MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/everyone-is-on-the-same-path-exercise-to-win-the69b0c0bf-0ea6-4f58-96ef-fa21be88810f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/everyone-is-on-the-same-path-exercise-to-win-the69b0c0bf-0ea6-4f58-96ef-fa21be88810f-415x250-IndiaHerald.jpgఇండియాలో సినిమా స్టార్స్‌కి, స్పోర్ట్స్‌ ప్లేయర్స్‌కి సూపర్‌ క్రేజ్ ఉంటుంది. ఈ క్రేజ్‌తోనే వీళ్ల బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా పెరుగుతుంది. అందుకే ఇప్పుడు సినిమా స్టార్లు కూడా డబుల్‌ బోనస్‌ కోసం గ్రౌండ్‌లో దిగుతున్నారు. వెండితెరపై బంగారు పతకాలు గెలవాలనుకుంటున్నారు. రొమాంటిక్ స్టోరీస్‌తో యూత్‌ ఫాలోయింగ్‌ పెంచుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు కొంచెం ట్రాక్ మార్చాడు. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఒక సినిమా చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో మార్షల్‌ ఆర్ట్స్ ఛాంపియన్‌లా మారిపోయాడు.everyone is on the same path exercise to win the;naga chaitanya;gopichand;kumaar;vikram k kumar;vikram kumar;kiran;sandeep;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;vijay;vijay deverakonda;vikram;cinema;majili;joseph vijay;romantic;chaitanya 1;devarakonda;journey;hockeyఅందరూ అదే బాట.. ఆటలో గెలిచేందుకు కసరత్తు..!అందరూ అదే బాట.. ఆటలో గెలిచేందుకు కసరత్తు..!everyone is on the same path exercise to win the;naga chaitanya;gopichand;kumaar;vikram k kumar;vikram kumar;kiran;sandeep;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;vijay;vijay deverakonda;vikram;cinema;majili;joseph vijay;romantic;chaitanya 1;devarakonda;journey;hockeySun, 28 Feb 2021 23:00:00 GMTసినిమా స్టార్స్‌కి, స్పోర్ట్స్‌ ప్లేయర్స్‌కి సూపర్‌ క్రేజ్ ఉంటుంది. ఈ క్రేజ్‌తోనే వీళ్ల బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా పెరుగుతుంది. అందుకే ఇప్పుడు సినిమా స్టార్లు కూడా డబుల్‌ బోనస్‌ కోసం గ్రౌండ్‌లో దిగుతున్నారు. వెండితెరపై బంగారు పతకాలు గెలవాలనుకుంటున్నారు.

రొమాంటిక్ స్టోరీస్‌తో యూత్‌ ఫాలోయింగ్‌ పెంచుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు కొంచెం ట్రాక్ మార్చాడు. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఒక సినిమా చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో మార్షల్‌ ఆర్ట్స్ ఛాంపియన్‌లా మారిపోయాడు. 'లైగర్' సినిమాలో బాక్సింగ్‌ ప్లేయర్‌గా నటిస్తున్నాడు విజయ్. ఇక ఈ సినిమాతోనే బాలీవుడ్‌లోనే అడుగుపెడుతున్నాడు రౌడీ స్టార్.

రెగ్యులర్‌ స్టోరీస్‌కి భిన్నంగా, సెపరేట్ పాథ్‌లో వెళ్తోన్న వరుణ్‌తేజ్ ఇప్పుడు స్పోర్ట్స్‌ ట్రాక్‌లోకి వస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' అనే బాక్సింగ్ డ్రామా చేస్తున్నాడు. ఈ మూవీ కోసం వరుణ్‌తేజ్ ఫారెన్‌లో  ఇంటెన్స్‌ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు వరుణ్.

రొమాంటిక్‌ స్టోరీస్‌తో లవర్‌ బాయ్ అనిపించుకున్న నాగచైతన్య ఇప్పుడీ ట్రాక్‌ నుంచి బయటకు వస్తున్నాడు. స్పోర్ట్స్‌ కోటాలో ఎమోషనల్ జర్నీ చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో హాకీ నేపథ్యంలో 'థ్యాంక్యూ' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కోసం చైతన్య హాకీ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడట. ఇక చై ఇంతకుముందు 'మజిలీ' సినిమాలో క్రికెట్‌ ప్లేయర్‌గా కనిపించాడు.

స్పోర్ట్స్‌ డ్రామాస్‌లో కావల్సినన్ని సినిమాటిక్ ఎలిమెంట్స్‌ ఉంటున్నాయి. కమర్షియల్ మూవీస్‌లో కనిపించే ఎమోషన్స్‌, ఫైటింగ్ స్పిరిటీ అన్నీ కనిపిస్తుంటాయి. బోనస్‌గా సస్పెన్స్‌ కూడా ఉంటుంది. అందుకే టాలీవుడ్‌ స్టార్లంతా స్పోర్ట్స్‌ డ్రామాస్‌కి సైన్ చేస్తున్నారు. యాక్షన్‌ మూవీస్‌ చేస్తోన్న గోపీచంద్ కూడా ట్రాక్ మార్చాడు. అగ్రెసివ్‌ రోల్స్‌తో భారీ ఫైటింగులు చేసే గోపీచంద్ ఇప్పుడు కబడ్డీ కోచ్‌గా మారాడు. 'సీటీమార్' సినిమాలో కబడ్డీ కోచ్‌గా నటిస్తున్నాడు. ఇక ఇదే సినిమాలో తమన్నా కూడా కబడ్డీ కోచ్‌గా నటించింది. సందీప్ కిషన్‌ కూడా స్పోర్ట్స్‌ డ్రామా చేస్తున్నాడు. 'ఏ-వన్ ఎక్స్‌ప్రెస్' అనే సినిమాలో హాకీ ప్లేయర్‌గా నటించాడు సందీప్. ఈ మూవీలో నిజమైన అథ్లెట్‌లా కనిపించడానికి సిక్స్‌ ప్యాక్ ట్రై చేశాడు. అలాగే  హాకీలో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.





వాడుకోండయ్యా .... వాడుకున్నోళ్ళకు వాడుకున్నంత ....??

వేసింది కోటే.. కాని ఆ చూపులు మాత్రం...!

2022 సంక్రాంతికే పవర్ స్టార్.. అసలు సిసలు బాక్సాఫీస్ ఫైట్..!

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సాయి పల్లవి కొత్త పాట.. ట్రెండింగ్ లో నెంబర్ 1..!

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>