PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-vaccinee53807ec-ff5e-44d1-88fc-2ab67fa578f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-vaccinee53807ec-ff5e-44d1-88fc-2ab67fa578f9-415x250-IndiaHerald.jpgభారత్ ప్రపంచశక్తిగా ఎదుగుతోందని మరోసారి రుజువైంది. మన ఇండియా మరోసారి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.. కరోనా పుణ్యమా అని ఇండియా ఖ్యాతి ప్రపంచంలో మారుమోగుతోంది. కరోనా టీకాల విషయంలో భారత్‌ ఖాతాలో అనేక రికార్డులు నమోదవుతున్నాయి. కరోనాపై చేస్తున్న పోరాటం కారణంగా ఇప్పుడు ఇండియావైపు ప్రపంచం మొత్తం చూస్తోంది. కరోనా మహమ్మారి పీచమణిచే వ్యాక్సీన్‌ రూపొందించం ద్వారా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడు భారత్ గర్వించే మరో విషయం ఏంటంటే.. దేశీయ ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌తో బ్రెజిల్‌ ప్రభుindia-vaccine;mithra;india;sri lanka;population;international;marchశభాష్‌ ఇండియా.. బ్రెజిల్‌ ప్రాణాలు కాపాడుతున్న భారత వ్యాక్సిన్‌..!శభాష్‌ ఇండియా.. బ్రెజిల్‌ ప్రాణాలు కాపాడుతున్న భారత వ్యాక్సిన్‌..!india-vaccine;mithra;india;sri lanka;population;international;marchSat, 27 Feb 2021 11:00:00 GMTభారత్ ప్రపంచశక్తిగా ఎదుగుతోందని మరోసారి రుజువైంది. మన ఇండియా మరోసారి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.. కరోనా పుణ్యమా అని ఇండియా ఖ్యాతి ప్రపంచంలో మారుమోగుతోంది. కరోనా  టీకాల విషయంలో భారత్‌ ఖాతాలో అనేక రికార్డులు నమోదవుతున్నాయి. కరోనాపై చేస్తున్న పోరాటం కారణంగా ఇప్పుడు ఇండియావైపు ప్రపంచం మొత్తం చూస్తోంది. కరోనా మహమ్మారి పీచమణిచే వ్యాక్సీన్‌ రూపొందించం ద్వారా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది.

ఇప్పుడు భారత్ గర్వించే మరో విషయం ఏంటంటే.. దేశీయ ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌తో బ్రెజిల్‌ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 20 మిలియన్‌ డోసుల కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ కోసం ఆ దేశ ఆరోగ్య శాఖ భారత కంపెనీతో కొనుగోలు ఒప్పందం చేసుకుంది.  20 మిలియన్‌ డోసుల్లో తొలి 8 మిలియన్లు బ్రెజిల్‌లోని ప్రెసిసా మెడికామెంటోస్‌లోనే ఉత్పత్తి అవుతాయని.. అవి మార్చి నాటికి అందుతాయని ఆ దేశ అధ్యక్షుడు బోల్సోనారో అధికార యంత్రాంగం వెల్లడించింది.

మిగిలిన 8 మిలియన్ల డోసులు ఏప్రిల్‌లో, తదుపరి నాలుగు మిలియన్ల డోసులు మే నాటికి అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 1,03,90,461 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 2,51,498 మంది మృత్యువాతపడ్డారు. కేసులపరంగా బ్రెజిల్‌ ప్రపంచంలో మూడో స్థానంలో ఉండగా.. మరణాల్లో రెండో స్థానంలో ఉంది. ఆ దేశ జనాభా 21 కోట్ల కాగా.. ఇప్పటి వరకు దాదాపు నాలుగు శాతం మందికి టీకా అందింది.

బ్రెజిల్‌ కే కాదు.. తన పొరుగుదేశాలకు కూడా ఇండియా కరోనా వ్యాక్సీన్‌ ఉచితంగా అందిస్తూ.. మిత్ర దేశాల అభిమానం చూరగొంటోంది. మన శాస్త్రవేత్తల కృషి పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచంలో ఇండియా గర్వంగా తలెత్తుకుంటోంది. దాదాపు 150కి పైగా దేశాలు మాకూ టీకా సరఫరా చేయరా ప్లీజ్‌ అంటూ ఇండియాను కోరుతున్నాయి. ఇండియా కూడా స్వార్థం చూసుకోకుండా శ్రీలంక సహా మరో 7 పొరుగు దేశాలకు... సహాయం కింద వ్యాక్సిన్‌ పంపింది. ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇండియాను పొగిడింది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక ప్రశంసలతో ఇండియా గ్రాఫ్‌ అంతర్జాతీయంగా మరో మెట్టు ఎక్కింది.




ఇక లాభం లేదు... రంగంలోకి దిగిన జగన్

పుర పోరు: 12 కార్పొరేష‌న్ల‌లో ఆరు మావే అంటోన్న టీడీపీ.. లిస్ట్ ఇదే ?

పుర పోరు : విశాఖలో వేడెక్కించేసిన వైసీపీ...?

జూనియర్ ఎన్టీయార్ ఎంట్రీకి బాబు ఓకేనా..?

పుర పోరు: ఏపీలో జ‌గ‌నోరికి దెబ్బ ప‌డేది ఇక్క‌డే.. డౌటే లేదు..?

ఆ ముగ్గురు మంత్రుల‌కు కేసీఆర్ అగ్నిప‌రీక్ష‌

అవును అది భూత‌ల స్వ‌ర్గం.. ఇలాపైకి వ‌చ్చి అక్క‌డ అప్స‌ర‌స‌లు స్నానం చేస్తారంట‌...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>