Healthsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/ulavalud868ebe5-6464-460a-af20-e2157e593887-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/ulavalud868ebe5-6464-460a-af20-e2157e593887-415x250-IndiaHerald.jpgనవధాన్యాల్లో ఉలవలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీటిని ఇంగ్లీష్ లో హార్స్ గ్రామ్ (horse gram) అంటారు. ముఖ్యంగా ఉలవ గుగ్గిళ్ళు, ఉలవచారు తెలుగు వారికి అత్యంత ప్రియమైన వంటకాలు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఉలవలు ఆహారంగా ఎక్కువగా వాడేవారు. ప్రస్తుతం మనం ఉలవల ప్రాముఖ్యత గుర్తించి, ప్రతి ఒక్కరూ వాడటానికి ఇష్టపడుతున్నారు.నేడు ఉలవచారు అత్యంత ఖరీదైన వంటకం.కొన్ని రెస్టారెంట్లు ఉలవచారు బిర్యానీలతో ఆహారప్రియులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు ఉలవల్లో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యంలోనూ ఉండవంటే అతిశయోక్తి కాదుulavalu;nithya new;aqua;horse gramఈ నవ ధాన్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా..!!ఈ నవ ధాన్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా..!!ulavalu;nithya new;aqua;horse gramSat, 27 Feb 2021 04:00:00 GMT

ఉలవలు తరచూ ఆహారంలో తీసుకుంటే శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది.

ప్రతి రోజూ ఉలవలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరంలో వున్న అనవసరపు కొవ్వు క్రమంగా క‌రిగి శరీర బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఉల‌వ‌ల్లో ఐర‌న్‌, కాల్షియం, పాస్ఫ‌ర‌స్‌,  ఎక్కువ‌గా ఉంటాయి. కావున వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు, కీళ్ల సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.  

ఉలవలలో ఫైబ‌ర్ ఎక్కువగా ఉండ‌డం వ‌ల్ల ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉండి మ‌ధుమేహం అదుపులో ఉంటుంది.

పక్షవాతం, కీళ్ళవాతం, సయాటికా నడుము నొప్పి, స్పాండిలోసిస్ , మెడ నొప్పి వంటి వాత వ్యాధులతో బాధపడేవారికి ఉలవచారు చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

ముఖ్యంగా కిడ్నీవ్యాధులతో బాధపడేవారికి ఉలవచారు చాలామంచిది. మూత్రశయంలో ఏర్పడిన రాళ్లను సమర్థ వంతంగా ఇవి కరిగిస్తాయి.

తరచూ ఎక్కిళ్ల సమస్యతో బాధపడుతున్నవారికి ఉలవలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

తరచూ దగ్గు, జలుబు, ఆయాసం, తుమ్ములు ఉన్నవారు ఉలవల చారును వేడివేడిగా తీసుకుంటే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఉలవలకు వేడి చేసే గుణం ఎక్కువగా ఉంది కాబట్టి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లేదా నిత్యం వేడి ప్రదేశాల్లో పనిచేసేవారు ఉలవలను తక్కువగా తీసుకోవడం మంచిది.


గుణశేఖర్ శాకుంతలం.. సమంత నటవిశ్వరూపం నేషనల్ అవార్డ్ పక్కా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు

పుర పోరు : ఆ మాజీ ఎమ్మెల్యే విశాఖ మేయర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>