MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollwood4bf7dfa1-afe1-4bd5-bca7-ffe0add94725-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollwood4bf7dfa1-afe1-4bd5-bca7-ffe0add94725-415x250-IndiaHerald.jpgప్రేమ వివాహం చేసుకోవడం అనేది సాధారణమైన విషయం. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొందరు దర్శకులు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మీకు తెలుసా? ఒకరు ఇద్దరి గురించి మాత్రమే మీకు తెలిసి ఉంటుంది. ఇంతకీ ఆ దర్శకులు ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. tollwood;mahesh;venkatesh;priya;bhaskar;jeevitha rajaseskhar;krishna vamshi;nag ashwin;prema;priyanka;puri jagannadh;ramya krishnan;rajamouli;savitri;srikanth;srikanth addala;vidya;tollywood;cinema;telugu;baba bhaskar;bahubali;naga aswin;marriage;love;industry;mahanati;manam;savithri 1;prema kathaఈ దర్శకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ దర్శకులు ఎవరో మీకు తెలుసా..?ఈ దర్శకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ దర్శకులు ఎవరో మీకు తెలుసా..?tollwood;mahesh;venkatesh;priya;bhaskar;jeevitha rajaseskhar;krishna vamshi;nag ashwin;prema;priyanka;puri jagannadh;ramya krishnan;rajamouli;savitri;srikanth;srikanth addala;vidya;tollywood;cinema;telugu;baba bhaskar;bahubali;naga aswin;marriage;love;industry;mahanati;manam;savithri 1;prema kathaSun, 28 Feb 2021 15:00:00 GMTప్రేమ వివాహం చేసుకోవడం అనేది సాధారణమైన విషయం. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొందరు దర్శకులు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మీకు తెలుసా? ఒకరు ఇద్దరి గురించి మాత్రమే మీకు తెలిసి ఉంటుంది. ఇంతకీ ఆ దర్శకులు ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ప్రేమ వివాహం చేసుకున్న మొదటి దర్శకుడు ఈ దర్శకుడు మనందరికీ తెలిసిన వాడు. ప్రేమ సినిమాలను తీస్తూ తనకంటూ ఒక ట్రెండ్ ని సృష్ట్టించుకున్న పూరి జగన్నాథ్. ఇతడు లావణ్య ను ప్రేమించి  వివాహం చేసుకున్నాడు వీరి ప్రేమ కథ  అప్పట్లో బాగా ఫేమస్ కూడా అయ్యింది. వీళ్ళ ప్రేమ కథ పత్రికల్లో రావడం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రేమ వివాహం చేసుకున్న మరో దర్శకుడు కృష్ణవంశీ. క్రియేటివ్ గా సినిమాలు తీయడం లో ఈ దర్శకుడు మంచి నేర్పరి. కృష్ణవంశీ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు బాగానే అంచనాలు వేసుకొని వస్తుంటారు. అయితే చంద్రలేఖ సినిమా చేస్తున్న సమయం లో కృష్ణవంశీ-రమ్యకృష్ణ  మధ్య ప్రేమ చిగురించడం మొదలైయ్యింది. ఆ తర్వాత వారి ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్ళింది.

టాలీవుడ్ లో ప్రేమ వివాహం చేసుకున్న మరో దర్శకుడు రాజమౌళి. 'బాహుబలి' తో  తెలుగు సినిమా రేంజ్ ఏంటో ప్రపంచానికి తెలియజేసినా దర్శకుడు రాజమౌళి. ఇతడు రమా ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇక తెలుగులో వచ్చిన 'బొమ్మరిలు' సినిమాని తన ఇంటి పేరుగా మార్చుకున్న దర్శకుడు భాస్కర్ ఇతడు కూడా శ్రీ విద్య ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అలాగే ప్రముఖ నటి సావిత్రి జీవిత కథతో వచ్చిన చిత్రం 'మహానటి'. ఈ సినిమా దర్శకుడైన నాగ్ అశ్విన్ కూడా అశ్విన్ దత్ కుమార్తె అయిన ప్రియాంక దత్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు.

వీళ్ళే కాదు 'ఈరోజుల్లో' అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు మారుతీ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. మరియు మహేష్ బాబు,వెంకటేష్ కలిసి నటించిన చిత్రం  'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ సినిమా దర్శకుడైన శ్రీకాంత్ అడ్డాల కూడా ప్రేమించి వివాహం చేసుకోవడం విశేషం. ఇదండీ టాలీవుడ్ లో ప్రేమ వివాహాలు చేసుకున్న దర్శకులు


టాలీవుడ్ హీరోలకు బిజెపి బంపర్ ఆఫర్లు...?

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..

ఆ నలుగురు బీజేపీ నేతలు.. జగన్‌ సేవలోనే.. ఏబీఎన్‌ ఆర్కే సంచలనం..?

పుర పోరు... గుంటూరులో తెలుగుదేశం ఖాయం!

పుర పోరు: వైసీపీలో ఆ దుర‌దృష్ట‌వంతుడికి ఈ సారైనా ల‌క్ చిక్కేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>