PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kuppam67dcbf81-4327-4fd4-832b-7c94dcfcd587-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kuppam67dcbf81-4327-4fd4-832b-7c94dcfcd587-415x250-IndiaHerald.jpgఇపుడు అనూహ్యంగా బాబు గారి థర్టీ ఇయర్స్ అసెంబ్లీ సీటు కుప్పం ఏపీ రాజకీయ తెర మీదకు వచ్చేసింది. చంద్రబాబు నాయుడిని ఇంతటి నాయకుడిగా చేసిన సీటు కుప్పం. ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా, మరో మూడు సార్లు విపక్ష నేతగా తన హవా చలాయించారు అంటే అదంతా కుప్పం ప్రజల మహిమే. వారు ఓట్లేసి తమ ఎమ్మెల్యేగా బాబుని పంపిస్తే చంద్రబాబు రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ చక్రం తిప్పారు. kuppam;cbn;jagan;andhra pradesh;telugu;kuppam;panchayati;assembly;tdp;local language;ycpకుప్పం కధకు బిగ్ ట్విస్ట్ అదేనా...?కుప్పం కధకు బిగ్ ట్విస్ట్ అదేనా...?kuppam;cbn;jagan;andhra pradesh;telugu;kuppam;panchayati;assembly;tdp;local language;ycpSun, 28 Feb 2021 16:56:41 GMTఅసెంబ్లీ సీటు కుప్పం ఏపీ రాజకీయ తెర మీదకు వచ్చేసింది. చంద్రబాబు నాయుడిని ఇంతటి నాయకుడిగా చేసిన సీటు కుప్పం. ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా, మరో మూడు సార్లు విపక్ష నేతగా తన హవా చలాయించారు అంటే అదంతా కుప్పం ప్రజల మహిమే. వారు ఓట్లేసి తమ ఎమ్మెల్యేగా బాబుని పంపిస్తే చంద్రబాబు రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ చక్రం తిప్పారు.

ఇపుడు ఆ కుప్పానికి కష్టాలు వచ్చేసాయి.  తెలుగు దేశానికి రాజకీయ నష్టాలు అదే తీరున  జరిగిపోతున్నాయి.  ఏపీలో ఎక్కడో ఏదో సీటులో టీడీపీ వెనకబడింది అంటే దాన్ని సరిచేసుకోవాల్సిన చంద్రబాబుకు సొంత బాధలు ఇపుడు ఎక్కువ అయ్యాయి. మొత్తానికి పంచాయతీ ఎన్నికలు కాదు కానీ కుప్పంలో టీడీపీ, చంద్రబాబు ఇద్దరినీ ట్రబుల్స్ లోకి నెట్టేశాయి.

కుప్పంలో మూడు రోజులు టూర్ వేసి వచ్చినా కూడా చంద్రబాబుకు కుప్పం గుబులు మామూలుగా ఉండదు అంటున్నారు. కుప్పంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. దాని కంటే ముందు మునిసిపల్ పోరు కూడా సిద్ధంగా ఉంది. ఇవన్నీ చూసుకుంటే మాత్రం కుప్పంలో ఏం జరగబోతోంది అన్న టెన్షన్ అయితే అందరిలో ఉంది. కుప్పాన్ని మునిసిపాలిటీగా చేసింది జగన్ సర్కార్. ఇపుడు అక్కడ ఎన్నికలు తొలిసారిగా జరగబోతున్నాయి. మరి తమ పంచాయతీకి పదోన్నతి కల్పించిన వైసీపీకి జనాలు ఓటు వేస్తారా లేక టీడీపీని నమ్మి మళ్ళీ పట్టం కడతారా అన్నది చూడాలి. మొత్తానికి స్థానిక ఎన్నికలు మూడంచెల పర్వం ముగిసేసరికి కుప్పం మీద అటు చంద్రబాబుకూ, తెలుగుదేశానికి కూడా క్లారిటీ వస్తుంది అంటున్నారు కుప్పంలో వైసీపీ హవా ఇదే తీరుగా కొనసాగితే మాత్రం 2024 నాటికి చంద్రబాబు వేరే సీటు చూసుకోవాల్సిందే అంటున్నారు. అంటే అసలైన ట్విస్ట్ అక్కడే ఉంది అన్న మాట.




కొత్త బాయ్ ఫ్రెండ్ తో చిల్ అవుతున్న శృతి..శంతనుకి థాంక్స్ చెప్పిన కమల్.!

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..

ఆ నలుగురు బీజేపీ నేతలు.. జగన్‌ సేవలోనే.. ఏబీఎన్‌ ఆర్కే సంచలనం..?

పుర పోరు... గుంటూరులో తెలుగుదేశం ఖాయం!

పుర పోరు: వైసీపీలో ఆ దుర‌దృష్ట‌వంతుడికి ఈ సారైనా ల‌క్ చిక్కేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>