EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/much-difference-can-be-seen-between-jagan-and-naidu26640750-0e37-4f77-8856-90201d9117cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/much-difference-can-be-seen-between-jagan-and-naidu26640750-0e37-4f77-8856-90201d9117cb-415x250-IndiaHerald.jpgఎందుకంటే ఆమె ఓ మామూలు కార్యకర్త. రేపటి మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడలోని 59వ డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నారు. అలాంటామెను జగన్ ఏకంగా ఎంఎల్సీగా ఎంపిక చేశారు. ఇలాంటి ఎంపికను తెలుగుదేశంపార్టీ అసలు ఊహించలేరు. ఇక బల్లి కల్యాణ్, భగీరధరెడ్డిల తండ్రులు దివంగత తిరుపతి ఎంపి బల్లి దుర్గాప్రసాద్ రావు, దివంగత ఎంఎల్సీ చల్లా రామకృష్ణారెడ్డి వారసులు. అనారోగ్యంతో తండ్రులు చనిపోగానే వాళ్ళను రాజకీయంగా ఆదుకుంటానని జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారమే ఇద్దరినీ ఎంఎల్సీలుగా ఎంపిక చేశారు. ఇచ్చిన హామీని చంద్రబycp mlcs jagan naidu tdp amaravati vizag;women;venkatesh;choudary actor;editor mohan;naga chaitanya;srinivas;tiru;telugu desam party;jagan;rajya sabha;mp;telugu;tirupati;husband;woman;ycp;sujana choudary;chaitanya 1;reddy;corporate;party;sajjala ramakrishna reddyహెరాల్డ్ ఎడిటోరియల్ : ఇద్దరికీ తేడా ఏమిటో స్పష్టంగా తెలిసిపోయిందా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : ఇద్దరికీ తేడా ఏమిటో స్పష్టంగా తెలిసిపోయిందా ?ycp mlcs jagan naidu tdp amaravati vizag;women;venkatesh;choudary actor;editor mohan;naga chaitanya;srinivas;tiru;telugu desam party;jagan;rajya sabha;mp;telugu;tirupati;husband;woman;ycp;sujana choudary;chaitanya 1;reddy;corporate;party;sajjala ramakrishna reddySat, 27 Feb 2021 05:00:00 GMTఒకరేమో ఇచ్చిన మాటపై నిలబడాలని అనుకునే వ్యక్తి. మరొకళ్ళేమో నోటికేదొస్తే సమాయానికి తగ్గుట్లుగా ఆ హామీ ఇచ్చేసే వ్యక్తి. వీళ్ళద్దరే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబానాయుడు. ఇపుడు వీళ్ళద్దరి గురించి జనాలు మాట్లాడుకునే సందర్భం వచ్చింది. ఆ సందర్భం ఏమిటంటే ఆరు ఎంఎల్సీ స్ధానాల భర్తీ విషయంలో వైసీపీ తరపున ఎంపికైన అభ్యర్ధుల ప్రకటనే. ఆరుగురి అభ్యర్ధుల ప్రకటనలో ఇద్దరు ముస్లిం మైనారిటీలున్నారు. వీరిలో ఒకరు మహిళ. ఇక మరో యువకుడు బల్లి కల్యాణచక్రవర్తి. మరో వ్యక్తి ఐపీఎస్ మాజీ అధికారి మహమ్మద్ ఇక్బాల్. అలాగే చల్లా భగీర్ధరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, సీ రామచంద్రయ్యలున్నారు. వీరందరిలో మైనారిటి మహిళ కోటాలో ఎంపికైన వ్యక్తి కరీమున్నీసా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.




ఎందుకంటే ఆమె ఓ మామూలు కార్యకర్త. రేపటి మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడలోని 59వ డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నారు. అలాంటామెను జగన్ ఏకంగా ఎంఎల్సీగా ఎంపిక చేశారు. ఇలాంటి ఎంపికను తెలుగుదేశంపార్టీ అసలు ఊహించలేరు. ఇక బల్లి కల్యాణ్, భగీరధరెడ్డిల తండ్రులు దివంగత తిరుపతి ఎంపి బల్లి దుర్గాప్రసాద్ రావు, దివంగత ఎంఎల్సీ చల్లా రామకృష్ణారెడ్డి వారసులు. అనారోగ్యంతో తండ్రులు చనిపోగానే వాళ్ళను రాజకీయంగా ఆదుకుంటానని జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారమే ఇద్దరినీ ఎంఎల్సీలుగా ఎంపిక చేశారు. ఇచ్చిన హామీని చంద్రబాబు ఏనాడైనా నిలుపుకున్నారా అనే విషయంలో ఇపుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  




తెలుగుదేశంపార్టీలో చూస్తే ఎంఎల్సీ అయినా రాజ్యసభ అయినా చంద్రబాబు ఎంపిక చేసిన వ్యక్తులు ఖరీదైన కార్పొరేట్ అధిపతులే. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు, చైతన్య రాజు లాంటి వాళ్ళను చూస్తే చాలు వాళ్ళ నేపధ్యం ఏమిటో అర్ధమైపోతుంది. వచ్చేది ఒకటే సీటైనా నాలుగు సీట్లైనా చంద్రబాబు చాలామందికి హామీ ఇచ్చేస్తారు. చివరకు ఎవరో కార్పొరేట్లను ఎంపిక చేస్తారు. చంద్రబాబు ఎంపికలో అత్యధికం ఇలాంటివే అనటంలో సందేహం లేదు. జగన్ కూడా గతంలో కొందరికి హామీ ఇచ్చుండచ్చు. కానీ వచ్చే పదవులను బట్టి ఎవరికిస్తే బాగుంటుందనే విషయాన్ని ఫైనల్ చేస్తారు. ఇప్పటివరకు ఇలా ఎంపికైనా వారిని చూస్తే తప్పు పట్టినవాళ్ళెవరు లేరు. ఇక్కడే జగన్-చంద్రబాబు గురించి జనాల్లో చర్చ జరుగుతోంది.




గుణశేఖర్ శాకుంతలం.. సమంత నటవిశ్వరూపం నేషనల్ అవార్డ్ పక్కా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండిషన్లు ఏంటో మీరే చూడండి..!

‘పుష్ప’లో రష్మిక క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందోచ్.. ఈ చిన్నదానికి స్మగ్లింగ్ బ్యాచ్ తో ఎలా కుదిరిందో చెమ్మా..?

మార్చి 15న RRR??

వామ్మో.. ప్రభాస్ రెమ్యూనరేషన్ ను ఆ హీరోల రేంజ్ లో తీసుకుంటున్నారా?

పూజ v/s రష్మిక..ఇద్దరి మధ్య ఎవరు ఊహించని విదంగా నడుస్తున్న పోరు

పుర పోరు : ఆ మాజీ ఎమ్మెల్యే విశాఖ మేయర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>