PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/politics-between-parties-and-leaders91d1f063-eff8-4347-9d1e-599254e369d9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/politics-between-parties-and-leaders91d1f063-eff8-4347-9d1e-599254e369d9-415x250-IndiaHerald.jpgవాస్త‌వానికి గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు ప‌దిలంగానే ఉంది. కానీ.. ఎటొచ్చీ.. కొంత మేర‌కు త‌గ్గింది. రాష్ట్రాన్ని విభ‌జిం చార‌నే కొపం కావొచ్చు.. లేదా.. వైసీపీ దూకుడు కావొచ్చు.. వెర‌సి.. కాంగ్రెస్కు ఓటు బ్యాంకు త‌గ్గింది. ఇక‌, కార్పొరేష‌న్లు, న‌గ‌రాల్లో ప‌రిస్థితి దారుణంగా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు 5 శాతం ఓట్లు ప‌డ్డాయి. కానీ, కార్పొరేష‌న్లు, న‌గ‌ర పాల‌క సంస్థ‌ల విష‌యంలో మాత్రం కేవ‌లం 1 శాతం కూడా దాట‌లేదు. ఈ నేప‌థ్యంలో జ‌రిగిన రెండేళ్ల‌లో నూ పార్టీ andhra pradesh;andhra pradesh;congress;vishakapatnam;muni;letter;ycp;partyపుర పోరు: ఏపీలో నాయ‌కులు... జెండాలు లేని ఆ పార్టీ స‌త్తా ఎంత ?పుర పోరు: ఏపీలో నాయ‌కులు... జెండాలు లేని ఆ పార్టీ స‌త్తా ఎంత ?andhra pradesh;andhra pradesh;congress;vishakapatnam;muni;letter;ycp;partySun, 28 Feb 2021 09:31:00 GMTఏపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 4 నుంచి 6 గ్రామాల‌ను అనూహ్యంగా త‌న ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు న‌గ‌ర ముని సిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌పై దృష్టి పెట్టింది. అయితే.. వీటిలో ఏమేర‌కు ఆ పార్టీ స‌త్తా చాటుతుంది?  ఎలా ముందుకు దూసుకుపో తుంది? అనేది ఆస‌క్తిగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పుంజుకుంది.. కాబ‌ట్టి.. న‌గ‌రాల్లోనూ ఆ ఎఫెక్ట్ ఉంటుంద‌ని పార్టీ నాయ‌కులు భావిస్తున్నారు. అదేస‌మ‌యంలో ఇటు ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌.. అటు ప్ర‌తిప‌క్షంపై క‌ల‌గ‌ని విశ్వ‌స‌నీయ‌త‌.. త‌మ‌కు సానుకూలంగా మార‌తాయ‌ని అనుకుంటున్నారు. మ‌రి ఇవి నిజ‌మేనా?  క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి అనుకూలంగా మారేనా? అంటే.. క‌ష్ట‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు.

వాస్త‌వానికి గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు ప‌దిలంగానే ఉంది. కానీ.. ఎటొచ్చీ.. కొంత మేర‌కు త‌గ్గింది. రాష్ట్రాన్ని విభ‌జిం చార‌నే కొపం కావొచ్చు.. లేదా.. వైసీపీ దూకుడు కావొచ్చు.. వెర‌సి.. కాంగ్రెస్కు ఓటు బ్యాంకు త‌గ్గింది. ఇక‌, కార్పొరేష‌న్లు, న‌గ‌రాల్లో ప‌రిస్థితి దారుణంగా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు 5 శాతం ఓట్లు ప‌డ్డాయి. కానీ, కార్పొరేష‌న్లు, న‌గ‌ర పాల‌క సంస్థ‌ల విష‌యంలో మాత్రం కేవ‌లం 1 శాతం కూడా దాట‌లేదు.

ఈ నేప‌థ్యంలో జ‌రిగిన రెండేళ్ల‌లో నూ పార్టీ ఏమ‌న్నా పుంజుకుందా ? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు. శ‌క్తిమంతమైన కేడ‌ర్ ఉన్నా.. పార్టీ నాయ‌కులు ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది లేదు. కానీ, గెలుపుపై మాత్రం ఆశ‌లు కోట‌లు దాటుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నాయ‌కులు వేసుకున్న అంచ‌నాల మేర‌కు న‌గ‌ర‌మునిసిపాలిటీల్లో స‌త్తా చాటుతామ‌నే. అదే స‌మ‌యంలో విజ‌య‌వాడ‌, విశాఖ వంటి కార్పొరేష‌న్ల‌లో స‌త్తా చాటుతామ‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాల‌కు దీటుగా ఎదుగుతామ‌ని... కూడా  చెబుతున్నారు.

అయితే.. దీనికి త‌గిన క‌స‌ర‌త్తు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. కాంగ్రెస్ జెండాలు విజ‌య‌వాడ స‌హా విశాఖ‌‌లోనూ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఈ జెండాలు క‌నిపిస్తున్న చోట‌.. పార్టీ నాయ‌కులు లేరు.. నాయ‌కులు ఉన్న చోట‌.. జెండాలు క‌నిపించ‌డం లేదు.కానీ.. కాంగ్రెస్ మాత్రం ఆశ‌ల ప‌ల్ల‌కిలో ఊరేగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి అనూహ్యంగా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో స‌ర్పంచ్ స్థానాలు గెలుచుకున్న‌ట్టు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఏమైనా స‌త్తా చాటుతుందేమో చూడాలి. 


జుట్టు చిట్లిపోయి..విరిగిపోతోందా..? అయితే ఇలా చేయండి..

వడ్డికాసులవాడికి ఆర్థిక కష్టాలు.. ఎందుకంటే..?

మోడీకి భయపడటానికి నేను జగన్‌ను.. చంద్రబాబును కాను..?

పురపోరు: పలాస-కాశీబుగ్గలో టీడీపీకి అదిరేలా జలక్ ఇచ్చిన అప్పలరాజు..!

హనుమతత్త్వం నమ్మి ఆచరించిన వారికి సర్వం శుభమే! నీలుని కథే ఒక రుజువు

లోకేష్ కోసం కుప్పం రెడీ.. పోటీ ఎప్పుడంటే..?

నిజ్జంగా నిజం.. గాడిద బిర్యానీ.. ఇప్పుడు ఇదే ఆంధ్రాలో ఇదే ఫేమస్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>