Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/mother-torture-childrens-hyderabad-telangana55d5ebb5-54da-47af-a10e-1b96092a15f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/mother-torture-childrens-hyderabad-telangana55d5ebb5-54da-47af-a10e-1b96092a15f2-415x250-IndiaHerald.jpgతన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల పట్లే ఓ తల్లి కర్కషంగా ప్రవర్తించింది. ఏమీ తెలియని పసి కందులని కూడా చూడకుండా అట్లకాడతో వాతలు పెట్టింది. మరీ ఇంత దారుణంగా ఆ తల్లి తన పిల్లల పట్ల ఇలా ఎందుకు ప్రవర్తించిందో తెలుసా? ఆమెకు తన భర్తపై కోపమే ఇంతటి దారుణానికి తీసింది. భర్తపై కోపం వచ్చిందని.. ఆ ప్రతాపాన్నంతా తన ఇద్దరు పిల్లలపై చూపించింది ఆ తల్లి. సహనంతో ఉండాల్సిన ఆ తల్లి.. పేగుతెంచుకుని పుట్టిన పిల్లలపై ఇలా దయ, జాలీ అంటూ ఏవీ లేకుండా వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో చోటcrime;pavani;hyderabad;vihar;district;huzur nagar;police;local language;vఇదెక్కడి దారుణం.. భర్తపై కోపం వస్తే.. పిల్లలకు వాతలా?ఇదెక్కడి దారుణం.. భర్తపై కోపం వస్తే.. పిల్లలకు వాతలా?crime;pavani;hyderabad;vihar;district;huzur nagar;police;local language;vSat, 27 Feb 2021 18:33:07 GMTహైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఈ దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆమెపై కేసునమోదు చేసుకుని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాదలో ని సనత్ నగర్ లో బోరబండలోని వి.రామారావునగర్ లో పావని, రాజు అనే దంపతులు తమ పిల్లలతో నివసిస్తున్నారు. ఈ దంపతులకు జ్ఞానేశ్వర్‌ (5),అనే ఒక కొడుకు, మహాలక్ష్మి(4) కూతురు ఉంది. అయితే ఈ దంపతులు ఈ నెల 23 తారీఖున ఏదో ఒక విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవతో ఆమెకు భర్తపై పట్టరాని కోపం వచ్చింది. భర్తపై ఉన్న కోపాన్ని ఎలా చల్లార్చుకోవాలో తెలియక.. ఆ కోపాన్నంతా.. తన ఇద్దరు పిల్లలపై చూపించింది. తన భర్తలేని సమయంలో.. పావని తన పిల్లలను దారుణంగా కొట్టింది.

దాంతో ఆగకుండా.. అట్లకాడను వేడి చేసి మరీ వారి లేత చేతులు , కాళ్లపై దారుణంగా వాతలు పెట్టింది. ఆ నొప్పిని తాలలేక ఆ చిన్నారులు గట్టిగా కేకలు పెట్టారు. దాంతో చుట్టుపక్కల వారు చూసి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా స్థానిక అంగన్ వాడీ టీచర్ మాత్రం జిల్లా సంక్షేమ అధికారి దృష్టికి  ఈ దారుణాన్ని తీసుకెళ్లారు. కాగా ఈ దారుణంపై లీగల్ కమ్ ప్రొబేషన్ అధికారి పోలీసులకు ఈ నెల 25న పావనిపై ఫిర్యాదు చేసింది. దాంతో సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేసి పావనిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా గాయపడ్డ చిన్నారులను శిశువిహార్ కు అప్పగించి చికిత్స అందిస్తున్నారు. 


కేసీఆర్ పై బిజెపి నేత వివాదాస్పద వ్యాఖ్య... దారుణమైన పోలిక

ఎడిటోరియల్: కేసీఆర్ పాచిక గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పారుతుందా? పతనమౌతుందా?

బాలయ్య స్థానంలో నాగార్జున.. మెప్పించగలడా..??

బీజేపీతో పొత్తు అవ‌స‌ర‌మా? ఆలోచ‌న‌లో ప‌డ్డ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

పవన్ క్రిష్ మూవీ నుండి మరో అప్డేట్...?

తిరుపతి సీటు జనసేనదేనట... ?

పుర పోరు : ఒకే వార్డులో ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>