MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pragya70ee0302-4c64-4966-a8b2-24378bd43257-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pragya70ee0302-4c64-4966-a8b2-24378bd43257-415x250-IndiaHerald.jpgఅందం ఉంది, అభినయం కూడా ఉంది. కానీ అదృష్టం మాత్రం ఆమడ దూరంలో ఉంది. అందుకే అమ్మడు రాణించలేకపోతోంది. తన కంటే వెనకాల వచ్చిన వారు సైతం రేసులో ముందుకు దూసుకుపోతూంటే తాను మాత్రం అలాగే ఉండిపోయింది. ఆమె కంచె దాటుకుని రాలేకపోతోంది. pragya;balakrishna;abinaya;boyapati srinu;nayantara;pragya jaiswal;rani;tollywood;cinema;heroine;yatra;simha;jaya janaki nayaka;yashasvi jaiswalకెరీర్ మలుపు తిప్పే రోల్ లో ప్రగ్యా...?కెరీర్ మలుపు తిప్పే రోల్ లో ప్రగ్యా...?pragya;balakrishna;abinaya;boyapati srinu;nayantara;pragya jaiswal;rani;tollywood;cinema;heroine;yatra;simha;jaya janaki nayaka;yashasvi jaiswalSat, 27 Feb 2021 11:00:00 GMT
ఆమె ఎవరో కాదు ప్రగ్యా జైస్వాల్. ఈ అమ్మడు కంచె సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకుంది. ఆ తరువాత సినిమాల్లో గ్లామర్ కూడా పండించి టాలీవుడ్ కి తాను తగిన చాయిస్ అనిపించుకుంది. ఇక ప్రగ్యా జైస్వాల్ జైత్ర యాత్ర మొదలు అవుతుందని అంతా ఊహించారు. కానీ ఏమీ జరగలేదు. మిడిల్ రేంజి హీరోల పక్కన నటించిన సినిమాలు ఫట్ మనడంతో ఆమెకు ఎక్కడా ఆఫర్లు లేకుండా పోయాయి. ఈ సమయంలో బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ మూవీలో లక్కీగా ప్రగ్యాకు చాన్స్ దక్కింది. మిరియాల రవీంద్రరెడ్డి అంతకు ముందు తీసిన జయ జానకీ నాయక అన్న మూవీలో కూడా ప్రగ్యా హీరోయిన్. దాంతో ఇపుడు అదే బ్యానర్ నుంచి బాలక్రిష్ణ సరసన చాన్స్ రావడంతో ప్రగ్యా దశ తిరిగింది అని అంతా అనుకున్నారు.

ఇపుడు దానికి తగినట్లుగానే ఈ మూవీ అప్డేట్స్ ఉంటున్నాయి. ఇది కచ్చితంగా హిట్ అయ్యే మూవీ అని బయ్యర్ల నుంచి ఫ్యాన్స్ దాకా అంతా ఒక్క మాట మీద ఉన్నారు. ఇక ఈ మూవీలో ప్రగ్యా  జైస్వాల్ క్యారక్టర్ కూడా అదిరిపోయే రేంజీలో ఉంటుందిట. గట్టిగా చెప్పాలంటే సింహా సినిమాలో నయనతార నటించిన పవర్ ఫుల్ పాత్ర లాంటిదే ప్రగ్యా ఈ మూవీలో పోషిస్తోంది అంటున్నారు. అంటే కేవలం గ్లామర్ డాల్ గానే కాకుండా పెర్ఫార్మెన్స్ కూడా బాగా ఉండే రోల్ లో ప్రగ్యాని తీసుకున్నారని తెలుస్తోంది. ఈ మూవీ హిట్ అయితే మాత్రం ప్రగ్యా కి మళ్ళీ ఆఫర్లు వెల్లువలా రావచ్చు అంటున్నారు.





ఇక లాభం లేదు... రంగంలోకి దిగిన జగన్

పుర పోరు: 12 కార్పొరేష‌న్ల‌లో ఆరు మావే అంటోన్న టీడీపీ.. లిస్ట్ ఇదే ?

పుర పోరు : విశాఖలో వేడెక్కించేసిన వైసీపీ...?

జూనియర్ ఎన్టీయార్ ఎంట్రీకి బాబు ఓకేనా..?

పుర పోరు: ఏపీలో జ‌గ‌నోరికి దెబ్బ ప‌డేది ఇక్క‌డే.. డౌటే లేదు..?

ఆ ముగ్గురు మంత్రుల‌కు కేసీఆర్ అగ్నిప‌రీక్ష‌

అవును అది భూత‌ల స్వ‌ర్గం.. ఇలాపైకి వ‌చ్చి అక్క‌డ అప్స‌ర‌స‌లు స్నానం చేస్తారంట‌...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>