EducationSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/tourd9774ceb-812f-46fe-af1d-4b02330e4f76-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/tourd9774ceb-812f-46fe-af1d-4b02330e4f76-415x250-IndiaHerald.jpgకొన్ని ప్ర‌దేశాల‌ను చూసిన‌ప్పుడు భూత‌ల స్వ‌ర్గం అంటుంటాం. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నవర్ కు సమీపంలో ఉన్న అప్సర కొండ గ్రామం నిజంగానే భూత‌ల స్వ‌ర్గ‌మ‌ని స్థ‌ల పురాణం చెబుతోంది.దేవతలు స్నానం చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చే వారని పురాణ క‌థ‌నం. ఎత్తైన కొండ‌లు..అందులోంచి జారిప‌డుతున్న‌ట్లుగా దూకే జ‌ల‌పాతం వ‌ద్ద స్నానం చేయ‌డం అంటే ప్ర‌కృతి ఒడిలో ప‌ర‌వ‌శించిపోవ‌డ‌మే మ‌రి. ఇప్పుడు ఈ అదృష్టాన్ని చాలా మంది అనుభ‌విస్తున్నారు లెండి. సిటీ లైఫ్ నుండి దూరంగా ప్రకృతి అందాలtour;prakruti;tara;karnataka - bengaluru;pond;village;kannada;october;june;nijam;maha;mantra;narasimhaఅవును అది భూత‌ల స్వ‌ర్గం.. ఇలాపైకి వ‌చ్చి అక్క‌డ అప్స‌ర‌స‌లు స్నానం చేస్తారంట‌...అవును అది భూత‌ల స్వ‌ర్గం.. ఇలాపైకి వ‌చ్చి అక్క‌డ అప్స‌ర‌స‌లు స్నానం చేస్తారంట‌...tour;prakruti;tara;karnataka - bengaluru;pond;village;kannada;october;june;nijam;maha;mantra;narasimhaSat, 27 Feb 2021 08:30:00 GMTకర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నవర్ కు సమీపంలో ఉన్న అప్సర కొండ గ్రామం నిజంగానే భూత‌ల స్వ‌ర్గ‌మ‌ని స్థ‌ల పురాణం చెబుతోంది.దేవతలు స్నానం చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చే వారని పురాణ క‌థ‌నం. ఎత్తైన కొండ‌లు..అందులోంచి జారిప‌డుతున్న‌ట్లుగా దూకే జ‌ల‌పాతం వ‌ద్ద స్నానం చేయ‌డం అంటే ప్ర‌కృతి ఒడిలో ప‌ర‌వ‌శించిపోవ‌డ‌మే మ‌రి. ఇప్పుడు ఈ అదృష్టాన్ని చాలా మంది అనుభ‌విస్తున్నారు లెండి. సిటీ లైఫ్ నుండి దూరంగా ప్రకృతి అందాల మధ్య సమయం గడపాలని కోరుకునే వారు ఈ గ్రామానికి చేరుకుంటున్నారంట‌.  అప్సరకొండ జలపాతం ఎన్నో పర్యాటక ఆకర్షణలతో కూడుకుని ఉంటుంది.


ఈ గ్రామంలోని అందాలు, జలపాతం హొయలు టూరిస్టులను మంత్ర ముగ్ధులను చేస్తాయి.సుమారు 50 అడుగుల ఎత్తు నుండి పడే అప్సరకొండ జలపాతాలు క్రింద సహజ సిద్ధంగా ఏర్పడిన చెరువులోకి వెళతాయి. టూరిస్టులు మెరిసే జలపాతం దృశ్యాలతో పాటు కొండ పై నుండి అద్భుతమైన సూర్యాస్తమయం దృశ్యాలను కూడా ఆస్వాదించవచ్చు.  సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలకు అప్సర కొండ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మహా గణపతి, ఉగ్ర నరసింహ ఆలయాలు కూడా ఉన్నాయి. అప్సర కొండ జలపాతం అనేక చెట్ల మూలాల గుండా ప్రవహించడం వల్ల ఈ నీటికి గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.



అప్సరకొండకు ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవడం ఒక గొప్ప అనుభవం అని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో పర్యాటకులు సందర్శించేందుకు అనేక సహజ గుహలు కూడా ఉన్నాయి. పాండవులు వనవాసం సమయంలో ఈ గుహల్లో కొంత కాలం నివసించినట్లు పురాణ కధనం ఉంది. అందుకే వీటికి చూసేందుకు టూరిస్టులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. వర్షాకాలం ఈ జలపాతాల సందర్శనకు సరైన సమయం. కాబట్టి ఇక్కడికి వెళ్లాలనుకునే పర్యాటకులు జూన్ నుండి అక్టోబర్ మధ్య ట్రిప్ ను ప్లాన్ చేసుకుంటే మంచిది. అప్సరకొండ జలపాతాలను చేరుకోవడానికి అన్ని మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హొన్నవర్ నుండి ఈ జలపాతాలకు 6 కిలోమీటర్ల దూరం.


వాట్సాప్ లో వీడియో కాల్ చేస్తూ.. యువకుడు చేసిన పనికి అందరు షాక్..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: పెద్ద‌ల స‌భ‌లో మూగ‌బోయిన బ్రాహ్మ‌ణ వాణి..!

చంద్రబాబుకు చుక్కలు చూపించిన జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్..?

కాపు వేద‌న‌: కార్పొరేష‌న్ల‌లో పార్టీల త‌ల‌రాత‌లు మార్చ‌నున్న కాపులు ?

కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. తెరవెనక ఏం జరుగుతోంది..?

సినీ ఇండస్ట్రీలో ఎక్కువ సార్లు నంది అవార్డులు అందుకున్న హీరోలు ఎవరో తెలుసా..!

ఎడిటోరియల్: బెడిసి కొడితే మాజీ ప్రధాని పివి కుటుంబం పరువు ప్రతిష్ట పోయే కచరా వ్యూహం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>