PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/history-of-indiaa911a7bf-3277-4295-870d-c8afa3ddd613-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/history-of-indiaa911a7bf-3277-4295-870d-c8afa3ddd613-415x250-IndiaHerald.jpgభారతదేశ చరిత్ర ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మధ్య యుగంలో పాలించిన రాజుల పాలన ఎన్నో అద్భుతమైన పట్టాలను నిర్మించారు. అవి కాలక్రమంలో కనుమరుగయ్యినా నేడు పర్యాటక రంగాలుగా విలసిల్లుతున్నాయి. గత వైభంగా చిహ్నాలకు ప్రతీకలుగా నిలిచిన కొన్ని ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా. history of india;krishna;gujarat - gandhinagar;karnataka - bengaluru;history;king;sri krishna;local language;central government;dwarakaభారతదేశ చరిత్రలో కనుమరుగైన అద్భుత నగరాలు ఇవే..!?భారతదేశ చరిత్రలో కనుమరుగైన అద్భుత నగరాలు ఇవే..!?history of india;krishna;gujarat - gandhinagar;karnataka - bengaluru;history;king;sri krishna;local language;central government;dwarakaSat, 27 Feb 2021 21:00:00 GMTచరిత్ర ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మధ్య యుగంలో పాలించిన రాజుల పాలన ఎన్నో అద్భుతమైన పట్టాలను నిర్మించారు. అవి కాలక్రమంలో కనుమరుగయ్యినా నేడు పర్యాటక రంగాలుగా విలసిల్లుతున్నాయి. గత వైభంగా చిహ్నాలకు ప్రతీకలుగా నిలిచిన కొన్ని ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా.

అయితే ద్వారక కృష్ణుడు ఉన్నాడు ద్వారకను పరిపాలించాడు అని చెప్పడానికి సజీవ సాక్ష్యం ఈ ప్రాంతం. శ్రీ కృష్ణుడి పరిపాలిస్తున్న సమయంలో రాజధానిగా ద్వారక పట్టణం గుజరాత్ తీరంలో సముద్ర గర్భంలోకి మునిగిపోయింది. ఇప్పటికి కొన్ని అవశేషాలు కనిపిస్తాయి. హరప్ప చరిత్రకు సజీవ సాక్ష్యం కాలిబంగాన్ పట్టణం. ఇప్పటికీ హరప్ప శిధిలాలు కలిగి వుంది. రాజస్తాన్ లోని గగ్గర్ నది దక్షిణపు భాగం లోని ప్రదేశాన్ని కాళీ బంగాన్ పట్టణం అనే వారు. ఇక్కడ ప్రపంచపు మొట్ట మొదటి దున్నిన పొలం వెలుగులోకి వచ్చింది.

ఇక గుజరాత్‌లోని లోథాల్ పట్టణం పురాతన సింధు లోయ నాగరికతకు కేంద్రంగా విలసిల్లింది. ఈ ప్రదేశం నుండి పూసలు, రత్నాలు, మణులు, విలువైన బంగారు ఆభరణాలు వెస్ట్ ఆసియా, ఆఫ్రికా దేశాలకు కూడా ఎగుమతి అయ్యేవని తెలుస్తోంది. ముజిరిస్ సుమారు ఒకటవ శతాబ్దంలో వుండేదని తెలుస్తోంది. అయితే ఈ సముద్ర రేవు ద్వారా అప్పటి దక్షిణ భారత దేశ ప్రజలు ఫోయనిషిన్లు, ఈజిప్షియన్ లు గ్రీకులు, రోమన్ సామ్రాజ్యం లతో వ్యాపారాలు చేసేవారని చరిత్రకారులు వెల్లడించారు.

అయితే కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పట్టదక్కాల్ పట్టణం ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశం. ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. చాళుక్య రాజుల చారిత్రక స్మారకాలతో నేటికీ ఈ పట్టణానికి ప్రత్యేక గురింపు సొంతం చేసుకుంది. గుజరాత్ లో మాయమైన మరో పట్టణం డోలవీరా. స్థానికులు ఈ పట్టణాన్ని, కోటదటిమ్బా అని పిలుస్తారు. ఈ పట్టణంలో ఇప్పటికీ పురావస్తు ప్రదేశంలో సింధు లోయ నాగరికతకు సంబంధించిన పురాతన శిధిలాలు కలవు అని నిపుణులు చెబుతున్నారు.


ఆ స్టార్ హీరో సినిమాకి వరలక్ష్మి.. హీరోయిన్ గానా,లేక..?

ఎడిటోరియల్: కేసీఆర్ పాచిక గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పారుతుందా? పతనమౌతుందా?

బాలయ్య స్థానంలో నాగార్జున.. మెప్పించగలడా..??

బీజేపీతో పొత్తు అవ‌స‌ర‌మా? ఆలోచ‌న‌లో ప‌డ్డ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

పవన్ క్రిష్ మూవీ నుండి మరో అప్డేట్...?

తిరుపతి సీటు జనసేనదేనట... ?

పుర పోరు : ఒకే వార్డులో ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>