Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/england-former-captain-said-that-ahmedabad-test-loose-is-not-a-matter367a1ffe-0076-46ca-93c3-a329546844eb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/england-former-captain-said-that-ahmedabad-test-loose-is-not-a-matter367a1ffe-0076-46ca-93c3-a329546844eb-415x250-IndiaHerald.jpgఇండియాతో జరిగిన మూడో టెస్టులో తమ జట్టు ఓడిపోవడం పెద్ద విషయమేమీ కాదని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖెల్ వాన్ అన్నాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియాది గెలుపే కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలా టెస్టులో ఎవరూ గెలవలేదని మైఖేల్‌ వాన్‌ వ్యాఖ్యానించాడు. మొతేరా స్టేడియంలో జరిగిన ఈ మూడో టెస్టు రెండు రోజుల్లోనే పూర్తి కావడంపై మైఖెల్ తీవ్ర విహర్శలు గుప్పించాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో..ahmedabad test;india;kanna lakshminarayana;bcci;interview;paruguఇండియాది గెలుపే కాదు.. అంతా బీసీసీఐ ప్లాన్.. ఇంగ్లండ్ అక్కసు!ఇండియాది గెలుపే కాదు.. అంతా బీసీసీఐ ప్లాన్.. ఇంగ్లండ్ అక్కసు!ahmedabad test;india;kanna lakshminarayana;bcci;interview;paruguSat, 27 Feb 2021 19:39:25 GMTఇంటర్నెట్ డెస్క్: ఇండియాతో జరిగిన మూడో టెస్టులో తమ జట్టు ఓడిపోవడం పెద్ద విషయమేమీ కాదని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖెల్ వాన్ అన్నాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియాది గెలుపే కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలా టెస్టులో ఎవరూ గెలవలేదని మైఖేల్‌ వాన్‌ వ్యాఖ్యానించాడు. మొతేరా స్టేడియంలో జరిగిన ఈ మూడో టెస్టు రెండు రోజుల్లోనే పూర్తి కావడంపై మైఖెల్ తీవ్ర విహర్శలు గుప్పించాడు.

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా మైఖెల్ వాన్ మళ్లీ తన నోటికి పనిచెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో అదృష్టం కొద్ది పరుగులు సాధించే విధంగా పరిస్థితుల్ని కల్పించుకోవడం టెస్టు క్రికెట్‌‌ అనిపించుకోదంటూ ఘాటుగా స్పందించాడు. ఇలాంటి పిచ్‌లతో టెస్టు ఛాంపియన్‌షిప్‌కు పోటీపడితే ఆ పాయింట్లను తొలగించాలని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

బీసీసీఐ ఇష్టం వచ్చినట్లు చేసేందుకు ఐసీసీ నుంచి పూర్తి అనుమతి ఉంటుందని, అందుకే టీమిండియాకు అనుకూలంగా అన్ని సమకూరుతాయని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీనివల్ల టీమిండియా లాభపడొచ్చుకానీ, అంతిమంగా టెస్టు క్రికెట్‌కు నష్టం జరుగుతుందని మైఖెల్ వాన్ అన్నాడు.

‘తొలి టెస్టు తర్వాత కోహ్లీసేన 1-0 తేడాతో వెనుకబడిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో బీసీసీఐ ఓ ప్లాన్ వేసింది. తొలి బంతి నుంచే పిచ్‌ స్పందించేలా రెండో టెస్టు నుంచి పిచ్ రెడీ చేసింది. ఇది ఆందోళన కలిగించే విషయం. ఆ సహకారంతోనే టీమిండియా మూడో టెస్టులో విజయం సాధించింద’ని మైఖెల్ వ్యాఖ్యానించాడు. అయితే టీమిండియా గెలుపు గెలుపే కాదని, అదో నిస్సారమైన గెలుపని తీవ్ర విమర్శలు చేశాడు.

తన దృష్టిలో ఈ టెస్టులో ఏ జట్టూ విజయం సాధించలేదని, అయితే స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై టీమిండియా బ్యాట్స్‌మన్ కచ్చితంగా మంచి ప్రదర్శన చేశారు. ఇంగ్లాండ్‌ కన్నా బాగా ఆడారు. ఈ విషయం కచ్చితంగా ఒప్పుకోవాలి. కానీ, ఆటలో మంచితో పాటు చెడును కూడా గ్రహించాలి. మాజీ ఆటగాళ్లుగా ఆ బాధ్యత మాపై ఉంది’ అని వాన్‌ పేర్కొన్నాడు. ఈ సిరీస్‌ ద్వారా ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు కొంతమంది తమ కెరీర్‌కు పునాది వేసుకోవాలని ఉత్సాహంగా ఉన్నారని, అయితే అలాంటి వారికి ఇండియా సిరీస్ ఓ చేదు అనుభవమని అభిప్రాయపడ్డాడు.


ఎడిటోరియల్: కేసీఆర్ పాచిక గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పారుతుందా? పతనమౌతుందా?

బాలయ్య స్థానంలో నాగార్జున.. మెప్పించగలడా..??

బీజేపీతో పొత్తు అవ‌స‌ర‌మా? ఆలోచ‌న‌లో ప‌డ్డ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

పవన్ క్రిష్ మూవీ నుండి మరో అప్డేట్...?

తిరుపతి సీటు జనసేనదేనట... ?

పుర పోరు : ఒకే వార్డులో ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు పోటీ ?

మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా దెబ్బకు ఆహా షేక్.. !?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>