MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avika-gore-learned-foreighn-language-b9030493-1985-4c58-81c2-050eef29bdf9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avika-gore-learned-foreighn-language-b9030493-1985-4c58-81c2-050eef29bdf9-415x250-IndiaHerald.jpg చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో బాగా పేరు సంపాదించిన అవికాగోర్ ఆ తర్వాత సినిమా రంగంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన పాపులారిటీ ని విపరీతంగా పెంచుకున్నారు. ప్రస్తుతం ఆమె ఒక సినిమా లో నటిస్తున్నారు. అయితే ఆ సినిమాలోని పాత్ర నిమిత్తము అవికాగోర్ కజక్ భాష నేర్చుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ మూవీ టర్కీ దేశంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. avika gor;avika gor;chalam;naga;turkey;cinema;naga aswin;marriage;heroine;kavuru srinivas;fidaaఫారిన్ భాష నేర్చుకొని అనర్గళంగా మాట్లాడుతూ ఫిదా చేస్తున్న అవికాగోర్..ఫారిన్ భాష నేర్చుకొని అనర్గళంగా మాట్లాడుతూ ఫిదా చేస్తున్న అవికాగోర్..avika gor;avika gor;chalam;naga;turkey;cinema;naga aswin;marriage;heroine;kavuru srinivas;fidaaSun, 28 Feb 2021 16:00:00 GMT
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో బాగా పేరు సంపాదించిన అవికాగోర్ ఆ తర్వాత  సినిమా రంగంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన పాపులారిటీ ని విపరీతంగా పెంచుకున్నారు. ప్రస్తుతం ఆమె ఒక సినిమా లో నటిస్తున్నారు. అయితే ఆ సినిమాలోని పాత్ర నిమిత్తము అవికాగోర్ కజక్ భాష నేర్చుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ మూవీ టర్కీ దేశంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే టర్కి లో ఉన్న అవికా గోర్ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆమె కజక్ భాషలో అనర్గళంగా మాట్లాడుతూ వావ్ అనిపించారు.

ఆ వీడియోకి.. "హాయ్ ఫ్రెండ్స్. నా పేరు అవికా గోర్. క‌జ‌క్ మూవీలో న‌టించ‌డం కోసం నేను ఇవాళ అల‌న్య‌కు వ‌చ్చాను. నుర్లాన్ కోయంబ‌యేవ్ సినిమాలో న‌టిస్తున్నా" అని ఆమె కామెంట్ పెట్టారు. అయితే అవికాగోర్ కజక్ భాషలో మాట్లాడిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇకపోతే ఇటీవలే అవికా గోర్ నిర్మాతగా కూడా మారారు. అవికా స్క్రీన్ క్రియేషన్స్ పేరిట ఆమె తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఆమె నిర్మాణంలో ఒక తెలుగు సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ సాయిరోనక్‌, అవికా గోర్‌ జంటగా మురళీ నాగ శ్రీనివాస్‌ గంధం దర్శకత్వంలో రూపొందుతోంది. అయితే కృషి క్రియేషన్స్ తో కలిసి మరొక సినిమా నిర్మించడానికి అవికాగోర్ నడుంబిగించారు. ఈ రెండు సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు చిత్రాల షూటింగ్ ప్రారంభమయింది.

ఆమె తాజాగా తన ఇన్ స్టాగ్రామ్
వేదికగా షేర్ చేసిన ఫోటో షూట్ కూడా అభిమానులను బాగా ఆకర్షిస్తోంది. ఈ ఫోటోషూట్లో ఆమె జీబ్రా కలర్ పోలిన వస్త్రధారణలో కనిపించారు. ఏది ఏమైనా చైల్డ్ ఆర్టిస్ట్ గా సీరియళ్లలో నటించిన అవికా గోర్ అంచలంచలుగా ఎదిగి ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యారు.


గంటా కోసం వాళ్ళు రంగంలోకి దిగారా...?

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..

ఆ నలుగురు బీజేపీ నేతలు.. జగన్‌ సేవలోనే.. ఏబీఎన్‌ ఆర్కే సంచలనం..?

పుర పోరు... గుంటూరులో తెలుగుదేశం ఖాయం!

పుర పోరు: వైసీపీలో ఆ దుర‌దృష్ట‌వంతుడికి ఈ సారైనా ల‌క్ చిక్కేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>