PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla5ae6d911-c10f-4319-abc2-30930e860d2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla5ae6d911-c10f-4319-abc2-30930e860d2c-415x250-IndiaHerald.jpgఆ త‌ర్వాత ఆయ‌న విశాఖ వైసీపీ న‌గ‌ర అధ్య‌క్షుడిగా ఉంటూ వ‌స్తున్నారు. 2019 ఎన్నికల నాటికి వైసీపీకి గ్యారంటీ అధికారం అనుకున్న వేళ ఏకంగా ఎమ్మెల్యే టికెట్ దక్కకుండా పోయింది. భీమిలి నుంచి తీసుకు వ‌చ్చిన అక్క‌ర‌మాని విజ‌య‌నిర్మ‌ల‌కు సీటు ఇవ్వ‌గా.. ఆమె వెల‌గ‌పూడి చేతిలో ఓడిపోయింది. ఆ త‌ర్వాత జ‌గ‌న్ వంశీకి మేయ‌ర్ ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. గ‌తేడాదే ఆయ‌న మేయ‌ర్ అవుతాన‌ని క‌ల‌లు క‌న్నారు. క‌రోనాతో ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి. ysrcp;vamsi;2019;vishakapatnam;mla;letter;ycp;bheemili;kavuru srinivasపుర పోరు: వైసీపీలో ఆ దుర‌దృష్ట‌వంతుడికి ఈ సారైనా ల‌క్ చిక్కేనా ?పుర పోరు: వైసీపీలో ఆ దుర‌దృష్ట‌వంతుడికి ఈ సారైనా ల‌క్ చిక్కేనా ?ysrcp;vamsi;2019;vishakapatnam;mla;letter;ycp;bheemili;kavuru srinivasSun, 28 Feb 2021 09:49:00 GMTవిశాఖ న‌గ‌ర వైసీపీ అధ్య‌క్షుడు. గంటా శిష్యుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న 2009లో విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌పై స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. త‌ర్వాత వైసీపీలోకి వ‌చ్చారు.

2014లో వైసీపీ నుంచి పోటీ చేసి అదే వెల‌గ‌పూడిపై 47 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న విశాఖ వైసీపీ న‌గ‌ర అధ్య‌క్షుడిగా ఉంటూ వ‌స్తున్నారు.  2019 ఎన్నికల నాటికి వైసీపీకి గ్యారంటీ అధికారం అనుకున్న వేళ ఏకంగా ఎమ్మెల్యే టికెట్ దక్కకుండా పోయింది. భీమిలి నుంచి తీసుకు వ‌చ్చిన అక్క‌ర‌మాని విజ‌య‌నిర్మ‌ల‌కు సీటు ఇవ్వ‌గా.. ఆమె వెల‌గ‌పూడి చేతిలో ఓడిపోయింది. ఆ త‌ర్వాత జ‌గ‌న్ వంశీకి మేయ‌ర్ ఇస్తాన‌ని హామీ ఇచ్చారు.

గ‌తేడాదే ఆయ‌న మేయ‌ర్ అవుతాన‌ని క‌ల‌లు క‌న్నారు. క‌రోనాతో ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి. ఇప్పుడు ఉక్కు ఎఫెక్ట్ తో విశాఖ‌లో వైసీపీ గెలుస్తుందా ? అన్న సందేహానికి తోడు ర‌క‌ర‌కాల కార‌ణాలు విశాఖ‌లో వైసీపీ ప‌రిస్థితి ట‌ఫ్ చేసేశాయి. వంశీ త‌న‌ స్థాయి దిగి మరీ కార్పోరేటర్ గా పోటీ చేస్తున్న చోట కూడా ట‌ఫ్ ఫైట్ ఉందంటున్నారు. వంశీ కార్పొరేట‌ర్‌గానే అక్కడ గెలవడానికే కష్టపడుతున్నారు. ఆ మీదట వైసీపీకి మెజారిటీ డివిజన్లు రావాలి. అన్నీ జరిగినా వైసీపీ పెద్దల నిర్ణయంలో ఏ మార్పు లేకుండా ఉండాలి. దీంతో ప‌లు మార్లు మంచి అవ‌కాశాలు మిస్ చేసుకున్న వంశీకి ఈ సారి అయినా మేయ‌ర్ ప‌ద‌వి ద‌క్కుతుందా ? అన్న‌ది చూడాలి.




పుర పోరు: హైద‌రాబాద్‌లో కూర్చొన్న టీడీపీ నేత‌... అక్క‌డ వైసీపీ వార్ వ‌న్‌సైడే ?

ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో పొగ‌... రాథోడ్ ర‌మేష్ స‌స్పెన్ష‌న్‌తో వేడి..

పుర‌పోరు: ఆ మున్సిపాల్టీ ఎన్నిక‌ల ముందే వైసీపీ ఖాతాలోకి ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు రాజ‌కీయ అవ‌కాశాలెందుకు రావ‌ట్లేదు ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు భ‌య‌ప‌డుతున్నారా... ఏపీలో కాపు గ‌ళాలు అందుకే విన‌ప‌డ‌ట్లేదా ?

వడ్డికాసులవాడికి ఆర్థిక కష్టాలు.. ఎందుకంటే..?

మోడీకి భయపడటానికి నేను జగన్‌ను.. చంద్రబాబును కాను..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>