GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates059ebf72-3140-4137-b5c8-3702a0545475-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates059ebf72-3140-4137-b5c8-3702a0545475-415x250-IndiaHerald.jpgపసిడి ప్రియులకు శుభవార్త.. నిన్నటి దాకా కాస్త కిందకు వచ్చిన బంగారం ధర నేటి మార్కెట్ లో పూర్తిగా పడిపోయింది. ఇక వెండి కూడా అదే దారిలో నడిచింది. ఇప్పుడు బంగారం కొనాలని అనుకునేవారికి ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. దీంతో ఇన్ని రోజులుగా బంగారాన్ని కోనాలని వేచి చూస్తున్నవారికి ఇది సరైన అవకాశంమని చెప్పుకోవచ్చు. అటు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లో మాత్రం పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు కూడా ధరలు పూర్తిగా కిందకు వచ్చాయి. మహిళలు ఆభరణాలు కgold rates;hyderabad;rbi;industries;gold;vegetable market;silver;central government;internationalపసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం, వెండి ధరలు ఢమాల్..!!పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం, వెండి ధరలు ఢమాల్..!!gold rates;hyderabad;rbi;industries;gold;vegetable market;silver;central government;internationalSat, 27 Feb 2021 14:02:24 GMTపసిడి ప్రియులకు శుభవార్త.. నిన్నటి దాకా కాస్త కిందకు వచ్చిన బంగారం ధర నేటి మార్కెట్ లో పూర్తిగా పడిపోయింది. ఇక వెండి కూడా అదే దారిలో నడిచింది. ఇప్పుడు బంగారం కొనాలని అనుకునేవారికి ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. దీంతో ఇన్ని రోజులుగా బంగారాన్ని కోనాలని వేచి చూస్తున్నవారికి ఇది సరైన అవకాశంమని చెప్పుకోవచ్చు. అటు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లో మాత్రం పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి.  ఈ రోజు కూడా ధరలు పూర్తిగా కిందకు వచ్చాయి. మహిళలు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు.


ఈ విషయం తెలియగానే బంగారు దుకాణాలు జనంతో కిక్కిరిసిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. అసలు విషయానికొస్తే..హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 దిగొచ్చింది. దీంతో రేటు రూ.47,180కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.150 తగ్గుదలతో రూ.43,250కు పడిపోయింది.బంగారం ధర పడిపోతే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. భారీగా తగ్గింది. వెండి ధర కేజీకి రూ.1,700 పతనమైంది. దీంతో రేటు రూ.73,300కు దిగొచ్చింది.పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ప్రధాన కారణం గా చెప్పవచ్చు..


ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర వెలవెలబోయింది. బంగారం ధర ఔన్స్‌కు 2.42 శాతం తగ్గుదలతో 1732 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర దిగివస్తే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 3.51 శాతం క్షీణతతో 26.66 డాలర్లకు తగ్గింది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. మరి ఆదివారం మార్కెట్ లో ధర ఎలా ఉంటుందో చూడాలి..


రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్న యూనివర్సల్ బాస్.. ఫ్యాన్స్ హ్యాపీ..?

తిరుపతి సీటు జనసేనదేనట... ?

పుర పోరు : ఒకే వార్డులో ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు పోటీ ?

మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా దెబ్బకు ఆహా షేక్.. !?

పుర పోరు: వైసీపీలో ఆ యువ‌నేత మంత్రాంగ‌మే హాట్ టాపిక్ ?

పుర పోరు : విశాఖను నడిపించేది మహిళలే...?

పుర పోరు: 12 కార్పొరేష‌న్ల‌లో ఆరు మావే అంటోన్న టీడీపీ.. లిస్ట్ ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>