PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-tdp-campsdb0f2279-9c3e-4790-9efa-24231ec74745-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-tdp-campsdb0f2279-9c3e-4790-9efa-24231ec74745-415x250-IndiaHerald.jpgతమ పార్టీ అభ్యర్థులు వలసపోతుండటంతో టీడీపీలో కలవరం పెరుగుతోంది. మార్చి 2,3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ ఉండటంతో.. వైసీపీ ఎలాంటి చర్యలకు దిగుతుందోనన్న ఆందోళన తమ్ముళ్లలో కనిపిస్తోంది . అందుకే పోటీలో ఉన్న అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నారు టీడీపీ నేతలు. ap tdp camps;lokesh;srinivas;jagan;nara lokesh;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;district;rayalaseema;cm;panchayati;minister;tdp;ycp;lokesh kanagaraj;tadepalli;march;partyఏపీలో టీడీపీ క్యాంపులు!ఏపీలో టీడీపీ క్యాంపులు!ap tdp camps;lokesh;srinivas;jagan;nara lokesh;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;district;rayalaseema;cm;panchayati;minister;tdp;ycp;lokesh kanagaraj;tadepalli;march;partySun, 28 Feb 2021 15:13:49 GMTపంచాయతీ ఎన్నికల పంచాయితీ ముగియగానే ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల వేడి పెరిగింది. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కావడంతో.. ప్రధాన పార్టీలన్ని గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేధింపులు, బెదిరింపులకు దిగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్థులను బెదిరించి.. తమ పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పలాస మున్సిపాల్టీలో టీడీపీ నుంచి నామినేషన్ వేసిన నలుగురు అభ్యర్థులు వైసీపీలో చేరారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోనూ టీడీపీ ముఖ్య నేతలు అధికార పార్టీలోకి జంప్ అయ్యారు.

తమ పార్టీ అభ్యర్థులు వలసపోతుండటంతో టీడీపీలో కలవరం పెరుగుతోంది. మార్చి 2,3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ ఉండటంతో.. వైసీపీ ఎలాంటి చర్యలకు దిగుతుందోనన్న ఆందోళన తమ్ముళ్లలో కనిపిస్తోంది . అందుకే పోటీలో ఉన్న అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నారు టీడీపీ నేతలు. రాయదుర్గం మున్సిపల్ బరిలో ఉన్న 30 మంది తమ పార్టీ అభ్యర్థులను మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ .. కర్ణాటకలో క్యాంపులో ఉంటారని చెబుతున్నారు. రాయలసీమ జిల్లాకు చెందిన చాలా మున్సిపాలిటీల్లో టీడీపీ నేతలు ఇలాగే క్యాంపులు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

 అధికార వైసీపీ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తారని భావించిన టీడీపీ అభ్యర్థులను ముందుగానే పార్టీలో చేర్చుకుంటున్నారని సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. వైసీపీ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు  అభ్యర్థులు లేరన్నారు. అందుకే టీడీపీ అభ్యర్థులను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి అధికార పార్టీలో చేర్చుకుంటున్నారని లోకేష్ మండిపడ్డారు. పలాస, రాయదుర్గంతో పాటు రాష్ట్రమంతా పోటీకి అభ్యర్థులు లేని దిక్కులేని పార్టీ వైసీపీ అంటూ నారా లోకేష్ కామెంట్ చేశారు. అలాంటి పార్టీకి అధినేత అయిన సీఎంజగన్ తాడేపల్లి నివాసం నుంచి బయటికి వస్తే జనం తంతారని భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. వైసీపీ అభ్యర్థులకు జనాల్లోకి వెళ్లి ఓట్లు అడగాలంటే భయం అన్నారు నారా లోకేష్.




కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..

ఆ నలుగురు బీజేపీ నేతలు.. జగన్‌ సేవలోనే.. ఏబీఎన్‌ ఆర్కే సంచలనం..?

పుర పోరు... గుంటూరులో తెలుగుదేశం ఖాయం!

పుర పోరు: వైసీపీలో ఆ దుర‌దృష్ట‌వంతుడికి ఈ సారైనా ల‌క్ చిక్కేనా ?

పుర‌పోరు: బెజ‌వాడ కార్పొరేష‌న్‌లో ఒక నేత‌... రెండు పార్టీల్లో రాజ‌కీయం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>