగా నటించాడు. సినిమాలో ప్రభాస్ కు హీరోయిన్ గా శ్రీయ నటించింది. అయితే అప్పట్లో బాలీవుడ్ లో రాజమౌళి క్రేజ్ లేకపోవడం వల్ల ఛత్రపతి సినిమాను హిందిలో విడుదల చేయలేదు. ఇక ప్రస్తుతం జక్కన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లోనూ ఆయdisha patani;prabhas;ananya pandey;shraddha kapoor;shriya;ananya;bellamkonda sai sreenivas;rajamouli;srinivas;varun;varun sandesh;varun tej;bollywood;tollywood;cinema;telugu;industry;blockbuster hit;remake;jaggery;hero;heroine;chatrapathi;march;ananya nagallaబాలీవుడ్ లో బెల్లంకొండకి హీరోయిన్ దొరికేసింది..ఎవరంటే..?బాలీవుడ్ లో బెల్లంకొండకి హీరోయిన్ దొరికేసింది..ఎవరంటే..?disha patani;prabhas;ananya pandey;shraddha kapoor;shriya;ananya;bellamkonda sai sreenivas;rajamouli;srinivas;varun;varun sandesh;varun tej;bollywood;tollywood;cinema;telugu;industry;blockbuster hit;remake;jaggery;hero;heroine;chatrapathi;march;ananya nagallaSun, 28 Feb 2021 18:30:00 GMTటాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఛత్రపతి సినిమాతో శ్రీనివాస్ బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. తెలుగులో ఛత్రపతి సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించగా..ప్రభాస్ హీరోగా నటించాడు. సినిమాలో ప్రభాస్ కు హీరోయిన్ గా శ్రీయ నటించింది. అయితే అప్పట్లో బాలీవుడ్ లో రాజమౌళి క్రేజ్ లేకపోవడం వల్ల ఛత్రపతి సినిమాను హిందిలో విడుదల చేయలేదు. ఇక ప్రస్తుతం జక్కన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లోనూ ఆయనకు ఫ్యాన్స్ బేస్ ఉంది. దాంతో బెల్లంకొండ జక్కన సినిమా ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇక ఈ సినిమాకు బాలీవుడ్ లోనూ తెలుగు దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. సినిమాను పెన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించనున్నాడు.

ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం బాలీవుడ్ లో పలువురు హీరోయిన్ లను సంప్రదించగా వాళ్ళు నో చెప్పినట్టు గుసగుసలు వినిపించాయి. శ్రద్ధ కపూర్, అనన్య పాండే, కైరా అద్వానీ లు బెల్లం కొండకు నో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు లో నటించేందుకు క్రేజీ హీరొయిన్ దిశ పాఠాని ఒకే చెప్పినట్టు సమాచారం. దిశ పఠాని వరుణ్ తేజ్ హీరోగా...పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన లోఫర్ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. కానీ ఆ తర్వాత టాలీవుడ్ లో ఈ భామకు ఆఫర్లు దక్కలేదు. దాంతో బాలీవుడ్ కు మాకాం మార్చి అక్కడ క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా దిశా పఠాని ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో అంశం తో వార్తల్లో నిలుస్తోంది. ఇక బెల్లంకొండ సినిమాకు ఒకే చెప్పడంతో దిశా క్రేజ్ కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.


యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సాయి పల్లవి కొత్త పాట.. ట్రెండింగ్ లో నెంబర్ 1..!

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..

ఆ నలుగురు బీజేపీ నేతలు.. జగన్‌ సేవలోనే.. ఏబీఎన్‌ ఆర్కే సంచలనం..?

పుర పోరు... గుంటూరులో తెలుగుదేశం ఖాయం!

పుర పోరు: వైసీపీలో ఆ దుర‌దృష్ట‌వంతుడికి ఈ సారైనా ల‌క్ చిక్కేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>