PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jr-ntr3f7b23e1-fe9e-4d0d-af1f-cd19d5b956d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jr-ntr3f7b23e1-fe9e-4d0d-af1f-cd19d5b956d4-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు స్థాపించారు. ఆయన తన మూడున్నర పదుల సినీ జీవితాన్ని, అప్పటిదాకా ప్రజలలో తాను సంపాదించుకున్న విశేష అభిమానాన్ని పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. వెండి తెర మీద దైవాంశ సంభూతునిగా ఉన్న ఎన్టీయార్ ని జనాలు ఆదరించి అక్కున చేర్చుకున్నారు. ఏకంగా తొమ్మిది నెలలు తిరగకుండానే ఆయన్ని సీఎంగా చేసి ప్రజా నాయకుడు అంటే అన్న గారే అన్నట్లుగా ప్రపంచానికి చాటి చెప్పారు. jr ntr;ntr;lokesh;jr ntr;ranina;telugu;cm;chief minister;silver;tdp;lokesh kanagaraj;nandamuri taraka rama rao;silver screen;partyజూనియర్ ఎన్టీయార్ ఎంట్రీకి బాబు ఓకేనా..?జూనియర్ ఎన్టీయార్ ఎంట్రీకి బాబు ఓకేనా..?jr ntr;ntr;lokesh;jr ntr;ranina;telugu;cm;chief minister;silver;tdp;lokesh kanagaraj;nandamuri taraka rama rao;silver screen;partySat, 27 Feb 2021 10:00:00 GMTనందమూరి తారక రామారావు స్థాపించారు. ఆయన తన మూడున్నర పదుల సినీ జీవితాన్ని, అప్పటిదాకా ప్రజలలో తాను సంపాదించుకున్న విశేష అభిమానాన్ని పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. వెండి తెర మీద దైవాంశ సంభూతునిగా ఉన్న ఎన్టీయార్ ని జనాలు ఆదరించి అక్కున చేర్చుకున్నారు. ఏకంగా  తొమ్మిది నెలలు తిరగకుండానే ఆయన్ని సీఎంగా చేసి ప్రజా నాయకుడు అంటే అన్న గారే అన్నట్లుగా ప్రపంచానికి చాటి చెప్పారు.

ఆ తరువాత టీడీపీలో చేరిన చంద్రబాబు ముఖ్యమంత్రి ఎలా అయ్యారో అందరికీ తెలిసిందే. చంద్రబాబు సీఎం అయ్యాక టీడీపీలో నందమూరి వారసుల ప్రాభవం పూర్తిగా తగ్గిపోయింది. నారా వారిదే రాజ్యం అయింది. పార్టీ గెలిచినా ఓడినా కూడా నారా వారి నామస్మరణతోనే పార్టీ మారుమోగుతోంది. ఇదిలా ఉండగా టీడీపీలో బాలక్రిష్ణ కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. ఇక చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడు అయితే లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇలా తండ్రీ కొడుకులే పార్టీ మొత్తాన్ని నడుపుతున్నారు. 2019లో ఘోర పరాభవం టీడీపీకి ఎదురైనా కూడా చంద్రబాబు పార్టీకి కాయకల్ప చికిత్స చేయలేదు అన్న ఆరోపణలు ఉన్నాయి.

తాజాగా తనను ఇప్పటికి ఏడు సార్లు గెలిపించిన కుప్పం ప్రజల వద్దకు చంద్రబాబు వెళ్తే అక్కడ వినిపించిన జూనియర్ ఎన్టీయార్ నినాదాలు యావత్తు టీడీపీని కలవరపెడుతున్నాయి. చంద్రాబాబు ముఖం మీదనే క్యాడర్ జూనియర్ ఎన్టీయార్ ని తీసుకురండి సార్ అంటూ కోరడం సంచలనం రేపుతోంది. అంటే ఇపుడున్న లోకేష్ వల్ల టీడీపీకి ఏ మాత్రం మేలు చేకూరదు అని తమ్ముళ్ళు గట్టి అభిప్రాయానికే వచ్చారన్న మాట. మరి జూనియర్ నినాదాలను బాబు ఆసక్తి లేనట్లుగానే వినాల్సి వచ్చింది. మరి ఇంతకీ క్యాడర్ కోరినట్లుగా జూనియర్ ఎన్టీయార్ ని టీడీపీలోకి బాబు తెస్తాడా. అది జరిగే పని కాదని అందరికీ తెలుసు. ఎందుకంటే బాబు లోకేష్ మాత్రమే ఉండాలనుకుంటున్న పార్టీలో జూనియర్ వస్తే ఆయనే సీఎం క్యాండిడేట్. అందుకే క్యాడర్ సైతం జూనియర్ ని కోరుతున్నా బాబు అందుకు ఒప్పుకోరు అన్న మాటే వినిపిస్తోంది.




హద్దు దాటినా అషురెడ్డి..ఏకంగా ముద్దు పెట్టేసి రచ్చ రచ్చ..?

ఆ ముగ్గురు మంత్రుల‌కు కేసీఆర్ అగ్నిప‌రీక్ష‌

అవును అది భూత‌ల స్వ‌ర్గం.. ఇలాపైకి వ‌చ్చి అక్క‌డ అప్స‌ర‌స‌లు స్నానం చేస్తారంట‌...

బ్రాహ్మ‌ణ ఘోష‌: పెద్ద‌ల స‌భ‌లో మూగ‌బోయిన బ్రాహ్మ‌ణ వాణి..!

చంద్రబాబుకు చుక్కలు చూపించిన జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్..?

కాపు వేద‌న‌: కార్పొరేష‌న్ల‌లో పార్టీల త‌ల‌రాత‌లు మార్చ‌నున్న కాపులు ?

కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన.. తెరవెనక ఏం జరుగుతోంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>