Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/padalu90c52c3c-a4a6-4a44-863f-780847e8c3bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/padalu90c52c3c-a4a6-4a44-863f-780847e8c3bd-415x250-IndiaHerald.jpgచాలామందికి పాదాలు పగిలి నొప్పితో బాధపడుతుంటారు. ఎన్ని క్రీములు రాసినా కొద్ది సేపు మాత్రమే ఉపశమనంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ నొప్పి మొదలవుతుంది. ఇలాంటి సమయంలో వంటింట్లో దొరికే వాటితోనే పాదాల పగుళ్ళను నయం చేయవచ్చు. అంతేకాకుండా పాదాలను అందంగా తయారుచేయవచ్చు. ఆ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం... padaluపాదాలు అందంగా,ఉండడానికి ఈ చిట్కాలను ఉపయోగించండి...?పాదాలు అందంగా,ఉండడానికి ఈ చిట్కాలను ఉపయోగించండి...?padaluSat, 27 Feb 2021 02:00:00 GMT
 క్యారెట్ తీసుకుని తురుము కోవాలి. ఈ తురుము లోకి రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్ కలిపి పాదాలకు బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలు మృదువుగా మారతాయి.

 అర టీ స్పూన్ పసుపు కొబ్బరి తురుము అర కప్పు తీసుకొని రెండింటినీ బాగా కలపాలి. తర్వాత పాదాలకు బాగా మర్దన చేయాలి. కొద్దిసేపు తర్వాత నీళ్ళతో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలు మృదువుగా మారతాయి.

 అరికాళ్ళు మృదువుగా ఉండాలంటే పాదాలను తరచూ కొబ్బరినూనెతో మర్దన చేస్తూ ఉండాలి. చేయడంవల్ల పాదాలు అందంగా ఉంటాయి.

 కీరా జ్యూస్ లో కొంచెం బియ్యప్పిండి కలిపి మెత్తగా  పేస్ట్  తయారు చేయాలి. ఈ పేస్ట్ ను పాదాలకు బాగా అప్లై చేయాలి. కొద్దిసేపు తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు తగ్గడమే కాకుండా, పాదాలు మృదువుగా ఉంటాయి.

 కొంతమందికి పాదాల మడమలు బిరుసు  చర్మంతో ఉంటాయి. ఇలాంటి వారు నిమ్మరసం, పంచదార కలిపి మడమల  వద్ద మర్దన చేయాలి. ఇలా చేయడంవల్ల మంచి ఫలితం కలుగుతుంది.

 ఒక టేబుల్ స్పూను శనగపిండిలో కొద్దిగా పుల్లని పెరుగు, కాస్త పసుపు కలిపి పాదాలకు పట్టించి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలపై ఉన్న మృత  కణాలు చనిపోయి పాదాలు అందంగా కనపడతాయి.


డెలివరీ తర్వాత అనుష్క ఎలా ఉందో చూడండి..!

గుణశేఖర్ శాకుంతలం.. సమంత నటవిశ్వరూపం నేషనల్ అవార్డ్ పక్కా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>